హోమ్ /వార్తలు /తెలంగాణ /

Monkeys Attack: వానరుడా.. ఇవేమి బాధలు నాయనా.. పంట పొలాలు, మనుషులపై కోతుల దాడులు.. కష్టాల్లో చిరు వ్యాపారాలు

Monkeys Attack: వానరుడా.. ఇవేమి బాధలు నాయనా.. పంట పొలాలు, మనుషులపై కోతుల దాడులు.. కష్టాల్లో చిరు వ్యాపారాలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ( Mahbubnagar) కొన్ని మండలాల పరిధిలో కోతుల బెడద (Monkeys Attack) తీవ్ర రూపం దాలుస్తుంది. కేవలం అమ్రాబాద్ పదరా మండల పరిధిలో 5 వేల ఎకరాల్లో పత్తి మొక్కజొన్న తదితర పంటలను రైతులు వేయడమే మానేశారు.

  (న్యూస్ 18, మహబూబ్ నగర్, సయ్యద్ రఫీ)

  ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ( Mahbubnagar) కొన్ని మండలాల పరిధిలో కోతుల బెడద (Monkeys Attack) తీవ్ర రూపం దాలుస్తుంది. ఉమ్మడి ఐదు జిల్లాల పరిధిలో సుమారు 32 వేల వరకు ఉంటాయని అధికారులు అంచనా. వాటిలో నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ పులుల అభయారణ్యంలోని 2021 లెక్కల ప్రకారం 11,600 కోతులు ఉన్నట్లు లెక్క తేల్చారు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో వానర మూకలు పంటలను నాశనం చేస్తున్నాయి నవాబుపేట కోయిలకొండ హన్వాడ కోస్గి ధన్వాడ నారాయణపేట పానగల్ వీపనగండ్ల అచ్చంపేట పదరా అమ్రాబాద్ ధరూర్ ఇటిక్యాల మండల పరిధిలోని సమస్య తీవ్రంగా ఉంది, ఈ మండలాల పరిధిలో 15వేల ఎకరాలకు పైగా సాగు విస్తీర్ణం పై కోతుల ప్రభావం చూపుతున్నాయి, కేవలం అమ్రాబాద్ పదరా మండల పరిధిలో 5 వేల ఎకరాల్లో పత్తి మొక్కజొన్న తదితర పంటలను రైతులు వేయడమే మానేశారు.

  కోతులు పొలాల్లోకి రాకుండా ఉండడానికి మహబూబ్​నగర్​ ( Mahbubnagar) జిల్లా నవాబ్పేట మండలంలో వందల చెట్లను నరికేశారు వనపర్తి జిల్లాలో గ్రామాల్లోనే తీస్తా వేసి ఇండ్లలో కి వస్తున్నాయి, చిన్న పిల్లలను గాయపరుస్తున్నాయి (Monkeys Attack). నాయి గ్రామ శివారు లోని టవర్ల పైనే మకాం వేస్తున్నాయి. కోతుల సంతతిని తగ్గించడానికి పురపాలికలు పంచాయితీల ఆధ్వర్యంలో అక్కడి అధికారులకు కావాల్సిన సహకారం అందిస్తున్నామని మహబూబ్ నగర్ జిల్లా అడవి శాఖ అధికారి గంగిరెడ్డి తెలిపారు. వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాల అడవి శాఖ అధికారి రామకృష్ణ మాట్లాడుతూ.. గ్రామాల్లో కోతుల బెడద తగ్గించడానికి పకృతి  వానలో పండ్ల మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు.

  ఇవిగో ఇబ్బందులు..

  పత్తి పంట వేసే మొగ్గ దశలోనే ధ్వంసం చేస్తున్నాయి. మొక్కజొన్న కంకులను తినేస్తున్నాయి కూరగాయల పంటల పై దాడులు చేస్తున్నాయి. గింజలు పట్టే సమయానికి వరి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ఇళ్లలోకి వచ్చి తినుబండారాలను వెహికల్స్ ఉన్నాయి. గుంపులు గుంపులుగా వచ్చి ఇంటి దగ్గర ఉన్న చిన్నారులపై దాడులు చేస్తున్నాయి.

  పదేళ్లుగా పంట సాగు చేయడం లేదు..

  కోతుల బెడద తో పదేళ్లుగా పంటలు సాగు చేయడం లేదని మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలంలోని లింగంపల్లి కి చెందిన రైతు పద్మనాభరెడ్డి చెబుతున్నారు. 30 ఎకరాల పొలం ఉందని మొక్కజొన్న జొన్న పత్తి కంది వేరుశనగ పంటలను సాగు చేసేవారు. కోతుల బెడద కారణంగా కేవలం రెండు మూడు ఎకరాలు ఇంటి అవసరాలకు వరి సాగు చేస్తున్నామని తెలిపారు.

  తలుపులు తెరవాలంటే భయమేస్తుంది..

  కోతుల బెడద తో తలుపులు తెరవాలంటే భయమేస్తుందని పానగల్  గ్రామానికి చెందిన సుదర్శన్ రెడ్డి అంటున్నారు. రూ 4 వేలు ఖర్చుపెట్టి జాలీలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. బయట నిలబడితే ఎప్పుడు  వచ్చి దాడి చేస్తాయని భయపడుతున్నారని తెలిపారు. కిరాణం దుకాణానికి వెళ్లి సంచులు వస్తువులు తీసుకురావాలంటే కష్టంగా మారిందని ఆయన చెబుతున్నారు. చిరు వ్యాపారులు పండ్ల దుకాణాలు పెట్టుకుంటే వారిని బెదిరించి పండ్లు లాక్కుంటున్నాయని, వారి పరిస్థితి దయనీయంగా ఉందంటున్నారు సుదర్శన్​ రెడ్డి. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని ప్రజలు కాపాడాలని ఆయన కోరుతున్నారు

  First published:

  Tags: Farmers, Mahbubnagar, Monkeys, Village

  ఉత్తమ కథలు