Home /News /telangana /

THE TELANGANA GOVERNMENT HAS DECIDED TO REDUCE THE WORKING HOURS OF MUSLIM EMPLOYEES TO 4 PM FOR A MONTH DURING RAMADAN PRV

Ramadan 2022: రంజాన్ సందర్భంగా ముస్లింలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్​న్యూస్.. ఉత్తర్వులు జారీ.. 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రంజాన్‌ నెలకు విశేష ప్రాధాన్యత ఉంది. నెల రోజులపాటు ఉపవాస దీక్షలతో శరీరం, ఆత్మలోని మలినాలు ప్రక్షాళన కావడంతో పాటు సర్వపాపాలు దహించుకుపోతాయని ముస్లిం మత పెద్దలు చెబుతారు. అయితే ఈ రంజాన్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇంకా చదవండి ...
  ఇస్లాం (Islam) మతంలో రంజాన్‌ నెల (Ramadan Month)కు విశేష ప్రాధాన్యత ఉంది. ధానధర్మాలకు ప్రతీకగా ఈ మాసం నిలుస్తున్నది. నెల రోజులపాటు ఉపవాస దీక్షలతో (Fasting) శరీరం, ఆత్మలోని మలినాలు ప్రక్షాళన కావడంతో పాటు సర్వపాపాలు దహించుకుపోతాయని ముస్లిం మత పెద్దలు చెబుతారు. సూర్యోదయ సమయంలో ‘సహర్‌’ నుంచి సూర్యాస్తమయం సమయంలో జరిపే ఇప్తార్‌ వర కు మంచి నీళ్లు సైతం తాగకుండా ఉపవాసం చేస్తారు. ముస్లింలు (Muslims) పవిత్రంగా భావించే ఖురాన్‌ గ్రంథం ఈ మాసంలోనే (రంజాన్‌) ఆవిర్భవించిందని ముస్లిం మత పెద్దలు చెబుతారు. ముస్లింలు ఈ పండుగను అత్యంత భక్తిశ్రద్ధల తో జరుపుకుంటారు.

  ఏప్రిల్ 3 నుంచి..

  ముస్లింలు  (Muslims) ప్రత్యేకంగా భావించే ఈ రంజాన్ (Ramadan 2022) మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం (Telangana government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, రెగ్యులర్ ముస్లిం ఉద్యోగులకు రంజాన్ మాసం మొదలుకానున్న సందర్భంగా వెసులుబాటు కల్పించింది. ఏప్రిల్ 2 నుంచి రంజాన్ మాసం మొదలుకానున్న నేపథ్యంలో నెలవంక మరుసటి రోజు నుంచి ఉపవాస దీక్షలు చేస్తుంటారు. ఈ క్రమంలో ప్రతి రోజు గంట ముందే అంటే 4 గంటలకే ఇంటికి వెళ్లేందుకు (working hours for Muslim employees to 4 pm) అనుమతించింది. ఈ రంజాన్​ మాసం అనగా ఏప్రిల్​ 3వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు ఈ వెసులుబాటు కల్పిస్తూ ఈ మేరకు  శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  రంజాన్​ గురించి కొన్ని విషయాలు..

  రంజాన్​ మాసంలో ముస్లింలు (Muslims) కఠిన నిబంధనలతో కూ డిన ఉపవాస దీక్షలు, ప్రార్థనలతో గడుపుతారు. ఉదయం 4 గంటల వరకే నిద్ర లేచి నమాజ్‌ చేస్తారు. అలా ప్రతి రో జు ఐదు పూటలు నిర్వహిస్తారు. వీటిని పంచ్‌వక్త అని అం టారు. ఇస్లామిక్‌ క్యాలెండర్‌ ప్రకారం 9వ నెల రంజాన్‌ మాసం, పండుగలు ఏవైనా అందులో ఏదో ఒక సందేశం ఉంటుందని ప్రత్కేకంగా చెప్పాల్సిన పని లేదు.

  నమాజ్‌-ఇ-యేషా అనంతరం రాత్రి 10 గంటల వర కు పవిత్ర ఖురాన్‌ను చదువుతారు. అనంతరం దాదా పు 20 నమాజ్‌లు చేస్తారు. వీటిని ‘తరవి’ నమాజ్‌లు అని అంటారు. ఇక రోజా అనేది పవిత్రమైన ఉపవాసం అనేదానికి పర్యాయపదంగా వా డుతారు. రోజా ఉన్న భక్తుడు తప్పనిసరిగా ఉదయం సహర్‌ నుంచి ఇప్తార్‌ వరకు కనీసం ఉమ్మీ ని కూడా మింగకుండా కఠిన ఉపవాసాలు చేయాలి. సహ ర్‌ ముందు తిన్న ఆహారమే రాత్రి ఇప్తార్‌ వరకు మంచినీరు కూడా ముట్టుకోకుండా కఠిన ఉపవాసాలు నిర్వహిస్తారు.

  సహర్‌ అంటే ప్రతి ముస్లిం రోజా ఉండే రోజు ఉదయం 3 గంటలకు నిద్ర లేచి ఆహారం సిద్ధం చేసుకొని తీసుకుంటారు. సహర్‌ అనేది ఉదయం ఉపవాసం ప్రారంభించే ముందు తీసుకొనే భోజనం. అనంతరం ఫజార్‌ నమాజ్‌ చేసి ఉపవాసాన్ని ప్రారంభిస్తారు. ప్రతి ముస్లిం జకాత్‌ చేయాలనేది ముస్లింల విశ్వాసం. జకాత్‌ అనగా ధానధర్మాలు చేయడం అంటారు. మనం సంపాదించే దానిలో ఖర్చులకు పోనూ మిగతా సంపాదనలో 2.5 శాతం దానం చేయాలి. అలాగే పేద ముస్లింలు సంతోషంగా రంజాన్‌ నెల గడుపడానికి వీలుగా తమకు తోచిన సహాయం చేయాలనేదే ఈ జాకత్‌.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Muslim Minorities, Ramadan 2022, Telangana, Telangana Government

  తదుపరి వార్తలు