Home /News /telangana /

THE TELANGANA GOVERNMENT HAS DECIDED TO SET UP ANOTHER 131 NEW BASTI HOSPITALS FULL DETAILS HERE PRV

CM KCR Good news: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్​ గుడ్​న్యూస్​.. ఇప్పటివరకు హైదరాబాద్​కే పరిమితమైన ఆ సేవలు రాష్ట్రానికి వర్తింపు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో త్వరంలో మరో 131 బస్తీ దవాఖానాలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ లోని బస్తీ దవాఖానాలకు ఆదరణ పెరగడంతో ఇతర జిల్లాల్లోనూ వీటిని ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నది

  ఇటీవలె ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యవంతమైన సమాజంతోనే అభివృద్ధి సాధ్యమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోందని అన్నారు. ఆ దిశగా ప్రజారోగ్యం మెరుగు పరిచేందుకు దోహదపడే పలు పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని సీఎం తెలిపారు. ఈ దిశగా రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, వైద్య వ్యవస్థను బలోపేతం చేసిందని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వం బస్తీ దవాఖానాలు నిర్వహిస్తూ సత్ఫలితాలను సాధించిందని, మిగతా పట్టణాల్లో కూడా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసే చర్యలు చేపట్టిందని అన్నారు. తద్వారా ప్రజలకు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చి, ప్రజారోగ్య పరిరక్షణకు పాటుపడుతోందని తెలిపారు. ఇపుడు ఆ మాటలు కార్యరూపం దాల్చాయి. తెలంగాణలో (Telangana) త్వరంలో మరో 131 బస్తీ ఆసుపత్రులను (Basti Hospitals) అందుబాటులోకి రానున్నాయి.

  సంగారెడ్డి (Sanga reddy), ఆదిలాబాద్, హనుమకొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, జగిత్యాల, సూర్యాపేట, సిద్దిపేట, మహబూబ్ నగర్, నల్లగొండ, పెద్దపల్లి, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, మంచిర్యాల, వికారాబాద్, కామారెడ్డి, జోగులాంబ గద్వాల, వనపర్తి, రాజన్న సిరిసిల్లా, మెదక్ జిల్లాల్లో ఈ దవాఖానాలు ఏర్పాటు చేయనున్నారు.  అయితే ఈ బస్తీ దవాఖానాల కోసం ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి. అవసరమైన సిబ్బందిని వెంటనే రిక్రూట్ చేయాలని ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ శ్వేతా మహంతి (Family Welfare Commissioner Shweta Mahanti) అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇదివరకే ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా పోస్టుల రిక్రూటు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒక్కో దవాఖానాలో (Hospital) మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు, సపోర్టు స్టాప్స్​ చొప్పున 131 కేంద్రాలకు అనుమతి ఇచ్చారు.

  హైదరాబాద్​లో ఆదరణ లభించడంతో..

  మెడికల్ ఆఫీసర్కు (Medical Officer) ప్రతీ నెల రూ.52 వేలు, స్టాఫ్ నర్సుకు రూ. 29,900, సపోర్టు స్టాఫ్కు రూ. 10 వేల చొప్పున వేతనాలు చెల్లించనున్నారు. హైదరాబాద్ (Hyderabad) లోని బస్తీ ఆసుపత్రులకు  (Basti Hospitals) ఆదరణ పెరగడంతో ఇతర జిల్లాల్లోనూ వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేయగా, కొత్తగా మరో 131ని అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని వలన జిల్లా, టీచింగ్ ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గనుంది. బస్తీ దవాఖానాల్లో ప్రాథమిక వైద్యం అందడం వలన పేషెంట్లకు గోల్డెన్ అవర్ మిస్ కాకుండా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వీటిలో దాదాపు 57 రకాల రక్త పరీక్షలు నిర్వహించనున్నారు. పేషెంట్ల అవసరాన్ని బట్టి 136 రకాలుగా పెంచే ఛాన్స్ కూడా ఉన్నదని  స్పష్టం చేసింది వైద్య శాఖ. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లోనే సీఎం కేసీఆర్​ దవాఖానాల ఏర్పాటుపై కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో బస్తీ దవఖానాల్లాగే.. గ్రామాల్లోనూ పల్లె దవాఖానాల (Village Hospitals)ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: CM KCR, Hospitals, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు