Home /News /telangana /

THE TELANGANA GOVERNMENT HAS ISSUED ORDERS IMPOSING RESTRICTIONS ON CHRISTMAS AND NEW YEAR CELEBRATIONS IN THE WAKE OF OMICRON PRV

Telangana restrictions on New year Celebrations: న్యూ ఇయర్​ వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు.. ఒమిక్రాన్​ నేపథ్యంలో అలర్ట్​.. నిబంధనలు పాటించాలంటూ ఉత్తర్వులు

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

ఒమిక్రాన్​ నేపథ్యంలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

    అన్ని దేశాలతో పాటు భారత‌లోనూ ఒమిక్రాన్ (Omicron) టెన్షన్ నెలకొంది. చాపకింద నీరులా ఈ వేరియెంట్ విస్తరిస్తోంది. కొత్త కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇక క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో మరింతగా విజృంభించే ప్రమాదం ఉన్నందున పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు (restrictions) విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో న్యూ ఇయర్‌ వేడుకలపై హైకోర్టు (High-count) కీలక ఆదేశాలు ఇచ్చింది. గురువారం కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరగ్గా.. రాష్ట్రంలో ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోందని.. అందుకే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని (Restrictions On Christmas and New Year celebrations) ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు (Orders) ఇవ్వాలని సూచించింది.ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana state government) కీలక ఆదేశాలు (Orders)  జారీ చేసింది.

    ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం..

    నేటి నుంచి జనవరి 2 వరకు ఆంక్షలు(Telangana restrictions on new year Celebrations)  వర్తిస్తాయని పేర్కొంది. న్యూ ఇయర్ వేడుకల్లో కొవిడ్ నిబంధనలు (Corona Restrictions) పాటించాలని సూచించింది. వేడుకల్లో భౌతిక దూరం, మాస్కులు ధరించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ రోజు నుంచి జనవరి 2 వరకు ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం (Ban on rallies and public meetings) విధించింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. పబ్లిక్ ఈవెంట్స్ లో భౌతిక దూరం (Social Distance) తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

    మిగతా రాష్ట్రాల్లోనూ..

    క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల (Christmas new year celebrations) నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. రాత్రిపూట కర్ఫ్యూతో పాటు పగటి పూట కూడా కొన్ని ఆంక్షలు విధిస్తున్నాయి. మరి ఏ రాష్ట్రాల్లో ఎలాంటి ఆంక్షలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం. ఢిల్లీ ప్రజలు (Delhi people) కనీసం ఒక్క డోసైనా వ్యాక్సిన్ (Vaccine) వేసుకొని ఉండాలి. క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా సామూహిక వేడుకలపై నిషేధం విధించారు. రెస్టారెంట్స్, బార్స్‌లో 50 శాతం సామర్థ్యంతోనే నడవాలి. పెళ్లిళ్లకు 200 మందికి మించి హాజరుకాకూడదు.

    రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ..

    మహారాష్ట్రలో కరోనా ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో అక్కడ నైట్ కర్ఫ్యూ విధించారు. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. రాత్రి పూట ఐదు మంది కంటే ఎక్కవగా గుమిగూడకూడదు. డిసెంబరు 31 అర్ధరాత్రి వరకు ముంబైలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. మధ్యప్రదేశ్‌లో రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. కోవిడ్ ప్రోటోకాల్‌ను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం హెచ్చరించింది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: CM KCR, Covid 19 restrictions, New Year 2022, Omicron, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు