ఈటల రాజేందర్ వర్సెస్ టీఆర్ఎస్ నేతల మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది..ఎన్నికల నేపథ్యంలోనే హుజురాబాద్‌లో పై చేయి సాధించేందుకు ఇరు పార్టీల నేతలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు.ఇందులో భాగంగానే ఇప్పటి నుండే ఎన్నికల వాతవరణాన్ని క్రియెట్ చేస్తున్నారు ఇరు పార్టీల నాయకులు ఇందుకోసం హుజురాబాద్‌లో చోటామోటా నాయకుల ప్రచారంతోపాటు ఎమ్మెల్యేలు, మంత్రులు హుజురాబాద్ బాట పడుతున్నారు.
ఈనేపథ్యంలోనే రెండు రోజుల క్రితం ఈటల రాజేందర్ సీఎం లేఖ రాసినట్టుగా, ఆ లేఖ సోషల్ మీడియలో చక్కర్లు కొడుతోంది. అయితే ఫేక్ లేఖ అంటూ బిజెపి నేతలు కొట్టిపారేశారు. టీఆర్ఎస్ నేతలే దాన్ని సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని బిజెపి నేతలు ఆరోపించారు. దీంతో సీఎం ప్లాన్ రివర్స్ అయిందంటూ కూడా బిజెపి నేతలు ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్‌పై ఎమ్మెల్యే బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. ఈటల రాజేందర్‌ను ఇకనుండి వెన్నుపోటు రాజేందర్‌గా పిలవాలని అన్నారు. ఆయన సీఎంకు రాసిన లేఖ నిజమైందేనని స్పష్టం చేశారు. కాని బిజెపి మాత్రం అది ఫేక్ లెటర్‌గా మార్చి ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. అది ఫేక్ లెటర్ అని బండి భాగ్యలక్ష్మి అమ్మవారి ముందు ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరాడు. ఈటల రాజేందర్ తనకున్న రెండువందల ఎకరాలు అమ్మైనా ఎన్నికల్లో గెలుస్తానని చెప్పాడని అయితే..ఆ డబ్బు సంచులతో వచ్చే బిజెపి వారితో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.
ఇక ఈటల తన ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టి దోరల వద్ద మోకరిల్లారని విమర్శించారు.రానున్న ఎన్నికల్లో ఈటల ఓడిపోవడం ఖాయమని దీంతో ఈటల ఇక బిజెపి రాజేందర్‌గానే మిగలనున్నారని ఎద్దెవా చేశారు. హుజురాబాద్ మండలంలోని పలు గ్రామాల టీఆర్ఎస్ కార్యకర్తలతో బీఎస్సార్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా బాల్క సుమన్ హాజరై ప్రసంగించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balka Suman, Eetala rajender