Home /News /telangana /

THE RTC GREATER HYDERABAD ZONE RECENTLY ANNOUNCED THAT TEA COFFEE WATER AND TIFFINS WILL BE PROVIDED TO PASSENGERS SEATED AT BUS STANDS PRV

TSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్​న్యూస్​.. ఇక బస్టాండ్​లో బస్సు కోసం వేచి చూసే వారికి టీ, కాఫీ, మంచినీరు, టిఫిన్స్..​ 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టీఎస్​ ఆర్టీసీ (TSTC) ఎండీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అటు కార్మికుల ప్రయోజనాలతో పాటు ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకుని అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలోని ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఇటీవలె ఓ శుభవార్త చెప్పింది.

ఇంకా చదవండి ...
    తెలంగాణలో టీఎస్​ ఆర్టీసీ (TSRTC) ఎండీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అటు కార్మికుల ప్రయోజనాలతో పాటు ప్రయాణికుల ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకుని అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సును ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రజల వద్దకే బస్సులు అనే విధంగా ప్రచారాన్ని మొదలు పెట్టారు. జాతరలు, పంక్షన్లు, పెళ్లీలు ఇలా ఏ ప్రయాణామైన తామున్నమంటూ ఆర్టీసీ ముందుకు వస్తోంది. బస్సులను ప్రయాణికుల ఇంటివద్దకే పంపే ఏర్పాట్లను చేశారు.  ఆయన ఆధ్వర్యంలోని ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ (RTC Greater Hyderabad) ఇటీవలె ఓ శుభవార్త చెప్పింది.

    హైదరాబాద్ (Hyderabad)​ నుంచి దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ (RTC Greater Hyderabad) ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. గరుడ, రాజధాని బస్సుల కోసం బస్‌స్టేషన్‌లలో ఎదురు చూసే ప్రయాణికులకు (passengers) సాయంత్రం 4 నుంచి చివరి బస్సు వరకు కాఫీ (Coffee), టీ (Tea), స్నాక్స్, తాగునీరు (Water) అందజేయనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. మియాపూర్‌ క్రాస్‌రోడ్స్, కేపీహెచ్‌బీ, ఎస్సార్‌నగర్, టెలిఫోన్‌ భవన్, కాచిగూడ, ఎల్బీనగర్‌ డిమార్ట్‌ ఎదురుగా చింతలకుంట పల్లవి గార్డెన్స్‌ తదితర బస్టాపులలో (Bus stop) ఈ సదుపాయం ఉంటుంది.

    ముందస్తు రిజర్వేషన్‌ చేసుకుంటే ఉచిత ప్రయాణం..

    ఆర్టీసీ  (TSRTC) ఆదాయానికి అనేక స్కీంలు తీసుకువస్తున్న ఆర్టీసీ అధికారులు (RTC Employees) ఇటీవలె  కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ నగరం నుంచి 250 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న ప్రాంతాలకు ముందస్తు రిజర్వేషన్‌ చేసుకుంటే సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం (Free travel) చేయవచ్చని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

    ప్రయాణానికి ముందు 2 గంటలు..

    హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల నుంచి 250 కిలోమీటర్లకు పైగా దూరాలకు ప్రయాణించే వారికి ఈ ఆఫర్‌ వర్తిస్తుందని పేర్కొన్నారు. అయితే ఇలా రిజర్వేషన్ చేసుకున్నవారికి ప్రయాణానికి ముందు 2 గంటలు, తర్వాత 2 గంటల పాటు ఈ ఉచిత సదుపాయం వర్తిస్తుందని తెలిపారు. ముందస్తు రిజర్వేషన్‌ టికెట్‌ చూపించి సిటీ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చని ఆయన సూచించారు. ఇందుకు సంబంధించి ఇతర వివరాలకు 040-30102829, 68153333 నంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు.

    ఆర్టీసీ  (TSRTC) బస్సు సేవల కోసం కాల్ సెంటర్ నంబర్ 040 30102829 లో లేదా స్థానిక డిపో మేనేజరు సంప్రదించవచ్చని ఇటీవలె ఎండీ సజ్జనార్ తెలిపారు. కాగా ఇటివలే సమ్మక్క జాతరకు కూడా ఇలా ఇంటివద్దకే ఆర్టీసీ బస్సును ప్రవేశపెట్టిన తాజాగా ఆ ఆఫర్‌ను నిత్యం అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో ఆర్టీసీకి ఆదాయంతోపాటు ప్రయాణికులు భద్రత కూడా ఉండేందుకు అవకాశాలున్నాయి.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: RTC buses, Telangana, Tsrtc

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు