హోమ్ /వార్తలు /తెలంగాణ /

Breaking News: ఎట్టకేలకు కారు నుండి బయటకు షర్మిల..SR నగర్ పీఎస్ దగ్గర హైడ్రామా

Breaking News: ఎట్టకేలకు కారు నుండి బయటకు షర్మిల..SR నగర్ పీఎస్ దగ్గర హైడ్రామా

ధ్వంసం అయిన కారులోనే వైఎస్ షర్మిల

ధ్వంసం అయిన కారులోనే వైఎస్ షర్మిల

హైదరాబాద్ పంజాగుట్టలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. లోటస్ పాండ్ నుండి బయటకు వచ్చి ప్రగతి భవన్ వైపు వెళ్తున్న Ys షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. నిన్న పర్యటనలో టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో దెబ్బతిన్న కారును నడుపుకుంటూ షర్మిల ప్రగతి భవన్ వైపు వెళ్లబోయారు. ఈ క్రమంలో పోలీసులు సోమాజిగూడ వద్ద ఆమె వాహనానికి పోలీసులు వాహనాలను అడ్డుపెట్టారు. దీనితో ఆమె కారు అద్దాలను లాక్ చేసుకుని కారులోనే ఉన్నారు. ఆమెను బయటకు తీసుకురావాలని ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో YSRTP కార్యకర్తలు కారుపైకి ఎక్కి వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఎంతకూ ఆమె బయటకు రాకపోవడంతో పోలీసులు క్రేన్ సాయంతో షర్మిల ఉన్న వాహనాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికి కూడా ఆమె కారు అద్దాలను తెరవకపోవడంతో క్రేన్ తోనే తీసుకెళ్తున్నారు. ఆ వాహనంలో షర్మిలతో పాటు మరికొంతమంది ఉన్నారు. ఆమె కారుకు ఇరువైపులా ముందు కూడా పోలీసులు భారీగా మోహరించారు. కారుతో పాటే కార్యకర్తలు కూడా షర్మిల వెంట వస్తున్నారు. అయితే ఆమెను ఎక్కడకు తీసుకెళ్తున్నారనేది మాత్రం తెలియరాలేదు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్ పంజాగుట్టలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. లోటస్ పాండ్ నుండి బయటకు వచ్చి ప్రగతి భవన్ వైపు వెళ్తున్న Ys షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. నిన్న పర్యటనలో టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో దెబ్బతిన్న కారును నడుపుకుంటూ షర్మిల ప్రగతి భవన్ వైపు వెళ్లబోయారు. ఈ క్రమంలో పోలీసులు సోమాజిగూడ వద్ద ఆమె వాహనానికి పోలీసులు వాహనాలను అడ్డుపెట్టారు. దీనితో ఆమె కారు అద్దాలను లాక్ చేసుకుని కారులోనే ఉన్నారు. ఆమెను బయటకు తీసుకురావాలని ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో YSRTP కార్యకర్తలు కారుపైకి ఎక్కి వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఎంతకూ ఆమె బయటకు రాకపోవడంతో పోలీసులు క్రేన్ సాయంతో షర్మిల ఉన్న వాహనాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికి కూడా ఆమె కారు అద్దాలను తెరవకపోవడంతో షర్మిల కారులోనే ఉండగా..క్రేన్ తోనే తీసుకెళ్తున్నారు. ఆ వాహనంలో షర్మిలతో పాటు మరికొంతమంది ఉన్నారు. ఆమె కారుకు ఇరువైపులా ముందు కూడా పోలీసులు భారీగా మోహరించారు. కారుతో పాటే కార్యకర్తలు కూడా షర్మిల వెంట వస్తున్నారు.

Bhadradri Kothagudem: పుట్టుకతో అంగవైకల్యం.. అయినా ఎందరికో ఆదర్శం

SR నగర్ పోలీస్ స్టేషన్ కు షర్మిల కారు..

షర్మిల కారును క్రేన్ సాయంతో లిఫ్ట్ చేసి పోలీసులు SR నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మైత్రి నగర్, అమీర్ పేట నుండి ఆమె కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఆమె ఇప్పటికి కూడా కారు దిగడం లేదు. కనీసం కారు అద్దాలను కూడా దించడం లేదు.దీనితో లాఠీ సాయంతో డోర్ ను ఓపెన్ చేసిన పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్ లోపలి తీసుకెళ్లారు. ఈ సందర్బంగా టీఆర్ఎస్ సర్కార్ పై మండిపడ్డారు, BRS అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి. టీఆర్ఎస్ లో ఉన్నది ఎమ్మెల్యేలు కాదు. పోలీసులు కూడా గుండాలయ్యారని ఆమె ఆరోపించారు.

Bhadradri Kothagudem: పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు .. కారణం ఏమిటంటే..?

షర్మిల రియాక్షన్..

ఒక మహిళ అని చూడకుండా నాపై దాడి చేశారు. నా కారును, కార్వాన్ ను కూడా ధ్వంసం చేశారు. ప్రజల సమస్యలపై 3300 కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టాం. అలాంటింది టీఆర్ఎస్ కార్యకర్తలు గూండాల్లా ప్రవర్తించారు. ఈ ఘటనపై కేసీఆర్ స్పందించాలి. అందుకే ప్రగతి భవన్ కు వెళతానని షర్మిల చెప్పుకొచ్చారు.

మేము గుండాలమా లేక రౌడీలమా. మాపై ఎందుకు దాడి చేశారు. కార్వాన్ ను ఎందుకు తగలబెట్టారు. కేసీఆర్ పాలనలో ప్రశ్నించే హక్కు లేదా అని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే అవినీతిపై మాట్లాడితే అది వ్యక్తిగతం ఎందుకు అవుతుంది. దోచుకుంది ప్రజల సొమ్ము కాబట్టి మేము ప్రశ్నిస్తున్నామని షర్మిల అన్నారు.

First published:

Tags: Hyderabad, Telangana, YS Sharmila

ఉత్తమ కథలు