Home /News /telangana /

THE INTER BOY FROM SURYAPET INVENTED A MACHINE FOR HARVESTING CROP WITH THE TOOLS AVAILABLE TO HIM AND GOT APPRECIATION FROM CENTRE PRV

Telangana: లాక్​డౌన్​ స‌మ‌యంలో ఈ ఇంటర్​ కుర్రాడికి వ‌చ్చిన ఐడియా  రైతుల క‌ష్టాలు తీర్చింది.  ఏకంగా కేంద్రం నుంచి ప్రశంస దక్కింది.. ఏమిటి ఆ ఐడియా? 

అశోక్​

అశోక్​

కోవిడ్ లాక్ డౌన్ ఇంటర్​ కుర్రాడికి వ‌చ్చిన ఆలోచ‌న ఎంద‌రో రైతుల‌కు బాస‌ట‌గా నిలిచింది. త‌న తండ్రి ప‌డుతున్న క‌ష్టాన్ని చూసి త‌న మెద‌డుకు ప‌దునుపెట్టాడు. త‌నకు అందుబాటులో ఉన్న ప‌రిక‌రాల‌తో పొలాల్లో వ‌రి కొయ్య‌డానికి యంత్రాన్ని (A machine for harvesting crop) క‌నిపెట్టాడు.

ఇంకా చదవండి ...
  కోవిడ్ లాక్ డౌన్ ఇంటర్​ కుర్రాడికి వ‌చ్చిన ఆలోచ‌న ఎంద‌రో రైతుల‌కు బాస‌ట‌గా నిలిచింది. త‌న తండ్రి ప‌డుతున్న క‌ష్టాన్ని చూసి త‌న మెద‌డుకు ప‌దునుపెట్టాడు. త‌నకు అందుబాటులో ఉన్న ప‌రిక‌రాల‌తో పొలాల్లో వ‌రి కొయ్య‌డానికి యంత్రాన్ని (A machine for harvesting crop) క‌నిపెట్టాడు. నిండా 18 ఏళ్లు నిండ‌ని ఈ కుర్రాడి క్రియేష‌న్ కి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (Ministry of Science and Technology) నుంచి అభినంద‌న‌లు కూడా అందుకున్నాడు ఈ బుడ్డోడు.  17 ఏళ్ల అశోక్ గొర్రె (Ashok gorre) తెలంగాణ (Telangana)లోని సూర్యాపేట జిల్లాలో రైతు కుటుంబంలో జన్మించాడు. ఇంటర్​ చదువుతున్న అశోక్​ త‌న తోటి పిల్ల‌లు లాక్ డౌన్ టైంలో నెట్​ప్లిక్స్​లు, వెబ్ సిరీస్ లు అంటు కాల‌క్షేపం చేస్తుంటే అశోక్ మాత్రం తన గ్రామంలోని రైతులకు వ్యవసాయాన్ని (Agriculture) సులభతరం చేసే తక్కువ ధర యంత్రాన్ని కనిపెట్టాడు. ఇనుప కడ్డీలు, పాత సైకిల్ చక్రం, బోల్ట్‌లను ఉపయోగించి తయారు చేసిన ఈ ఫోర్-ఇన్-వన్ టూల్ వరిని కోయడానికి, గింజలను సేకరించడానికి, వరిని కట్టే ముందు ఎండబెట్టడానికి దాంతోపాటు మిరప కలుపు తీయడానికి ఉపయోగించవచ్చు.  ఇత‌ర పంట‌లు పత్తిని సేక‌రించ‌డానికి కూడా ఈ యంత్రం ఉప‌యోగ‌ప‌డుతుంది.

  రూ. 3,500 మాత్ర‌మే ఖ‌ర్చు..

  ఒక్క యంత్రంతో (Machine) ఎన్నో ప్ర‌యోజ‌నాలు చేకూర్చే విధంగా దీనిని రూపొందించాడు అశోక్. తాను రూపొందించిన యంత్రాన్ని రైతుల‌కు (For Farmers) అందుబాటు ధ‌ర‌లో ఉండేలా చూసుకున్నాడు.  దీన్ని త‌యారు చేయ‌డానికి 3,500 మాత్ర‌మే ఖ‌ర్చు చేశాడు. త‌న‌కు అందుబాటులో ఉన్న వ‌స్తువుల‌ను ఉప‌యోగించే ఈ ప‌రిక‌రాన్ని త‌యారు చేశాడు.  గత సంవత్సరం కోల్‌కతాలోని విజ్ఞాన భారతి (VIBHA) సహకారంతో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2019లో స్టూడెంట్స్ ఇంజినీరింగ్ మోడల్ పోటీలో మొదటి బహుమతిని కూడా గెలుచుకున్నాడు అశోక్.

  అశోక్​


  తల్లిదండ్రుల కష్టాలు చూసి..

  “స్కూల్ పుస్తకాల నుంచి నేర్చుకోవడమే కాకుండా, నా ఇంటి చుట్టూ ఉన్న స్క్రాప్ మెటీరియల్‌ని ఉపయోగించి కొత్త వ‌స్తువులు క్రియేట్ చేయ‌డం అంటే నాకు చాలా ఇష్టం. నేను 6వ తరగతిలో, సైన్స్ ఫెయిర్ కోసం నేను కొన్ని పైపులు, సిరంజిలు స్ప్రింగ్‌లను ఉపయోగించి హైడ్రాలిక్ JCB మోడల్‌ని తయారు చేశాను. దానికి బహుమతి కూడా వ‌చ్చింది. దీంతో అప్ప‌టి నుంచి ఇలా కొత్త వ‌స్తువులు త‌యారు చేయ‌డంపై మ‌రింత ఆస‌క్తి క‌లిగింది. దీంతోపాటు నా తల్లిదండ్రులు ఇద్దరూ వరి సాగు చేసేవారు కాబట్టి వారు విత్తనాలు నాటడం నుంచి ఎండిన వరిని సేకరించే వరకు వారు ఎదుర్కొంటున్న కష్టాలు కూడా నేను ఈ యంత్రాన్ని రూపోందించ‌డానికి  కార‌ణం అని న్యూస్18 కి తెలిపాడు అశోక్. ఇటీవలె మంత్రి కేటీఆర్​ సైతం యువకుడిని అభినందించారు.

  మంత్రి కేటీఆర్​తో అశోక్​


  కాగితంపై బొమ్మను గీసి..

  దేవ‌ర‌కొండ ఒకేష‌న్  కాలేజ్ లో ఇంట‌ర్మీడియట్ చ‌దువుతున్న అశోక్ ఈ యంత్రాన్ని రూపోందించ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. తొలుత ఆలోచ‌న రాగానే కాగితంపై యంత్రం ఎలా ఉండాల‌నే దానికి సంబంధించి ఒక బొమ్మ వేసుకొని త‌రువాత యంత్రం త‌యారు చేయ‌డానికి కావాల్సిన మెటీరియ‌ల్స్ ను సేక‌రించ‌డం ప్రారంభించాడు. వెల్డింగ్ వంటి వాటి కోసం ఊరిలో ఉన్న షాపుల‌పై ఆధార‌ప‌డ్డాడు. ఇలా పాత సామగ్రి వాడినందుకు దాదాపు 1,700 ఖ‌ర్చు చేశాడు అశోక్. అయితే అశోక్ ఈ యంత్రం త‌యారు చేయ‌డానికి కోవిడ్ స‌మ‌యాన్ని బాగా వినియోగించుకున్నాడు. లాక్​డౌన్​ సమయంలో అశోక్ వరి పంటలలో కలుపు మొక్కలను తొలగించగల పోర్టబుల్ యంత్రంపై సాధన చేసి సాధారణ పరికరం సైకిల్  హ్యాండ్ బ్రేక్, స్ప్రింగ్, ఇనుప రాడ్లు, ప్లేట్‌లను ఉపయోగించి ఈ యంత్రాన్ని త‌యారు చేశాడు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Farmers, Nalgonda, Suryapeta, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు