Home /News /telangana /

THE PEOPLE OF BELLAMPALLY IN ADILABAD CREATED RECORDS BY SINGING THE NATIONAL ANTHEM WITH 25 THOUSAND PEOPLE PRV

Azadi ka Amrit Mahotsav: బెల్లంపల్లి వాసులా మజాకా.. ఇంటర్నేషనల్​ వండర్​ బుక్​ ఆఫ్​ రికార్డ్స్​ బద్దలు.. వివరాలివే..

జాతీయ గీతాలాపన

జాతీయ గీతాలాపన

స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో 25 వేల మందితో నిర్వహించిన సాముహిక జాతీయ గీతాలాపన, భారీ ర్యాలీలకు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం దక్కింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Adilabad, India
  (Katta Lenin, News18, Adilabad)

  ఉప్పొంగిన ఉత్సాహంతో నవ తరం కదం తొక్కింది. వందేమాతరం ఈ తరం నోట మార్మోగింది. గుండెల నిండా దేశ భక్తిని నింపుకొని విద్యార్థులు, యువతీ యువకులు, అన్ని వర్గాల ప్రజలు జాతీయ జండాలను (National flags) చేత పట్టుకొని కదం కదం కలుపుతూ, వందేమాతరం… భారత్ మాతకీ జై.. అంటు ఒళ్లు పులకరించేలా నినాదాలు చేస్తూ నిర్వహించిన భారీ ర్యాలీ జాతీయ సమైక్యతకు అద్దంపట్టింది. పదులు కాదు… వందలు కాదు… ఏకంగా 25 వేల మంది ఒకచోట చేరి సామూహికంగా జాతీయ గీతాన్ని (National Anthem) ఆలపించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం జాతీయ జెండా గౌరవం, విశిష్టతలను, స్వాతంత్య్రం కోసం సాగిన సమరంలో పాల్గొని దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి అమరులైన వీరుల త్యాగాలను గుర్తుచేస్తూ నేటి తరంలో దేశ భక్తిని రగిలించేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి (Bellampallly) పట్టణంలోని మైదానంలో బెల్లంపల్లి  సబ్ డివిజన్ పోలీస్ల ఆధ్వర్యంలో 25 వేల మందితో సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించే కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు ఊరు, వాడ, పట్టణం, కాలనీలను ఏకం చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.

  Hyderabad boy Pakistan Girl: ప్రేమెంత పనిచేసే.. లవ్​ కోసం పాకిస్తాన్​ నుంచి అమ్మాయిని దింపిన హైదరాబాద్​ కుర్రాడు.. చివరికి..

  ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవి పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వెంకటేష్ నేత, బెల్లంపల్లి శాసన సభ్యుడు దుర్గం చిన్నయ్య, మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి, ఇంచార్జి డిసిపి అఖిల్ మహజన్ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ నుండి రెండవ నెంబర్ మైదానం వరకు ఈ ర్యాలి  (rally) కొనసాగింది. భారీ పతాకాన్ని ప్రదర్శించి విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు (International Wonder Book of Records) లో నమోదు చేశారు.  ఇందుకు సంబంధించిన అవార్డు ను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్  కోఆర్డినేటర్ రంగ జ్యోతి చేతుల మీదుగా ఇన్చార్జి డిసిపి అఖిల్ మహాజన్ పోలీసు అధికారులతో కలిసి అందుకున్నారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలలో దేశభక్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. నేటి యువతి యువకులు నాటి మహనీయులను స్పూర్తిగా తీసుకొని ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య పోరాట విశిష్టతను చాటిచెప్పేందుకు ప్రభుత్వం వజ్రోత్సవంలో భాగంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని, ప్రజలు అందరు వీటిలో భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. అటు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోను జిల్లా ఎస్.పి ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వరంలో భారీ ఫ్రీడం ర్యాలీ నిర్వహించారు. భారీ ర్యాలీతో ప్రధాన వీధులు కిక్కిరిసిపోయాయి. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఈ ర్యాలీ ప్రారంభించి జాతీయ జండా పట్టుకొని ర్యాలీ పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు, యువజనులను ఉద్దేశించి ప్రసంగించారు.

  అటు నిర్మల్, కొమురంభీ ఆసిఫాబాద్ జిల్లాల్లోనూ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలు స్వచ్చందంగా హాజరై ఆయా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. గుండెల నిండా దేశ భక్తిని నింపుకుని విద్యార్థులు, యువతీ యువకులు, అన్ని వర్గాల ప్రజలు, స్వచ్చంద సంస్థల నిర్వాహక్లులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, నాయకులు జాతీయ జెండాను చేత పట్టుకుని వందేమాతరం..., భారత్ మాతాకీ జై...అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకుసాగారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Adilabad, Azadi Ka Amrit Mahotsav, Independence Day 2022, Mancherial

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు