హోమ్ /వార్తలు /తెలంగాణ /

OMG: ఓ మై గాడ్​.. ఆ ఆలయంలో దైవ దర్శనానికి వెళితే పార్కింగ్​ ఫీజు రూ. 500.. గంట గంటకూ మరో రూ. 100

OMG: ఓ మై గాడ్​.. ఆ ఆలయంలో దైవ దర్శనానికి వెళితే పార్కింగ్​ ఫీజు రూ. 500.. గంట గంటకూ మరో రూ. 100

యాదాద్రి ఆలయం

యాదాద్రి ఆలయం

ఎక్కడైనా పార్కింగ్​ ఫీజు ఎంత ఉంటుంది. ప్రైవేటు వ్యక్తులది అయితే రూ 20 నుంచి 50 వరకు వసూలు చేస్తారు. ప్రభుత్వం అయితే చాలా వాటికి ఉచితంగానే ఉంటుంది. అయితే ఆ టెంపుల్​ కి వెళితే ఏకంగా రూ.500 చెల్లించుకోవాల్సిందే. అంతేనా గంటగంటకీ మరో రూ.100 ఇవ్వాల్సి ఉంటుంది.

ఇంకా చదవండి ...

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి (Yadadri) ఆలయంలో పార్కింగ్ ఫీజు (Parking Fee) భారీగా పెంచారు. భక్తుల వాహనాలను (Vehicles) కొండపైకి అనుమతించేందుకు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సరికొత్త నిర్ణయాన్ని తీసుకొంది. భక్తులు తమ వాహనాల ద్వారా కొండపైకి చేరే అవకాశం కల్పిస్తూ పార్కింగ్ ఫీజు రూ.500 చెల్లించాలంటూ ఆలయ ఈవో గీత (EO Geeta) ఉత్తర్వులు జారీ చేశారు. భక్తులు తమ వాహనంతో (ఫోర్ వీలర్లు)  కొండపైకి చేరుకోవాలంటే రూ.500 రుసుము చెల్లించాల్సిందే. రుసుం చెల్లించిన వాహనాలను కొండపైకి అనుమతిస్తున్నారు. కొండ (Yadadri hill)పై కేటాయించిన స్థలంలో ఒక గంట (One hour) మాత్రమే వాహనాలను పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. గంట దాటితే ప్రతి గంటకూ రూ.100 (One hundred for every hour) చెల్లించాల్సిందేనని ఈవో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఆర్టీసీ బస్సుల్లోనే ఉచితం..

మార్చి 28న లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం ఉద్ఘాటన జరగ్గా, ఆ రోజు నుంచి భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించడం లేదు. కొండకింద నుంచి పైకి, పైనుంచి కిందకు ఆర్టీసీ బస్సుల్లోనే భక్తులను ఉచితంగా చేరవేస్తున్నారు. అయితే స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల వాహనాలను కొండపైకి అనుమతించాలని పెద్ద ఎత్తున వచ్చిన విజ్ఞప్తుల దృష్ట్యా తీసుకున్న నిర్ణయం చాలా ఖరీదుగా మారింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఉన్నతస్థాయి అధికారులు, న్యాయమూర్తుల ప్రొటోకాల్‌ వాహనాలకు పార్కింగ్‌ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

దేవస్థానానికి భారీ విరాళం ఇచ్చిన దాతల గుర్తింపు కార్డులు చూపించిన వారి వాహనాలకు కూడా పార్కింగ్‌ ఫీజు లేదు. వాహనాల నుంచి పార్కింగ్‌ ఫీజు వసూలు చేయడానికి ఇద్దరు దేవస్థానం ఉద్యోగులను నియమించారు. ఫీజు చెల్లించిన వాహనాలను క్యూ కాంప్లెక్స్‌ ఎదురుగా గల బస్టాండ్, వీఐపీ గెస్‌హౌస్‌ పక్కన గల ఖాళీ స్థలంలో నిలపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గతంలో యాదాద్రి కొండపైకి వచ్చే భక్తుల ద్విచక్ర వాహనాలకు కాలపరిమితి లేకుండా రూ.15, కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలకు రూ.100 పార్కింగ్‌ ఫీజు వసూలు చేసే వారు. ప్రస్తుతానికి ద్విచక్ర వాహనాలకు పాత ఫీజునే వసూలు చేయనున్నట్టు తెలుస్తోంది.

వ్యాపార కేంద్రంగా యాదాద్రి..

దేవస్థానం అధికారులు తీసుకున్న తాజా నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. సామాన్య భక్తులకు వసతి సౌకర్యం, కనీస సౌకర్యాలైన మంచినీరు, బాత్ రూమ్ లు ఏర్పాటు చేయని అధికారులు ధనవంతులకు మాత్రం డబ్బులు చెల్లిస్తే కొండపైకి తన సొంత కారులో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చని నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వ్యాపార కేంద్రంగా యాదాద్రి మారుస్తున్నారని ఆరోపణలు చేశారు. సామాన్య భక్తులకు యాదాద్రి దర్శనాన్ని దూరం చేస్తున్న ఆలయ ఈవో చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. పార్కింగ్ ఫీజు వసూలు నిర్ణయాన్ని వెంటనే రద్దు చేసి ఈవో పై చర్యలు తీసుకోవాలని సీపీఐ పార్టీ నాయకులు కోరుతున్నారు. భక్తుల సైతం పార్కింగ్ ఫీజులను తగ్గించాలని కోరుతున్నారు

First published:

Tags: Yadadri temple

ఉత్తమ కథలు