THE NATIONAL FAMILY HEALTH SURVEY HAS REVEALED THAT TELANGANA RANKS THIRD IN THE COUNTRY IN THE NUMBER OF HUSBANDS BEATING THEIR WIVES BK PRV
Wife and Husband Relation in Telangana: తెలంగాణలో భార్యలను కొట్టడంలొ భర్తలు దేశంలోనే మూడో స్థానం!.. దీనిపై మహిళలు ఏమంటున్నారంటే..?
ప్రతీకాత్మక చిత్రం
నేషనల్ ప్యామిలీ హెల్త్ సర్వేలో ఆందోళన కలిగించే నిజాలు బయటపడ్డాయి. తెలంగాణా వ్యాప్తంగా భర్తల చేత చిన్న చిన్న కారణాలకు భార్యలు దెబ్బలు తింటున్నారని వెల్లడించింది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే.
నేషనల్ ప్యామిలీ హెల్త్ సర్వే (National Family Health Survey)లో ఆందోళన కలిగించే నిజాలు బయటపడ్డాయి. తెలంగాణా వ్యాప్తంగా భర్తల చేత చిన్న చిన్న కారణాలకు భార్యలు దెబ్బలు తింటున్నారని (wives across Telangana are being beaten by husbands) వెల్లడించింది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే. తెలంగాణ (Telangana)లో 70.4% మంది పురుషులు, 83.8% మంది మహిళలు భార్యను కొట్టడాన్ని సమర్థించారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (NFHS-5) వెల్లడించింది. ఇక్కడ భార్యను కొట్టడానికి భర్తలు ఎంచుకుంటున్న కారణాలు భర్తకు చెప్పకుండా బయటకు వెళ్లడం (Going out without telling her husband), ఇంటిని పిల్లలను నిర్లక్ష్యం చేయడం, భర్తతో వాదించడం, శృంగారాన్ని నిరాకరించడం (Refusing sex), సరిగ్గా వంట చేయకపోవడం, అబద్దాలు చెప్పడం. అత్తమామలను అగౌరవపరచడం వంటివి ఉన్నాయని సర్వేలో తెలిపారు. పురుషులతో పోలిస్తే, అయితే ఇలా భర్త లు భార్యలు కొట్టడం పట్ల ఆశ్చర్యకరంగా 83.8% మంది మహిళలు తమ భర్తలు తాము తమ బాధ్యతలు సరిగ్గ నిర్వహించనప్పుడు కొట్టడం సమర్థనీయమని అభిప్రాయపడ్డారు.
అత్తమామలను అగౌరవపరిచినందుకు..
తెలంగాణలో 69% మంది మహిళలు ఇంటిని, పిల్లలను నిర్లక్ష్యం చేసినందుకు భార్యను కొట్టడాన్ని సమర్థించారు, 67.6% మంది మహిళలు అత్తమామలను అగౌరవపరిచినందుకు భార్యను కొట్టడాన్ని సమర్థించారు, 31.2% మంది మహిళలు భర్తకు చెప్పకుండా బయటకు వెళితే కొట్టడాన్ని సమర్థించారు, 29.3 % భార్య భర్తతో వాదిస్తే కొట్టడాన్ని స్త్రీలు సమర్థించారు, భార్య అబద్దాలు చెబితే లేదా భర్తకు అనుమానం కలిగేలా ప్రవర్తిస్తే 26.8% మంది మహిళలు కొట్టడాన్ని సమర్థించారు, 16.9% మంది భార్య లైంగిక సంపర్కానికి నిరాకరిస్తే భార్యను కొట్టడాన్ని సమర్థించారు, దీంతోపాటు భార్య సరిగ్గ వంట చేయకపోతే కొట్టడాన్ని 15% మంది సరైంది అని అభిప్రాయపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా పై చేప్పిన కారణాలతో దాదాపు 70.4% మంది పురుషులు భార్యలను కొడుతున్నట్లు సర్వే చెప్పింది.
భార్యాభర్తల కొట్లాటల్లో 3 వ స్థానం..
భార్యాభర్తల కొట్లాటల్లో తెలంగాణ దేశంలోనే మూడవ స్థానంలో ఉంది. రాష్ట్రంలో 18-49 ఏళ్ల మధ్య ఉన్న 41% మంది వివాహిత మహిళలు భార్యాభర్తల హింసను ఎదుర్కొన్నారు. భార్యాభర్తల హింసలో కర్ణాటక అగ్రస్థానంలో ఉంది. దాదాపు 48% మంది మహిళలు భార్యాభర్తల హింసను బాధితులుగా సర్వే చెబుతుంది, బీహార్లో 43% మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 34% మంది మహిళలు భార్యాభర్తల హింసలో భాధితులుగా ఉన్నారు. తెలంగాణలో, 18-49 సంవత్సరాల వయస్సు గల స్త్రీలలో 18.6% మంది తమ భర్తల నుండి మానసిక హింసను ఎదుర్కొంటున్నారు, 36.7% మహిళలు శారీరక హింసను ఎదుర్కొంటున్నారు. దీంతోపాటు 4.5% మంది లైంగిక హింసను ఎదుర్కొంటున్నారు. 40.4% మంది స్త్రీలు పై చెప్పిన మూడు రకాల హింసలను ఎదుర్కొంటున్నట్లు సర్వే వెల్లడించింది.
అయితే భర్తలు భార్యలను కొట్టడంలో అత్యంత సాధారణమైనది చెంపదెబ్బ కొట్టడం. పెళ్లయిన వారిలో 25% మంది భర్తలు చెంపదెబ్బ కొట్టినట్లు సర్వే తెలిపింది. 12% మంది మహిళలు తమను నెట్టడం, 10% మంది తమ చేతిని మెలితిప్పినట్లు లేదా జుట్టు లాగినట్లు తెలిపారు; 8-9% మంది తమ పిడికిలితో కొట్టడం లేదా తన్నడం, లాగడం వంటివి చేస్తారని తెలిపారు. ఇదిలా ఉంటే ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించిన NFHS-5 సర్వే (2019-21) దేశంలోని 707 జిల్లాల నుండి 28 రాష్ట్రాల తోపాటు 8 కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 7,24,115 మంది మహిళలు, 1,01,839 మంది పురుషులను కవర్ చేస్తూ సుమారు 6.37 లక్షల గృహాలలో ఈ సర్వే నిర్వహించారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.