హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Police: తెలంగాణ పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్​.. ఆ అలెవెన్సులు రద్దు..

Telangana Police: తెలంగాణ పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్​.. ఆ అలెవెన్సులు రద్దు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇప్పటివరకూ ఇస్తున్న 15 శాతం ప్రత్యేక అలవెన్స్‌ను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ పోలీసులకు (Telangana Police) రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇప్పటివరకూ ఇస్తున్న 15 శాతం ప్రత్యేక అలవెన్స్‌ను (Special allowances) రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) నిర్ణయం తీసుకుంది. కానిస్టేబుళ్ల నుంచి ఎస్సై, సీఐల వరకు ఇచ్చే ఈ ప్రత్యేక అలవెన్స్‌ను పలు జిల్లాల్లో రద్దు చేశారు. గతంలో హైదరాబాద్ (Hyderabad) మినహా మిగిలిన ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో పోలీసులకు ఈ అలవెన్స్‌ ఇచ్చేవారు. మావోయిస్టుల (Maoists) ప్రభావం అధికంగా ఉంటున్న సమయంలో శాంతిభద్రతల విభాగం, ఏఆర్‌ (AR), ప్రత్యేక పోలీస్‌ విభాగాల్లో (Special Police wings) పనిచేసే పోలీసులకు గత నెల వరకు పదిహేను శాతం స్పెషల్ అలవెన్స్ (Special allowances) ఇచ్చేవారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ నెల నుంచి కొన్ని జిల్లాలకు పరిమితం కానుంది.

కొన్ని జిల్లాల్లోని కానిస్టేబుల్, ఎస్ఐ, సీఐలు మాత్రమే ఇకనుంచి స్పెషల్ అలవెన్స్ అందుకోనున్నారు. జిల్లాల్లోని పోలీస్ స్టేషన్‌లకు ఉన్నతాధికారులు సమాచారం అందించారు. త్వరలో దీనిపై ప్రకటన వెలువడనుంది. మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే.. మవోయిస్టు ప్రభావిత ప్రాంతాల గురించి కేంద్ర హోంశాఖ తాజాగా వెలువరించిన జాబితా ఆధారంగా కోత విధించినట్లు సమాచారం. కాగా.. కేంద్ర హోంశాఖ (Union Home Ministry) ఇటీవల 11 రాష్ట్రాల్లోని 90 జిల్లాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి భద్రత సంబంధిత వ్యయం పథకం కింద నిధుల్ని విడుదల చేసింది. దీంతో.. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ఆదిలాబాద్, కొత్తగూడెం, భూపాలపల్లి, ఖమ్మం, కుమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి (Peddapalli), వరంగల్ (Warangal) జిల్లాలున్నాయి. అయితే.. ఆయా జిల్లాల్లో పనిచేస్తున్న వారికి మాత్రం అలవెన్స్ ఇస్తూ.. మిగిలిన జిల్లాలకు కోత విధించడం గమనార్హం. కాగా.. ఆ ఎనిమిది జిల్లాల్లోనూ మావోయిస్టు ప్రభావం అంతగా లేని కొన్ని ఠాణాలకు మినహాయింపు ఇచ్చారు. కాగా, పెద్దపల్లి జిల్లాలోని మంథని, ముత్తారం, పొత్కపల్లి పోలీస్ స్టేషన్లకు మాత్రమే అలవెన్స్ వర్తింపజేయడం లాంటివి ఇపుడు ఆ జిల్లాలో చర్చనీయాంశం అయింది.

Edupayala: ముంచెత్తిన వరదలు.. జలదిగ్బంధంలో ఏడుపాయల పుణ్యక్షేత్రం.. పూర్తి వివరాలివే..

మరోవైపు పోలీస్ వాట్సప్ గ్రూపుల్లో ఈ అంశంపై జోరుగా చర్చ నడుస్తోంది. క్షేత్రస్థాయి పోలీసులకు అలవెన్స్ను రద్దు చేయడంతో తాజావార్తలు తెలంగాణలో నక్సల్స్ లేరని పోలీసులకు ఇచ్చే 15 శాతం స్పెషల్ అలవెన్స్ తొలగించడం మంచిగానే వుంది సార్.. మరి లేని నక్సల్స్ నుంచి రక్షణ కోసం రాజకీయ నాయకులకు, అధికారులకు ఎస్కార్ట్, గన్మెన్లు ఎందుకు..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆఫీసులకు, ఇళ్లకి గార్డులు ఎందుకు ?' అంటూ సందేశాలు తెలుపుతుండటంతో ఈ వార్త కాస్త వైరల్గా మారింది.

First published:

Tags: Full salary, Police, Telangana Police

ఉత్తమ కథలు