ఆదిలాబాద్‌లో విషాదం.. కరోనా భయంతో బాలింత ఊరికి దూరం ఉంచిన గ్రామస్తులు

బాలింతతో మాట్లాడుతున్న ఆరోగ్య సిబ్బంది

గత కొద్ది రోజులుగా కరోనాతో భయాందోళనకు గురవుతున్న గ్రామస్తులు వారు కరీంనగర్ జిల్లా నుంచి వచ్చారని, కరోనా వైరస్ ఉంటుందేమోనన్న ఉద్దేశంతో వారిని ఊరి లోపలికి రానీయ్యలేదు.

  • Share this:
    కరోనా అనుమానంతో పచ్చి బాలింతను ఊరి బయట చెట్టు కింద ఉంచిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం రాజులగూడలో జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం బొప్పపూర్ పంచాయతీ పరిధిలోని రాజులగూడ గ్రామానికి చెందిన కుడిమెత అనసుయా, జైతు ఇద్దరు దంపతులు. ఉపాధి కోసం ఈ దంపతులిద్దరూ కరీంనగర్ జిల్లాలోని రామడుగు గ్రామంలోని కోళ్ల ఫామ్‌లో పనిచేస్తున్నారు. కాగా కుడిమెత అనసుయా ఈ నెల 14వ తేదిన రామడుగు గ్రామంలోని ఓ ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మరుసటి రోజు ఓ వాహనం ద్వారా ఉట్నూర్ మండలంలోని తమ సొంత గ్రామమైన రాజులగూడ కు చేరుకున్నారు. అయితే గత కొద్ది రోజులుగా కరోనాతో భయాందోళనకు గురవుతున్న గ్రామస్తులు వారు కరీంనగర్ జిల్లా నుంచి వచ్చారని, కరోనా వైరస్ ఉంటుందేమోనన్న ఉద్దేశంతో వారిని ఊరి లోపలికి రానీయ్యలేదు.

    దీంతో వారు చేసెదేమి లేక సమీప పోలంలో ఓ చెట్టు కింద గుడారం వేసుకొని ఐదురోజుల పాటు అక్కడే ఉన్నారు. ఈ విషయం గ్రామాల్లోకి వస్తూపోతున్న వైద్య సిబ్బంది, ఎఎన్ఎంలకు తెలిసింది. దీంతో వారు ఆమెను కలిసి బిడ్డను చూసి వైద్యాధికారులకి సమాచారం అందించారు. అనంతరం వారిని గ్రామంలొకి తమ ఇంటికి చేర్చారు. ఈ నేపథ్యంలో ఉట్నూర్ ఐటిడిఎ పిఓ భావేష్ మిశ్రా, ఏజెన్సీ డిప్యూటీ డిఎంహెచ్ఒ డాక్టర్ కుడిమెత మనోహర్ ఆదేశాల మేరకు హస్నాపూర్ పిహెచ్‌సి వైద్య సిబ్బందితో కలిసి రాజులగూడ గ్రామానికి వెళ్లి బాలింతను బిడ్డను పరిశీలించారు. ఆపై గ్రామస్తులకు కౌన్సెలింగ్ నిర్వ హించి కరోనాపై పలు సలహాలు సూచనలు అందించారు. కాగా ఈ విషయమై బాలింత అనసుయా, ఆమె బిడ్డను ఉట్నూర్ ఐసిడిఎస్ సిడిపిఓ శ్రావణి, సూపర్ వైజర్ ధనలక్ష్మిలు పరామర్శించి వారికి పలు నిత్యావసర సరుకులు, పండ్లను అందజేశారు.
    Published by:Narsimha Badhini
    First published: