• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • THE POLITICS IN HUZURABAD CONSTITUENCY ARE CHANGING DAY BY DAY ITALA VS GANGULA WHOSE STRENGTH VB KNR

Huzurabad: హుజూరాబాద్ లో వేడెక్కిన రాజకీయం.. ఈటల వర్సెస్ గంగుల.. ఎవరి బలమెంత..?

మంత్రి కమలాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (ఫైల్)

Huzurabad: హుజూరాబాద్ నియోజక వర్గంలో రాజకీయాలు రోజురోజుకూ మారుతు న్నాయి. మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన స్థానిక ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా నియోజకవర్గంలో బలగాన్ని పెంచుకునే దిశగా జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్ తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

  • Share this:
    (పి. శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా, న్యూస్ 18తెలుగు)

    హుజూరాబాద్ నియోజక వర్గంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచు లుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు భవిష్యత్తులో ఈటల వైపు వెళ్లకుండా ఒప్పిస్తున్నారు. నియోజకవర్గంలో గంగుల జోక్యంపై శనివారం మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గొర్రెల మంద మీద తోడేళ్లు దాడి చేసిన విధంగా 20 ఏళ్లుగా తన వెంట ఉన్న నాయకులను మంత్రి గంగుల బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆయన పరోక్ష విమర్శలు చేశారు. అదే సమయంలో ఇల్లందకుంట మండలానికి చెందిన సర్పంచులు , ప్రజాప్రతినిధులు ఈటలను కలిసి తమకు మద్దతు ప్రకటించారన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సీన్ కరీంనగర్ కు మారింది. పలువురు ప్రజాప్రతినిధులు మంత్రి గంగులను కలిసి తాము పార్టీ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఈటలపై విమర్శలు కురిపించారు. మండల ప్రజాప్రతినిధులు హుజూరాబాద్ జెడ్పీటీసీ బక్కారెడ్డి , ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి , జమ్మికుంట ఎంపీపీ దొడై మమత , వీణవంక ఎంపీపీ రేణుక తిరుపతిరెడ్డి తదితరులు ఆదివారం మంత్రి గంగుల నివాసానికి వచ్చి ఆయ నతో భేటీ అయ్యారు .

    తమతోపాటు ఎంపీటీసీలు, సర్పంచులు కూడా పార్టీని వీడి ఈటల వద్దకు వెళ్లే ఆలోచన చేయడం లేదని స్పష్టం చేశారు . కేసీఆర్ నాయకత్వంపై పార్టీ శ్రేణుల్లో సంపూర్ణ విశ్వాసం ఉందని వ్యాఖ్యానించారు . ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం వల్ల స్థానికంగా నాయకు లు స్వతంత్రంగా ఆలోచించే స్వేచ్ఛ లభించిందని అన్నారు . పార్టీలో ద్వితీయ నాయకత్వం ఎదగకుండా తొక్కి పెట్టారని వారు ఈటలపై ఆరోపణలు చేశారు . వీరితోపాటు కమలాపూర్ , జమ్మికుంట మండలాల్లోని శనిగరం , మర్రిపల్లిగూడెం గ్రామా లకు చెందిన ప్రజాప్రతినిధులు , టీఆర్ఎస్ నాయకు లు గంగులను కలిసి పార్టీ వెంట ఉంటామని చెప్పారు. పార్టీ సీనియర్ నాయకుడు పింగళి ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో శనిగరం సర్పంచ్ పింగళి రవళిరం జిత్ రెడ్డి , ఉపసర్పంచ్ మేకల తిరుపతి , సీనియర్ నేత చెరి పెల్లి రాంచందర్‌తో పాటు స్థానిక నాయకు లు మంత్రిని కలిశారు .

    తమ గ్రామాల్లో ఉన్న సమస్యలను మంత్రి గంగులకు విన్నవించుకున్నారు . ఈటల సొంత మండలానికి చెందిన నేతలు.. పార్టీకి చెందిన ఏ ఒక్క కార్యకర్త కూడా రాజేందర్ వెంటలేరని , గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయక త్వం పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 20 సంవత్సరాల నుండి ఉద్యమం నడిపాము.. ఎవరో ఎదో మభ్య పెడితే వినేవారు హుజురాబాద్ లో లేరని ఈటల వాపోయారు.
    Published by:Veera Babu
    First published: