Home /News /telangana /

THE TELANGANA GOVERNMENT HAS ISSUED ORDERS SETTING UP AN URBAN DEVELOPMENT AUTHORITY WITH 143 VILLAGES IN MAHBUBNAGAR MBNR PRV

Telangana: ఎట్టకేలకు ఆ జిల్లా  కల సాకారం.. నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటు.. మూడు పురపాలికల్లో 143 గ్రామాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆ జిల్లాకు మూడేళ్లుగా ఎదురు చూస్తున్న నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ (మూడా) ఏర్పాటు కల సహకారం అయింది. ప్రభుత్వం సోమవారం జీవో విడుదల చేయడంతో స్థానికంగా ఆనందం వ్యక్తమవుతోంది

    (న్యూస్ 18 మహబూబ్ నగర్.. సయ్యద్ రఫీ)

    మూడేళ్లుగా ఎదురు చూస్తున్న మహబూబ్​నగర్ (Mahbubnagar)​ నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ (మూడా) ఏర్పాటు కల సహకారం అయింది. తెలంగాణ (Telangana) ప్రభుత్వం సోమవారం జీవో విడుదల చేయడంతో స్థానికంగా ఆనందం వ్యక్తమవుతోంది. మహబూబ్​నగర్ జడ్చర్ల భూత్పూర్ పురపాలిక లతో పాటు 12 మండలాల పరిధిలోని  143 గ్రామాలు మరింత అభివృద్ధి దిశగా పయనించనున్నాయి. 2020 అక్టోబర్ లో మహబూబ్​నగర్​ నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ (Mahbubnagar Urban Development Authority) ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ వెంకట్రావు ప్రతిపాదనలు పంపించగా ఏడాదిన్నర అనంతరం తెలంగాణ (Telangana) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    రెండు జలాశయాలు మూడా పరిధిలోకి..

    పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లో భాగంగా కార్వేన, ఉదండాపూర్ జలాశయాలు మహబూబ్​నగర్​ నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ (Mahbubnagar Urban Development Authority) పరిధిలోకి రానున్నాయి. జలాశయాల వద్ద సుందరీకరణ పర్యాటక అభివృద్ధి కి మహబూబ్​నగర్​ నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ ద్వారా మంజూరైన నిధులు ఉపయోగపడతాయి. మహబూబ్​నగర్​ నగర అభివృద్ధి ప్రాధికార సంస్థకి ప్రత్యేక కార్యాలయం అవసరం ఉంటుంది. అధికారుల నియామకం సిబ్బంది కేటాయింపు అవసరం ప్రస్తుతానికి వీటిపై స్పష్టత లేదు. ప్రస్తుతం ప్రాధికార సంస్థ కమిటీని ప్రకటించారు.

     చైర్మన్​గా జిల్లా కలెక్టర్​..

    మహబూబ్​నగర్​ జిల్లా కలెక్టర్ వెంకట్రావు చైర్మన్​గా,​ పురపాలక కమిషనర్ ప్రదీప్ కుమార్ వైస్ చైర్మన్​ వ్యవహరించనున్నారు. వీరితోపాటు జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సి డి ఎం ఏ కమిషనర్ సత్యనారాయణ సభ్యులుగా ఉండనున్నారు. మహబూబ్​నగర్​ నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ (Mahbubnagar Urban Development Authority) పరిధిలోకి మహబూబ్​నగర్ జడ్చర్ల దేవర్కద్ర పరిగి నియోజక వర్గాలకు వచ్చాయి పరిగి నియోజకవర్గంలోని మహమ్మదాబాద్ రంగయ్యపల్లి గ్రామాలను కూడా ఈ సంస్థలు కలిపారు మహబూబ్​నగర్  జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలు మహబూబ్​నగర్​ నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలోకి వచ్చాయి.

    నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పడితే..?

    ● ఆ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ ఉంటుంది..● 40 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాను రూపొందిస్తారు● కేంద్ర ప్రభుత్వం పథకాలైన స్మార్ట్ సిటీ హృదయ అమృత్ పథకం ద్వారా నిధులు భారీగా వస్తాయి.● ఈ సంస్థ పరిధిలోని అన్ని ప్రాంతాలకు రహదారుల సౌకర్యం కలుగుతుంది..● పురపాలిక లతోపాటు గ్రామాల్లోనూ ఉద్యానవనాలు చిన్నారుల ఆట స్థలాలు ఏర్పాటు చేస్తారు..●  అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక చేస్తారు ● పురపాలిక లకే పరిమితమైన అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ గ్రామాల్లోని పకడ్బందీగా అమలు అవుతుంది ● హైమాస్ట్ లైట్లు వీధి దీపాలు ఈ ప్రాంతాల్లో రహదారుల వెంట ఉంటాయి ● సుందరీకరణ లో భాగంగా రెండు పరిసరాల రహదారుల నిర్మిస్తారు ● ఇంటి నిర్మాణం చేపట్టాలంటే నిబంధన అమలు తప్పనిసరి ● లేఅవుట్లు వెంచర్లు చేయాలంటే ప్రాధికార సంస్థ నుంచి అనుమతి తప్పనిసరి అక్రమ లే అవుట్ లకు ఆస్కారం ఉండదు..

    కార్పొరేషన్  కాకుండానే..

    తెలంగాణలోని ప్రస్తుతం ఉన్న నగర అభివృద్ధి సంస్థ కేంద్రాలకు కార్పొరేషన్లు ఉన్నాయి. సాధారణంగా కార్పొరేషన్ ఉన్న నగరానికి అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటు చేస్తారు. కానీ మహబూబ్​నగర్​ ఇప్పటికీ పురపాలిక నే కార్పొరేషన్ ఏర్పాటు కాకుండానే మహబూబ్​నగర్​  అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు కావడం విశేషం. మహబూబ్​నగర్​ జడ్చెర్ల భూత్పూర్ పురపాలికలు ప్రస్తుతం ఉన్న విధంగానే ఉంటాయి. పాలకవర్గాలు అలానే ఉంటాయి .గ్రామాలు అలానే ఉంటాయి. సర్పంచులు వార్డ్ సభ్యులు అలానే ఉంటారు. అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయింపు లే అవుట్లు వెంచర్లు అనుమతులు మాత్రం మహబూబ్​నగర్​  పరిధిలోకి వస్తాయి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Mahbubnagar

    తదుపరి వార్తలు