(K. Veeranna, News 18, Medak)
‘‘సామాన్య జీవితం గడుపుదామని అనుకుంటున్నా. కానీ భవిష్యత్ అంతా కష్టాలతో కూడుకున్నదే. కోవిడ్ కాలం, ఆన్లైన్ నాకు ఆత్మవిశ్వాసం లేకుండా చేశాయి. నేను బీటెక్ తర్వాత గేట్ రాసీ ఐఐటీ హెచ్ (IIT Hyderabad)లో ఎంటెక్లో చేరాను. కానీ ప్రతిరోజు ఒత్తిడికి గురవుతున్నాను. ఎక్కువ మంది విద్యార్థులు ప్లేస్మెంట్ కోసం ఎంటెక్ జాయిన్ అవుతారు. అలాంటప్పుడు ఈ థీసిస్ ఎందుకోసం? ట్రిపుల్ ఐటీ బెంగుళురు వంటివి థీసిస్ ప్రత్యామ్నయంగా ఇంటర్న్షిప్ చేయిస్తోంది. విద్యార్థులను ఈ థీసిస్పై ఒత్తిడి చేయకండి. అలా ఒత్తిడి చేస్తే వారు ఆత్మహత్యలు (Suicides) ఎలా చేసుకోవాలనే దానిపై పరిశోధనలు చేస్తారు.
ఈ ఒత్తిడిని తట్టుకోలేక నేను ధూమ, మద్యపానానికి అలవాటుపడ్డాను. అయినా అవి ఒత్తిడిని దూరం చేయలేకపోయాయి. నా ఈ నిర్ణయంపై ఎవరి ప్రమేయం లేదు. అమ్మా, నాన్న, చెల్లి నాకోసం బాధ పడకండి. నేనెప్పుడు మీ వెంటే ఉంటాను. నా పేరుతో సేవా కార్యక్రమాలు చేయండి. నాన్న నువ్వు జీవితంలో కష్టాలను ఎదుర్కొంటూ ఒత్తిడిని ఎలా తట్టుకోగలిగావు. అమ్మా నువ్వు బాధపడకు. నువ్వు చేసే ప్రతి పనిలో నేను తోడుగా ఉంటా. చెల్లి.. అమ్మానాన్న లను బాగా చూసుకో.
మిత్రులు ప్రతి వేడుకను ఘనంగా జరుపుకోండి. పుట్టినరోజు వేడుకలు.. ఇలా ప్రతి అకేషన్లో నేను మీతో ఉంటాను. నా అవయవాలను దానం చేయండి. విద్యార్థులకు ఇవ్వాల్సిన స్టైఫండ్ చెల్లింపు లను జాప్యం చేయకండి. 5జీని చూడకముందే వెళ్లిపోతున్నాను ”అంటూ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన హైదరాబాద్ ఐఐటీలో ఎంటర్ విద్యార్థి బింగుమల్ల రాహుల్ ల్యాప్‌టాప్‌లో రాశారు.
ఐఐటీ హైదరాబాద్‌లో తన హాస్టల్ గదిలో రాహుల్ మంచానికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆగస్టు 31న వెలుగుచూసింది. ఈ గదిలో పోలీసులు సీమ్ ల్యాప్టాప్ అంటూ రాసిన ఓ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రాహుల్ ల్యాప్టాప్ (Laptop), సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని సైబర్ విభాగానికి పంపి వాటి లాక్ ఓపెన్ చేసి చూడగా ఈ మేరకు ఆయన సూసైడ్ నోట్ బయటపడింది. ఈ వివరాలను ఎస్పీ రమణకుమార్ మంగళవారం వెల్లడించారు.
రెండు రోజుల క్రితమే అఘాయిత్యం
రాహుల్ ఆత్మహత్యకు (Rahul suicide) పాల్పడినట్లు ఆగస్టు 31న వెలుగుచూసింది. కానీ అంతకంటే సుమారు రెండు రోజుల క్రితమే రాహుల్ ఈ అఘాయిత్యానికి పాల్పడి నట్లు పోస్టుమార్టంలో వెల్లడించారు . ఆగస్టు 29 రాహుల్ కనిపించకపోవడం తో సహచర విద్యార్థులు అనుమానం వచ్చి గదిలో తలుపు సందులోంచి తొంగి చూడగా కాళ్లు వేలాడుతున్నట్లు కనిపించడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించి తలుపులు బద్దలు కొట్టారు.
ఆ విద్యార్థి ఆత్మహత్యకు ఒత్తిడే కారణం..
రాహుల్ ఆత్మహత్య ఘటన జరిగి పది రోజులు కూడా గడవకముందే ఐఐటీ పూర్వ విద్యార్థి రాజస్థాన్‌కు చెందిన మేఘ కపూర్ సంగారెడ్డిలోని పొత్తిరెడ్డిపల్లి చౌరస్తాలో తాను బస చేస్తున్న లాడ్జ్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మేఘ కపూర్ ఆత్మహ త్యకు కూడా ఒత్తిడే కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బీటెక్ బ్యాక్ లాగ్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న మేఘ కపూర్ కూడా ఒత్తిడికి గురై లాడ్జి భవనంపై నుంచి దూకి ఆత్మ హత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sangareddy, Suicide