హోమ్ /వార్తలు /తెలంగాణ /

The Kashmir Files: కాశ్మీర్ ఫైల్స్ థియేటర్లో పాకిస్తాన్ అనుకూల నినాదాలు.. ఆదిలాబాద్‌లో ఉద్రిక్తత

The Kashmir Files: కాశ్మీర్ ఫైల్స్ థియేటర్లో పాకిస్తాన్ అనుకూల నినాదాలు.. ఆదిలాబాద్‌లో ఉద్రిక్తత

The Kashmir Files: తాగిన మైకంలోనే పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసినట్లుగా తమకు సమాచారం ఉందని పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

The Kashmir Files: తాగిన మైకంలోనే పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసినట్లుగా తమకు సమాచారం ఉందని పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

The Kashmir Files: తాగిన మైకంలోనే పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసినట్లుగా తమకు సమాచారం ఉందని పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

  ప్రస్తుతం దేశవ్యాప్తంగా 'ది కాశ్మీర్ ఫైల్స్'  (The Kashmir Files) సినిమా గురించి చర్చ జరుగుతోంది. కాశ్మీరీ పండిట్లపై జరిగిన ఊచకోతను కళ్లకు కట్టినట్లు చూపించారని దేశం నలువైపుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్‌ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన వారం రోజుల్లో రూ.100 కోట్లు దాటింది. ఐతే ఈ సినిమా గురించి ఆదిలాబాద్‌ పట్టణంలో వివాదం నెలకొంది. ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ ప్రదర్శన సందర్భంగా శుక్రవారం నటరాజ్ థియేటర్‌ (NatraJ Theater)లో ఉద్రిక్తత నెలకొంది. సినిమా నడుస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు. పాకిస్తాన్ జిందాబాద్ అని గట్టిగా అరిచారు. అంతే వెంటన మిగతా ప్రేక్షకులు వారిపై దాడి చేశారు. అనంతరం వారిద్దరు ఎలాగోలా తప్పించుకొని అక్కడి నుంచి పారిపోయారు.

  సమాచంర అందుకున్న పోలీసులు నటరాజ్ థియేటర్‌కి వెళ్లి.. పరిస్థితిని అదుపు చేశారు. థియేటర్ యాజమాన్యంతో మాట్లాడి వివరాలు సేకరించారు. కొందరు ప్రత్యక్ష సాక్షులను కూడా విచారించారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరన్నది తెలియాల్సి ఉంది. తాగిన మైకంలోనే పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేసినట్లుగా తమకు సమాచారం ఉందని పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నటరాజ్ థియేటర్‌లో జరిగిన ఘటనపై స్థానిక బీజేపీ నేతలు స్పందించారు. భారత్‌లో ఉంటూ.. పాకిస్తాన్ అనుకూలంగా మాట్లాడేవారిని.. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఉండడం ఇష్టం లేకుంటే..పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలని మండిపడుతున్నారు.

  The Kashmir Files - Prakash Raj : ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీపై ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్

  'ది కాశ్మీర్ ఫైల్స్’ మూవీ మార్చి 11న విడుదలయింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కేవలం 15 కోట్లతో నిర్మించారు. 90వ దశకంలో కశ్మీర్‌లో జరిగిన దారుణ హింసాకాండాను ఉన్నది ఉన్నట్లు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కళ్లకు కట్టినట్టు చూపించారిన విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమాను చూసి క్రిటిక్స్‌తో పాటు సెలబ్రిటీలు ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా కూడా మెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రానికి పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు టాక్స్ ఫ్రీ ప్రకటించాయి. మరోవైపు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రభుత్వ ఉద్యోగులు ఈ సినిమ ా కోసం హాఫ్ డే లీవ్ కూడా మంజూరు చేయడం విశేషం.

  RRR Censor review: ‘ట్రిపుల్ ఆర్’ సెన్సార్ పూర్తి.. టాక్ ఎలా ఉందంటే..?

  సినిమా విడుదలైన మొదటి రోజు కేవలం రూ. 3.55 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు నుంచి సంచలనం సృష్టిస్తోంది. కేవలం మౌత్ టాక్‌తో కలెక్షన్‌ల సునామీ సృష్టిస్తోంది. రెండో రోజు 8.50 కోట్లు.. మూడో రోజు 15.50 కోట్లు.. నాలుగో రోజు 15.05 కోట్లు వసూలు చేసింది. ఐదు రోజు రూ. 18.02, ఆరో రోజు రూ. 19.05 కోట్లు.. ఏడో రోజు.. ఈ సినిమా రూ. 18.05 కోట్లు వసూళు చేసింది. ఇప్పటికే వంద కోట్ల వసూళ్లు రాబట్టినట్లుగా బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మూవీని త్వరలో తెలుగులోకి కూడా డబ్బింగ్ చేస్తామని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు.

  First published:

  Tags: Adilabad, Bollywood, Telangana, The Kashmir Files

  ఉత్తమ కథలు