హోమ్ /వార్తలు /తెలంగాణ /

అలర్ట్.. తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు..

అలర్ట్.. తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ తుఫాను జూన్ మూడో తేదీ నాటికి ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్ తీరాలను చేరే అవకాశం ఉందని, ఛత్తీస్‌గడ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, దక్షిణ మధ్య కర్ణాటకమీదుగా లక్షదీవుల వరకు ఉపరితల ద్రోణి కొనసాగనుంది. నైరుతి రుతుపవనాలు సోమవారం కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉంది.

ఇంకా చదవండి ...

    తెలంగాణ ప్రజలు అలర్ట్‌గా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అదికాస్త వచ్చే 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ తుఫాను జూన్ మూడో తేదీ నాటికి ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్ తీరాలను చేరే అవకాశం ఉందని, ఛత్తీస్‌గడ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, దక్షిణ మధ్య కర్ణాటకమీదుగా లక్షదీవుల వరకు ఉపరితల ద్రోణి కొనసాగనుంది. నైరుతి రుతుపవనాలు సోమవారం కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో మూడు రోజులు అక్కడక్కడ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

    Published by:Anil
    First published:

    Tags: IMD, Rain alert, Telangana

    ఉత్తమ కథలు