Home /News /telangana /

THE OLDEST BRICK TEMPLE IN THE COUNTRY GOLLANTHA IS LOCATED NEAR MAHBUBNAGAR AREA IN TELANGANA FULL DETAILS HERE NNK NJ PRV

Gollantha Temple: దేశంలో ఇలాంటి ఆలయాలు రెండే రెండు.. ఒకటి మన తెలంగాణలో.. ఇంతకీ ఎందుకంత ప్రత్యేకత.. ఏమిటా స్పెషాలిటీ?

ఇటుకలతో నిర్మించిన గొల్లంత గుడి

ఇటుకలతో నిర్మించిన గొల్లంత గుడి

ఇటుకపై ఇటుకను పేర్చి 65 అడుగుల ఎత్తులో నిర్మించిన శాంతి మందిరం. మహా వీరుని కాలంలో రాష్ట్రకూటులు నిర్మించిన అద్భుత కట్టడాల్లో ఒకటి. ఇప్పుడు ఎక్కడుందంటే..?

  (N . Naveen Kumar, Nagar Kurnool)

  మహబూబ్‌నగర్‌ (Mahbubnagar) జిల్లా జడ్చర్లలోని అల్వాన్‌పల్లిలో వెలసిన పురాతన కట్టడంఒకప్పుడు జైన మతం అజరమరంగా వర్ధిల్లిన ప్రాంతం.... ఎంతో మంది జైన తీర్థంకరులు నడయాడిన నేల.. జైనులకు  (Jains) ఎంతో ప్రీతిపాత్రమైన ఆలయం గొల్లంత గుడి (Gollantha Temple) జడ్చర్ల మండలం అల్వాన్ పల్లి గ్రామ శివారులో కొలువై ఉన్నది.  జైనులకు ప్రధాన స్థిర నివాసంగా ఈ ప్రాంతం ప్రత్యేకతను చాటుకుంది. 8వ శతాబ్దంలో రాష్ట్ర కూటులు ఈ గొల్లంత గుడిని నిర్మించినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు చరిత్రకారులు చెబుతున్నారు. ఆ కాలంలో ఇటుకలతో నిర్మించిన ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయని పరిశోధకులు భావిస్తున్నారు. 40 అడుగుల నిలువెత్తు గోపురం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇటుకలతో నిర్మితమైన అత్యంత పురాతన ఆలయాలు (The most ancient temples) దేశంలో రెండే రెండు ఉన్నాయని, వాటిలో ఈ గొల్లంత గుడి ఒకటని పేర్కొంటున్నారు. మరొకటి ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూరులోని భీతర్‌గావ్‌ శివారులో ఉందని గుర్తించారు.

  8 ఎకరాల్లో నిర్మితమైన ఈ ఆలయం 1600 ఏళ్ల క్రితం 65 అడుగుల ఎత్తులో కుమారగుప్తుడి కాలంలో నిర్మిత మైందని పురవస్తుశాఖ అధికారులు గుర్తించారు. ఇందులో కేవలం ఒక పాదాల గుట్టనే సుమారు రెండు ఎకరాల్లో ఉంటుంది. జైనుల ధాన్య భాండాగారంగా పేరు గాంచిన గొల్లంత గుడి ఆలయంలో ఒకప్పుడు బంగారు కుండలు ఉండేవని స్థానికులు చెబుతారు. గుడి వెనుక భాగంలో అప్పటి నగిషీల జాడలు ఇంకా స్పష్టంగా ఉండటం విశేషం.

  జైనుల ప్రధాన స్థిర నివాసంగా ప్రసిద్ధి..

  జైనీయుల (Jains) స్థిర నివాస కేంద్రంగా గొల్లంత గుడి ఉండేది. జైనీయులకు ధాన్యాగారంగా వర్ధిల్లినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. వందల ఏళ్ల కింద ఇది జైనమతానికి ప్రధాన కేంద్రంగా ఉండేదని చర్రితకారులు చెబుతున్నారు. ఇక్కడ గతంలో అనేక పురావస్తు అన్వేషణలు, తవ్వకాలు జరిగాయి. పురాతన కాలం నాటి మట్టిపెంకులు, ఇటుకలతో పాటు నల్ల రంగులో ఉన్న బూడిద తవ్వకాల్లో వెలుగు చూశాయి. వాటిని పరిరక్షించేందుకు పురావస్తు ప్రదర్శనశాలకు తరలించారు.

  ఇక్కడ లభించిన 5 అడుగుల ఎత్తున్న జైన తీర్థంకరుల విగ్రహాల్లో ఒకదాన్ని హైదరాబాద్‌ (Hyderabad)లోని రాష్ట్ర పురావస్తు మ్యూజియం (Museum)లో, మరొక దాన్ని పిల్లలమర్రి మ్యూజియంలో భద్రపరిచారు. ఇదే ప్రాంతంలో హిందూ దేవాలయం అవశేషాలు, మధ్యయుగ కాలం నాటి మహావీర, పార్శ్వనాథ శిల్పాలు బయటపడ్డాయి.

  పూర్వవైభవం తీసుకువచ్చే దిశగా ప్రయత్నాలు

  తెలంగాణ పురావస్తు శాఖ (Telangana Archaeological Department) అధికారులు ఆలయ పూర్వవైభవానికి చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఇటుకల గోపురం చెక్కుచెదరకుండానే పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఆలయ పునర్నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. శాస్త్రీయమైన పద్ధతులతో పనులు చేపట్టి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆనవాళ్లను క్షేత్రస్థాయిలో సేకరించారు. ఆలయ రక్షణకు సుమారు రూ.36 లక్షలతో ఆలయం చుట్టూ ప్రహరీ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తిచేశారు. త్వరలో ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా కనువిందుచేయనుంది.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Mahbubnagar, Nagarkurnool, Temple

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు