Home /News /telangana /

THE POSTAL DEPARTMENT WILL DO AADHAAR CARD REGISTRATION AT THEIR HOME FOR CHILDREN UNDER FIVE IN SANGAREDDY MDK PRV

Aadhar for children: మీ పిల్లలకు ఆధార్​ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ ఇంటి వద్దకే సేవలు.. వివరాలివే..  

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మీ పిల్లలకు ఆధార్​ కార్డు కావాలా? రిజిస్ట్రేషన్​ చేసుకోవాలా? డోంట్​ వర్రీ.. మీరు పిల్లలను ఆధార్ సెంటర్ వద్దకు తీసుకుని వెళ్లకుండా ఇంటి వద్దనే ఆధార్ నమోదు చేయించుకోవచ్చు. ఈ సదుపాయం ఇపుడు అందుబాటులోకి వచ్చింది. ఎలాగంటారా? వివరాలివే

ఇంకా చదవండి ...
    (K. Verranna, News 18, Medak)

    మీ పిల్లలను (Children) ఇకపై ఆధార్ సెంటర్ వద్దకు తీసుకుని వెళ్లకుండా ఇంటి వద్దనే ఆధార్ కార్డు (Aadhar card) తీసుకోవచ్చు.  ఎలాగంటారా? తపాలా శాఖ (Postal Department) సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఉత్తరాలు బట్వాడాకే పరిమితం కాకుండా ప్రభుత్వ పథకాలు, ఇతర సేవలు అందిస్తూ ప్రజలకు చేరువవుతోంది. తాజాగా ఐదేళ్లలోపు పిల్లలకు (For children under five) ఆధార్ సేవలను (Aadhar for children) ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే హెడ్ పోస్టాఫీసులతో పాటు ఇతర తపాలా కార్యాలయాల్లో ఆధార్ కేంద్రాలను (Aadhaar centers) నిర్వహిస్తున్నారు. చిన్న పిల్లలతో ఆధార్ కేంద్రాలకు వెళ్లలేని వారి కోసం ఇంటికే తపాలా శాఖ సిబ్బంది వెళ్లి ఆధార్ నమోదు (Aadhar card registration) ప్రక్రియ పూర్తి చేస్తారు. ఉమ్మడి మెదక్ (Medak) జిల్లాల్లో మరో రెండు రోజుల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

    సిబ్బందికి ప్రత్యేక శిక్షణ..

    ఉమ్మడి మెదక్ (Medak) జిల్లాల్లో ఐదేళ్ల లోపు  పిల్లలకు ఇంటివద్దే ఆధార్ నమోదు (Aadhaar registration at home for children under five) కోసం ఇప్పటికే గ్రామ స్థాయిలో తపాలాశాఖ (Postal Department) సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఇంటి వద్ద నమోదుకు అనుమతినిచ్చింది. ఇండియా పోస్ట్ పేమెంట్ (IPBI) ద్వారా ఆధార్ ఎన్రోల్మెంట్ ప్రక్రియ చేపట్టనున్నారు. అంగన్వాడీ కేంద్రాలతో పాటు పాఠశాలల్లో 1, 2 తరగతుల విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నారు. వీరిలో ఆధార్ కార్డు (Aadhar card) లేని వారిని గుర్తిస్తారు. వారి ఇంటి వద్దకు గానీ, సమీపంలోని ఓ ప్రభుత్వ భవనం (Government building) వద్దకు గానీ పిలిపించి చరవాణిలో చిత్రాలు తీసి ఆధార్ నమోదు ప్రక్రియ చేపడుతారు.

    పిల్లల వేలిముద్రలు (Children's fingerprints) స్పష్టంగా రాకపోతే  తల్లిదండ్రుల వేలి ముద్రలు (Parental fingerprint) తీసుకొని అప్డేట్ చేస్తారు. పిల్లల జనన ధ్రువీకరణ పత్రం సిబ్బందికి అందించాల్సి ఉంటుంది. దీంతో సంగారెడ్డి (sangareddy), మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని 3.20 లక్షల ఐదేళ్ల లోపు పిల్లలకు ప్రయోజనం చేకూరనుంది.

    ఉచితంగానే సేవలు. . : హన్మంతు, తపాలా శాఖ ఏఎస్పీ

    ‘‘సంగారెడ్డి (sangareddy) లో ఐదేళ్ల లోపు పిల్లలకు ఉచితంగానే ఆధార్ నమెదు కార్యక్రమం నిర్వహిస్తాం. ఈ వయసు పిల్లలు ఎవరైనా ఉంటే తల్లిదండ్రులు సమీపంలోని పోస్టుమ్యాన్.లేదంటే గ్రామీణ డాక్రా గ్రూప్ సిబ్బందికి సమాచారం అందించాలి. ఆ సిబ్బంది చిన్నారుల ఇంటికి వెళ్లి నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇందుకు ఐసీడీఎస్ విద్యాశాఖల సహకారం కూడా తీసుకుంటాం.’’

    సబ్ డివిజన్ శాఖాపోస్టాఫీసులు కార్యాలయాలు
    సంగారెడ్డి 45 253
    35 40 243
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Aadhaar Card, Post office, Sangareddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు