Home /News /telangana /

THE TASK FORCE POLICE ARRESTED A GANG PERFORMING EXCAVATIONS FOR SECRET FUNDS POLICE HAVE ARRESTED FOUR HIDDEN TREASURE HUNTERS VB ADB

Telangana: గుప్త నిధుల కోసం తవ్వకాలు.. మరుసటి రోజు ఊహించని ఘటన.. ఏంటో తెలుసుకోండి..

గుప్త నిధుల కోసం తవ్విన గోతులు

గుప్త నిధుల కోసం తవ్విన గోతులు

Telangana: గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు చేస్తూ తవ్వకాలు జరిపే ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు గుప్త నిధుల వేటగాళ్ళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లలో షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    (కట్టా లెనిన్, ఆదిలాబాద్ జిల్లా, న్యూస్ 18 తెలుగు)

    మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కన్నెపల్లి లో గుప్త నిధుల కలకలం చెలరేగింది. గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు చేస్తూ తవ్వకాలు జరిపే ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ విషయం భయటపడింది. నలుగురు గుప్త నిధుల వేటగాళ్ళను పోలీసులు అదుపులోకి తీసుకోగా, ఒకరు పరారయ్యారు. వీరి వద్ద నుండి ఒక ఆటో, పూజా సామగ్రి, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది గుప్తనిధుల వేటగాళ్లు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నారనే పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిఘా పెట్టారు. తాళ్ల రెబ్బన గ్రామ శివారులోని నెన్నెల - కన్నేపల్లి రహదారిలో అనుమానాస్పదంగా వెళుతున్న ఆటోను ఆపి తనిఖీ చేయగా, గుప్తనిధుల కోసం సంచరిస్తున్న 4 గురు నిందితుల ముఠా గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలోని కొంచవెళ్లి మహేష్ అనే వ్యక్తి ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపడానికి వెళుతున్నట్టు వెల్లడించారు.

    గత కొంత కాలంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో తవ్వకాలు జరిపినట్టు చెప్పగా, వారి సెల్ ఫోన్ లోని ఫోటోలు,వీడియోల సమాచారం ఆధారంగా కన్నెపల్లి మండలం వెంకటాపూర్ అటవీ ప్రాంతం లో కూడా తవ్వకాలు జరిపినట్టు తెలుస్తోంది. కాగా తదుపరి విచారణ నిమిత్తం టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురు నిందితులను, వారి వద్ద నుండి స్వాధీన పరచుకున్న పూజా సామాగ్రి , పూజకు ఉపయోగించే రుద్రాక్ష దండలు, నిమ్మకాయలు , సెల్ ఫోన్లు, ఒక ఆటో ని కన్నేపల్లి పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన నిందితుల్లో సిసిసి నస్పూర్ కు చెందిన కొప్పర్త్ ప్రశాంత్, జైపూర్ మండలం ముదిగుంటకు చెందిన రేగుంట నారాయణ, ఆటో డ్రైవర్ చిప్పకుర్తి మహేష్, కోడి తిరుపతి ఉన్నారు.

    తవ్వకాల కోసం వెళ్తున్న వారిని అరెస్ట్ చేసిన పోలీసులు


    కాగా బెల్లంపల్లి కి చెందిన మల్లేష్ అలియాస్ నేపాల్ సామి పరారీలో ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడిలో రామగుండం టాస్క్ ఫోర్స్ సీఐ ఏకే మహేందర్, ఎస్ఐ ఎస్ లచ్చన్న, టాస్క్ ఫోర్స్ సిబ్బంది సంపత్ కుమార్, శ్యామ్ సుందర్,సదానందం గౌడ్, వెంకటేష్, శ్రీనివాస్, భాస్కర్ గౌడ్ , రాకేషలను, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Adilabad, Gold, Manchiryala, Money, Telangana Police, Treasure hunt

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు