హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : వర్షాలు, వరదలతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం​

Telangana : వర్షాలు, వరదలతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం​

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు, వరద బాధిత ముంపు ప్రాంతాల,. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు, డాక్టర్లతో.. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సమీక్షించారు. ఈ నేఫథ్యంలో హెల్త్​ క్యాంపులపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు, వరద బాధిత ముంపు ప్రాంతాల,. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు, డాక్టర్లతో.. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సమీక్షించారు. ఈ నేఫథ్యంలో హెల్త్​ క్యాంపులపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు, వరద బాధిత ముంపు ప్రాంతాల,. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు, డాక్టర్లతో.. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సమీక్షించారు. ఈ నేఫథ్యంలో హెల్త్​ క్యాంపులపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

    తెలంగాణలో వారం రోజులు పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో (heavy rains) గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీరాం సాగర్, ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులకు కొంత వరద ఉధృతి తగ్గినప్పటికీ.. భద్రాచలం వద్ద మాత్రం గోదావరిలో వరద (Floods) ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఉదయం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 71.00 అడుగులకు చేరింది. ప్రస్తుతం గోదావరిలో 24,29,246 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం అక్కడ మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పరివాహక ప్రాంతంలోని వరద ఉద్ధృతికి 95 గ్రామాలు నీటమునిగాయి.  ఈ నేపథ్యంలో గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్‌ ఆదివారం ఉదయం ఏరియల్‌ సర్వే (CM KCR Aerial Survey) నిర్వహించనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి (CM KCR) ఆదేశాల మేరకు, వరద బాధిత ముంపు ప్రాంతాల,. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు, డాక్టర్లతో.. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

    హెల్త్ క్యాంపుల్లో మందులు సరఫరా..

    గోదావరి పరీవాహక వరద ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా యుద్దప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. ముంపు గ్రామాల్లో హెల్త్ క్యాంపులను (Health Camps) ఏర్పాటు చేయాలన్నారు. డాక్టర్లందరూ సెలవులు తీసుకోకుండా, తప్పనిసరిగా డ్యూటీలు నిర్వహిస్తూ.. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపుల్లో  (Health Camps)  పరీక్షలు నిర్వహిస్తూ, మెడిసిన్లను ప్రజలకు అందుబాటులో ఉంచి సరఫరాచేయాలన్నారు. ఈ మేరకు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావును కొత్తగూడెం కేంద్రంగా., మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ రమేశ్ రెడ్డి ని మంచిర్యాల కేంద్రంగా విధులు నిర్వహిస్తూ హెల్త్ క్యాంపులు  (Health Camps) తదితర ప్రజారోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో పాల్గొనాలని, అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ ఉన్నారు.

    సీఎం ఏరియల్​ సర్వే..

    భారీ వర్షాల (Heavy rains) కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. కడెం నుంచి భద్రాచలం వరకు వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో వరద పరిస్థితిని సీఎం కేసీఆర్‌ (CM KCR) పరిశీలించనున్నారు. రెండు, మూడు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సమీక్ష చేయనున్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను పరిశీలిస్తారు. ఏరియల్‌ సర్వే (Aerial Survey)లో ముఖ్యమంత్రితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ పాల్గొననున్నారు. ఏరియల్ సర్వే (Aerial Survey)కు సంబంధించిన హెలికాప్టర్ రూటు సహా తదితర విధివిధానాలను అధికార యంత్రాంగం పర్యవేక్షించి ఫైనల్ చేయనున్నది. కాగా, ప్రజారోగ్య సంరక్షణలో భాగంగా వరదల వల్ల అంటువ్యాధులు ప్రబలకుండా సీఎం కేసీఆర్ (KCR)ఆదేశాలమేరకు గోదావరి వరద ముంపు ప్రాంతాల్లోని దవాఖానాలకు చెందిన డాక్టర్లు, ఉన్నతాధికారులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్షాసమావేశం నిర్వహిస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో సంబంధిత కార్యాచరణపై వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తున్నది.

    First published:

    Tags: CM KCR, Harish Rao, Health care, Health minister, Heavy Rains, Telangana

    ఉత్తమ కథలు