Home /News /telangana /

THE PROCESS OF REPLACEMENT OF CONTROVERSIAL OUTSOURCED JOBS IN RIMS ADILABAD DISTRICT VB ADB

Outsourcing Jobs: అక్కడ వివాదస్పదంగా మారిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి

Outsourcing Jobs: త్వరలో ప్రారంభం కానున్న రిమ్స్ సూపర్ స్పెషాలిటి ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ పద్దతిలో పలు పోస్టుల భర్తీకి చేపట్టిన చర్యలు వివాదస్పదమవుతోంది. ఈ ప్రక్రియను కొన్ని ఏజెన్సీలకే అప్పగించడంపై అనుమానాలకు దారి తీస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    (కట్టా లెనిన్, ఆదిలాబాద్ జిల్లా, న్యూస్18 తెలుగు)

    ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో త్వరలో ప్రారంభం కానున్న రిమ్స్ సూపర్ స్పెషాలిటి ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ పద్దతిలో పలు పోస్టుల భర్తీకి చేపట్టిన చర్యలు వివాదస్పదమవుతోంది. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటి ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే కొన్ని ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందులో స్టాఫ్ నర్స్ పోస్టులతోపాటు వివిధ విభాగాల్లో కలిపి 247 మంది సిబ్బందిని నియమించుకోవడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. వీటి భర్తీని మూడు ఏజెన్సీలకు కేటాయించారు. ఇక్కడే వివాదం మొదలైంది. ఉపాధి కల్పన శాఖలో సుమారు 20 ఏజెన్సీలు నమోదై ఉండగా కేవలం ఈ మూడు ఏజెన్సీలకే ఏకపక్షంగా కట్టబెట్టారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే సదరు ఏజెన్సీలు ఆ పోస్టుల భర్తీకి రోస్టర్ వివరాలను వెల్లండించకుండానే నోటిఫికేషన్ జారీ చేసిన నిరుద్యోగ అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించారు.

    అయితే దరఖాస్తు స్వీకరణ ప్రభుత్వం కార్యాలయంలో కాకుండా ఓ ఏజెన్సీకి చెందిన గోడౌన్లో ఇరుకు గదుల్లో అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించడం, దరఖాస్తు సమర్పించిన అభ్యర్థులకు రశీదులు ఇవ్వకపోవడం పలు అనుమానాలకు దారి తీసింది. వివిధ పోస్టుల కోసం దరఖాస్తున్న చేసుకున్న అభ్యర్థులు ఏజెన్సీ నిర్వాహకుల తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొంతమంది వసూళ్ల పర్వానికి కూడా తెరలేపినట్లు వినిపిస్తోంది. ఈ వ్యవహరం పై అధికారులకు ఫిర్యాదులు కూడా అందాయి. ఈ నియామకాలను పారదర్శకంగా చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బిజెపి, కాంగ్రేస్, టిఆర్ ఎస్ నేతలు జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రాలను కూడా అందజేశారు.

    ప్రైవేటు ఏజేన్సీలు అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందని, ఈ నియామకాలను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సెలక్షన్ కమిటిని ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగానే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రిమ్స్ డైరెక్టర్ డా. బలరాం బానోత్ ఓ ప్రకటన ద్వారా ఔట్ సోర్సింగ్ పద్దతిని నియమించే ఈ పోస్టులను సెలక్షన్ కమిటి ఆధర్యంలో మెరిట్ ఆధారంగా జరుగుతుందని ప్రకటించారు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఏజేన్సీలు కూడా ఇబ్బందులకు గురిచేస్తే జిల్లా కలెక్టర్ కు గాని, ఉపాధి కల్పనాధికారికి గాని, తనకు గాని రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Adilabad, Controversys, Hospitals, Outsourcing jobs, Rims, Telangana jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు