హోమ్ /వార్తలు /తెలంగాణ /

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు..ఆ నలుగురికి బిగ్ షాకిచ్చిన తెలంగాణ సిట్!

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు..ఆ నలుగురికి బిగ్ షాకిచ్చిన తెలంగాణ సిట్!

ఆ నలుగురికి బిగ్ షాకిచ్చిన తెలంగాణ సిట్!

ఆ నలుగురికి బిగ్ షాకిచ్చిన తెలంగాణ సిట్!

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజి నిందితులుగా ఉన్నారు. ఇక తాజాగా మరో నలుగురిని ఈ కేసులో నిందితులుగా చేరుస్తు తెలంగాణ సిట్ ఏసీబీ స్పెషల్ కోర్టులో మెమో దాఖలు చేసింది. A4గా బీజేపీ అగ్రనేత BL సంతోష్, A5గా తుషార్, A6గా జగ్గుజీస్వామి, A7గా బండి సంజయ్ అనుచరుడు, న్యాయవాది శ్రీనివాస్ ను చేర్చింది సిట్. వీరు విచారణకు రావాలని కొన్నిరోజుల క్రితం నోటీసులు ఇచ్చిన రాలేదని తెలుస్తుంది. నలుగురిలో కేవలం శ్రీనివాస్ మాత్రమే సిట్ విచారణకు హాజరు అయ్యారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (TRS MLAs Poaching Case)లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో రామచంద్రభారతి (Rama chandhra bharathi), నందకుమార్ (Nandhakumar), సింహయాజి (Simhayaji) నిందితులుగా ఉన్నారు. ఇక తాజాగా మరో నలుగురిని ఈ కేసులో నిందితులుగా చేరుస్తు తెలంగాణ సిట్ ఏసీబీ స్పెషల్ కోర్టులో మెమో దాఖలు చేసింది. A4గా బీజేపీ అగ్రనేత BL సంతోష్ (santosh), A5గా తుషార్ (Thushar), A6గా జగ్గుజీస్వామి (Jagguji swami), A7గా బండి సంజయ్ అనుచరుడు, న్యాయవాది శ్రీనివాస్ (Advocate Srinivas) ను చేర్చింది సిట్. వీరు విచారణకు రావాలని కొన్నిరోజుల క్రితం నోటీసులు ఇచ్చిన రాలేదని తెలుస్తుంది. నలుగురిలో కేవలం శ్రీనివాస్  (Advocate Srinivas) మాత్రమే సిట్ విచారణకు హాజరు అయ్యారు.

Bhadradri: వీడియోలు తీసినందుకే ఇంత ఘోరమా..? ఫారెస్ట్ రేంజర్ హత్య కేసులో సంచలన నిజాలు

నోటీసులు ఇచ్చిన విచారణకు గైర్హాజరు..

ఈ కేసుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి BL సంతోష్, కేరళకు చెందిన జగ్గూజి, తుషార్, బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఈనెల 21న సిట్ విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. కానీ ఈ నలుగురిలో కేవలం బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్ మాత్రమే సిట్ విచారణకు హాజరయ్యాడు. రెండు రోజులు శ్రీనివాస్ ను విచారించిన సిట్ సింహయాజికి ఫ్లైట్ టికెట్ బుక్ చేశారనే అంశంపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే తాను ఇంట్లో పూజ కోసమే ఫ్లైట్ టికెట్ బుక్ చేశానని సిట్ అధికారులకు వివరణ ఇచ్చాడు.  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి BL సంతోష్, కేరళకు చెందిన జగ్గూజి, తుషార్ మాత్రం విచారణకు హాజరు కాలేదు. దీనితో కోర్టుకు వెళ్లిన సిట్ కు హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. BL సంతోష్ కు ఈ-మెయిల్ ద్వారా నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. ఇక తుషార్, జగ్గుజీస్వామిపై దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులను అలెర్ట్ చేస్తూ లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

అసలు కేసు ఏంటి?

గతం నెల 26న మొయినాబాద్ ఫామ్ హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావును పార్టీ మారాలని భారీ డీల్ ను రామచంద్రభారతి (Rama chandhra bharathi), నందకుమార్ (Nandhakumar), సింహయాజి (Simhayaji) తీసుకొచ్చారు. ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఇస్తామని వారు ప్రలోభాలకు గురి చేశారు. కానీ రోహిత్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు దీనిని భగ్నం చేశారు. అయితే తమ ఎమ్మెల్యేలను కొనాలని బీజేపీ ప్రయత్నించిందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది.

First published:

Tags: Hyderabad, Telangana, Trs, TRS MLAs Poaching Case

ఉత్తమ కథలు