హోమ్ /వార్తలు /తెలంగాణ /

Sarpanch and Secretary: కార్యాలయంలోనే కొట్టుకున్న సర్పంచ్​, పంచాయతీ కార్యదర్శి.. ఎందుకో తెలుసా?

Sarpanch and Secretary: కార్యాలయంలోనే కొట్టుకున్న సర్పంచ్​, పంచాయతీ కార్యదర్శి.. ఎందుకో తెలుసా?

కొట్టుకుంటున్న సర్పంచ్​, ఆమె భర్త, కార్యదర్శి

కొట్టుకుంటున్న సర్పంచ్​, ఆమె భర్త, కార్యదర్శి

గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే సర్పంచ్ భర్త, పంచాయతీ కార్యదర్శి పరస్పరం కలబడి ఒకరినొకరు కొట్టుకున్న ఘటన మంచిర్యాల జిల్లా జన్నారంలో చోటుచేసుకుంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Adilabad, India

  అది గ్రామ సచివాలయం (Village Secretariat). అక్కడికి వెళితే గ్రామంలోని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని గ్రామ ప్రజల భరోసా. అయితే అంతటి విశిష్టత కలిగిన గ్రామ సచివాలయ కార్యాలయం ఆధిపత్య పోరుతో అబాసుపాలవుతోంది. అందరు చూస్తుండగానే సర్పంచ్ (Sarpanch) భర్త, పంచాయతీ కార్యదర్శి (Panchayat secretary) ఇరువురు కలబడి కొట్టుకోవడం (Fighting), అందుకు గ్రామ పంచాయతీ కార్యాలయమే వేదిక కావడం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఇరువురి మధ్య జరిగిన ముష్టి యుద్ధానికి అక్కడ ఏం జరుగుతుందో తెలియని అయోమయంతోపాటు కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  హరితహారం కార్యక్రమంపై చర్చలో..

  మంచిర్యాల (Mancherial) జిల్లా జన్నారం మండలంలోని రాంపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అలుగునూరి సులోచన భర్త రవి ఆజాది కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా  ఆదివారం చేపట్టే హరిత హారం కార్యక్రమం గురించి చెట్లను  తెప్పించే విషయం చర్చిస్తుండగా సర్పంచ్ సులోచన, పంచాయతీ కార్యదర్శి గంగారాం మధ్య మాట మాట పెరిగి ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం  జరిగింది. అక్కడే ఉన్న సర్పంచ్ సులోచన భర్త రవి, పంచాయతీ కార్యదర్శి లు కూడా ఒకరి పై ఒకరు పడి  కలబడి కొట్టుకున్నారు.ఈ సంఘటనలో కార్యదర్శి గంగారాం చెయ్యి విరిగిందని అయన తెలుపగా, సర్పంచ్ సులోచన కూడ  తనను  కార్యదర్శి క్రింద పడేసి కొట్టాడని, దీంతో తనకు ఛాతిలో  దెబ్బ తగిలింది అని ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న జన్నారం ఎస్సై సతీష్  సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని లక్షెట్టి పేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు  కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

  చేయని పనులకు చెక్కులు రాయమని సర్పంచ్, ఆమె భర్త తనపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, అందుకు తాను ఒప్పుకోకపోవడంతో దూషిస్తున్నారని, తనపై ఈ రోజు దాడి కూడా చేశారని పంచాయతీ కార్యదర్శి ఆరోపించారు.

  Murder in Peddapalli: మళ్లీ మొదలైన గన్ కల్చర్.. గోదావరిఖనిలో సింగరేణి కార్మికుని దారుణ హత్య

  ఇదిలా ఉంటే కార్యదర్శి తనను కొద్ది రోజులుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, మహిళనని కూడా చూడకుండా తనపై దాడి చేశాడని, నిలదీసినందుకు తన భర్తపై కూడా దాడి చేశాడని సర్పంచ్ సులోచన పేర్కొన్నారు. మొత్తంమీద వీరి వాదనలు, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు ఈ ఇరువురి మధ్యలో చాలా రోజుల నుండి  గొడవలు నడుస్తున్నాయని తెలుస్తోంది. తాజాగా రేపటి హరితహారం కార్యక్రమం గురించి ఇద్దరి మధ్యలో ఘర్షణ చోటు చేసుకున్నట్టు తెలిపారు. ఏదిఏమైనప్పటి పంచాయతీ కార్యాలయంలో ఇరువురు కొట్టుకోవడం మాత్రం జిల్లాలో సంచలనం రేపిందని చెప్పవచ్చు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Mancherial