Home /News /telangana /

THE JOINT IS THROWING A COLD PAW ON THE ADILABAD DISTRICT WITH THIS THE PEOPLE OF THE DISTRICT ARE TREMBLING YARD BY YARD ADB VB

Cold Weather : విసురుతున్న చలి పంజా.. అక్కడ భారీగా పడిపోయిన ఉష్టోగ్రతలు.. వణుకుతున్న జనాలు..

ఆదిలాబాద్ లో చలి పంజా

ఆదిలాబాద్ లో చలి పంజా

Severe Cold : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతోంది. దీంతో జిల్లా ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. చలికి తోడు గాలులు కూడా వీస్తుండటంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి.

ఇంకా చదవండి ...
(K.Lenin,News18,Adilabad)

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసురుతోంది. దీంతో జిల్లా ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. చలికి తోడు గాలులు కూడా వీస్తుండటంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. పెరిగిపోతున్న చలి తీవ్రత నుండి కాపాడుకునేందుకు ప్రజలు చలి మంటలు కూడా కాస్తూ ఉపశమనం పొందుతున్నారు. తూర్పు, ఈశాన్య దిక్కుల నుండి వీస్తున్న గాలులతోనే చలి తీవ్రత పెరిగినట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్టోగ్రతలు పడిపోయాయి. సింగిల్ డిజిట్ లో ఉష్ణోగ్రతలు నమోదవతున్నాయి.

Shocking: పెళ్లి చేసుకున్నా ఆమెకు ఆ కోరిక మాత్రం పోలేదు.. చివరకు ఆమె ఎంతటి ఘనకార్యం చేసిందో చూడండి..


జిల్లాలోని ఏజేన్సీ ప్రాంతం గత కొన్ని రోజులుగా చలికి వణికిపోతోంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరిలో 9 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోగా అదే జిల్లాలోని సిర్పూర్(యు)లో కనిష్ట ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలోని సొనాలలో 9.1 డిగ్రీలు, అర్లి(టి)లో 9.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా, మంచిర్యాల జిల్లా జన్నారంలో 9.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు నిర్మల్ జిల్లా పెంబి మండలంలోనూ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలు నమోదైంది. ఈసారి ఉమ్మడి జిల్లాలో సాధారణం కంటే రెండు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గినట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

Zodiac Signs: వివాహం అయినా.. ఈ 3 రాశుల వారు తమ మాజీ ప్రేమికుల వంక చూస్తారట.. వారెవరంటే..


ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి ఇంతకింతకు పడిపోతుండటంతో జనం గజగజ వణికిపోతున్నారు. ఉదయం పూట విధులు నిర్వర్తించే పారిశుద్ద్య కార్మికులు, పాలు సరఫరా చేసే వారు పెరిగిన చలితో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వాకర్లు కూడా వణికిపోతున్నారు. పిల్లలు, వృద్దులు కూడా అవస్థలు పదుతున్నారు. ఉదయం పూట పాఠశాలలు, కళాశాలకు వెళ్ళె విద్యార్థులు, ఉద్యోగ రీత్య రాకపోకలు సాగించే ఉద్యోగులు కూడా చలితో అవస్థలు పడుతున్నారు.

Weight Loss Tips: మీరు శాకాహారులా..? బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఈ ప్రోటీన్ ఫుడ్స్ ట్రై చేయండి


మరోవైపు చలి నుండి కాపాడుకోవడానికి కొంత మంది చలి మంటలు వేసుకుంటున్నారు. మరోవైపు చలి గాలులు పంట పొలాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పత్తిలో తేమ శాతం పెరిగిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏజేన్సీ ప్రాంతంలోని గ్రామాల చుట్టు అడవులు, కొండలు ఉండటంతో పొగమంచు కమ్ముకొని జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అటవీ ప్రాంతాల్లోని గ్రామాల్లో బయటకు వెళ్ళకుండా ఇంటిపట్టునే ఉండిపోవాల్సిన పరిస్థితి తయారైంది. ఇంకా కొన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Adilabad, Cold, Cold remedies, Cold water

తదుపరి వార్తలు