ఆదిలాబాద్ (Adilabad) జిల్లా జైనథ్ మండల కేంద్రంలో పూజలు (Occult prayers) కలకలం రేపుతున్నాయి. జైనథ్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (Primary Health Centre) ద్వారం ముందర క్షుద్రపూజలు (Occult Worships) చేసిన ఆనవాలు కనిపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ పలుమార్లు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో భయాందోళన చెందుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన ద్వారం ఎదుట ఓ కోడి గుడ్డు (Egg), ఐదు నిమ్మకాయలు (Lemon), పసుపు కుంకుమ చల్లి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. ప్రాథమిక ఆరోగ్యానికి ముందు భాగంలో, వెనుక భాగంలో కూడ గుర్తితెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లను స్థానికులు గుర్తించారు. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అయితే ఇలాంటి వాటిని ప్రజలు భయాందోళన చెందవద్దని గ్రామ సర్పంచ్ దేవన్న సూచించారు. దుండగులను గుర్తించేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామన్నారు.
గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఇలాంటి ఘటనే జరిగింది. జైనథ్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల ప్రధాన ద్వారం వద్ద ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు (Witchcraft in school) చేసినట్లు ఆనవాళ్ళు బయటపడ్డాయి. రాత్రి పూట ఈ పూజలు చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ప్రధాన గేటు వద్ద ప్రత్యక్షమైన ముగ్గులు, విచిత్ర బొమ్మలు కోడిగుడ్లు, నిమ్మకాయలు, మిరపకాయలను గమనించిన పాఠశాల వాచ్ మెన్ ఈ సమాచారాన్ని గ్రామస్థులకు తెలియజేశాడు. ఆ తర్వాత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జావిద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గతంలో వరంగల్ జిల్లాలో ..
ఇదే మాదిరిగా పాఠశాలలో క్షుద్రపూజలు చేసిన వైనం గతంలోనూ చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాల ఆవరణలోకి దెయ్యాలు వస్తున్నాయని ఓ పాఠశాల హెచ్ఎం కుద్రపూజలు (Witchcraft in school) చేయించిన ఘటన వరంగల్ జిల్లాలో గతంలో జరిగింది. విద్యార్థులు సరిగా పాఠశాలకు రావడం లేదని, తన ఆరోగ్యం బాగుండటం లేదని మూఢ నమ్మకాలతో ఓ ప్రధానోపాధ్యాయురాలు భూత వైద్యుడితో క్షుద్రపూజలు (Witchcraft in school) చేయించింది. కమలాపూర్ మండలం శంభునిపల్లి గ్రామంలోని పాఠశాలలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. దీంతో పాఠశాల విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు.
ప్రధానోపాధ్యాయురాలు అంతకుముందు నాలుగు రోజుల నుంచి పాఠశాలకు రాలేదు. ఓ భూత వైద్యుడిని తీసుకువచ్చి పూజలు చేయించినట్లు పాఠశాల ఆవరణలో ఆనవాళ్లు కనిపించాయి. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేశారు. ఈ ఘనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. క్షుద్రపూజలు చేసిన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. భూతవైద్యుడిని, ప్రధానోపాధ్యాయురాలును అదుపులోకి తీసుకొని విచారించారు. ఇలాంటి క్షుద్రపూజలను ఎవరు నమ్మవద్దని పోలీసులు అక్కడి స్థానికులకు తెలిపారు. గొప్ప గొప్ప చదువులు చదివిన కొందరికి మూఢ నమ్మకాల విషయంలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. టెక్నాలజీ యుగంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం మన దురదృష్టకరం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, Black magic