తెలంగాణలో డేంజర్ బెల్స్ మోగుతున్నారు. ఆడమగా తేడాలేకుండా అందరూ తెగ మద్యం (Liquor) తాగేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ జనాభా 15 లక్షలు కాగా అందులో సగం మందికిపైగా మందు తాగుతున్నారు. ఆ తరవాత స్థానంలో తెలంగాణ (Telangana) నిలిచింది. ఎక్కడబడితే అక్కడ మందు దొరుకుతూ ఉండటంతో జనం తెగ తాగేస్తున్నారు. మందు తాగడం నా జన్మ హక్కులా మారిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే సామాజిక అంతరాలు పెరిగి, నేరాలు పెచ్చురిల్లే ప్రమాదం ఉందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో 15 నుంచి 49 వయసు వారిలో సగానికిపైగా మందు కొడుతున్నారని అధ్యయనంలో తేలింది. కొత్తగా మందుకు అలవాటు పడుతున్న వారి సంఖ్య కూడా జాతీయ సగటు కన్నా వేగంగా పెరుగడం ఆందోళనకు గురిచేస్తోంది.
గ్రామాల్లోనే తాగుడు ఎక్కువ
తెలంగాణలో పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా మందు కొడుతున్నారని తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో (Rural Regions) 62 శాతం మంది మదుపానప్రియులు ఉన్నారు. ఇందులో 54 శాతం మంది వారంలో ఒకసారి తాగుతుంటే, 28 శాతం మంది నాలుగు రోజులకు ఒకసారి మందు కొడుతున్నారు. 19 శాతం మంది ప్రతి రోజూ మందు తాగుతున్నారని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. మందు అలవాటు ఉన్న పురుషుల కుటుంబాల్లో 28 శాతం మంది మహిళలు తీవ్ర హింసకు గురవుతున్నారనే విషయం ఆందోళన కలిగిస్తోంది. వారిలో 16 శాతం మంది తీవ్ర గాయాల పాలవుతున్నారు.
రోడ్డు ప్రమాదాలకు లెక్కే లేదు
రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణ రాష్ట్రం 8వ స్థానంలో ఉంది. డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదాలు, మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల్లో 18 నుంచి 35 వయసు వారే ఎక్కువగా ఉంటున్నారు. పది లక్షల జనాభా దాటిన నగరాల్లో రోడ్డు ప్రమాదాల్లో హైదరాబాద్ 7వ స్థానంలో నిలిచింది.
Rajanna Siricilla: పంట చేతికొచ్చినా తప్పని ఇబ్బందులు.. రైతుల సమస్యలు పట్టవా..?
YS Sharmila: షర్మిలకు ఇప్పటికైనా పొలిటికల్ మైలేజీ వస్తుందా ? ఆ పరిస్థితి మారకపోతే అంతేనా ?
తాగుడు వ్యసనంగా మారుతోంది
తొలుత కల్లు, తరవాత బీరుతో ప్రారంభిస్తున్న మందుబాబులు, తరవాత గంజాయి, నాటు సారాలకు అలవాటు పడుతున్నారు. దీంతో చిన్న వయసులోనే చాలా మంది చనిపోతున్నారు. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మరోవైపు తెలంగాణలో మద్యం ఆదాయం చూస్తే కళ్లు తిరగాల్సిందే. హన్మకొండలో ఓ వైన్ షాప్ ఏకంగా రూ.39 కోట్ల మందు అమ్మింది. ఇక తెలంగాణలో ప్రతి మద్యం షాపు ఏటా కనీసం పది కోట్ల పైనే బిజినెస్ చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి ఏటా మద్యం ద్వారా రూ.18 వేల కోట్ల ఆదాయం లభిస్తోంది. ఇక తయారీ దారులకు, అమ్మకం చేసిన వారికి లభించే ఆదాయం లెక్కిస్తే తెలంగాణ ప్రజలు ఏటా మందు కోసం రూ.32 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారనే గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Liquor sales, Telangana