ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ కు బయలుదేరిన ఇంటర్ సిటి ప్యాసింజర్ రైలు ఇంజన్ నుండి అకస్మాత్తుగా పొగలు రావడంతో ఆ రైలును మార్గమధ్యలోని నిలిపివేశారు. జిల్లా కేంద్రం నుంచి ప్రయాణికులతో బయలుదేరిన రైలు తలమడుగు మండలంలోని డోర్లి గ్రామ సమీపంలోకి రాగానే ఇంజన్ నుంచి దట్టమైన పోగలు రావడంతో పాటు ఇంజన్ లో ఉన్న ఆయిల్ బయటకు రావడాన్ని గమనించిన లోకో పైలేట్ వెంటనే రైలును నిలిపివేశాడు. అనంతరం ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. ఇదిలా ఉన్నపలంగా మార్గమధ్యలో ఇలా రైలును నిలిపి వేయడంతో ప్రయాణికులు ఏమి జరిగిందో తెలియక ఆందోళనకు గురయ్యారు. తర్వాత అసలు విషయాన్ని తెలుసుకొని తేరుకున్నారు. అయితే ఇంజన్ లో ఏర్పడ్డ సాంకేతిక లోపం కారణంగానే ఈ సమస్య ఏర్పడినట్లు భావిస్తున్నారు. నిలిచిపోయిన రైలు ఇంజన్ స్థానంలో మరో ఇంజన్ ను అమర్చి రైలును నాందేడ్ పంపించారు. అయితే కొద్ది దూరం వెళితే దట్టమైన అటవీ ప్రాంతం ఉంది.
రెండు రాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలకు ఈ ఇంటర్సిటీ ట్రైన్ చాలా ముఖ్యమైనది. ఇక్కడివారి రాకపోకలకు ఇది అనుకూలంగా ఉండటంతో ఉదయం పాల వ్యాపారం, కూరగాయల వ్యాపారం చేసేవారు ఇందులోనే ప్రయాణం చేస్తుంటారు.
ఆ అటవీ ప్రాంతంలో ఇలా నిలిచిపోతే ఎవరు అందుబాటులో ఉండేవారు కాదని, మరింత ఆందోళన చెందాల్సి వచ్చేదని ప్రయాణికులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రానికి కొద్దిదూరంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. రైలు ఇంజన్ లోపం కారణంగా ప్రయాణికులు కొంత ఇబ్బందిపడక తప్పలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Adilabad, Indian Railways, Maharashtra, South Central Railways, Train accident