హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఫింఛన్ సొమ్ములో కోత సమర్థనీయమా.. రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం..

ఫింఛన్ సొమ్ములో కోత సమర్థనీయమా.. రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం..

తెలంగాణ హైకోర్టు (ఫైల్ ఫోటో )

తెలంగాణ హైకోర్టు (ఫైల్ ఫోటో )

హైకోర్టు పింఛన్ సొమ్ములో 25 శాతం కోత విధించడం ఏలా సమర్థనీయమో తెలపాలంటూ కోరింది. దీనిపై మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కరోనా వైరస్ నియంత్రణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. ఫలితంగా అత్యవసర సేవలు మినహా సర్వం నిలిచిపోయాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి పైసా ఆదాయం లేదు. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ దారులకు చెల్లించే సొమ్ములో ప్రభుత్వం 50 శాతం కోత విధించింది. దీన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజనం దాఖలైంది. ఫించన్ సొమ్ములో 50 శాతానికి బదులు 25 శాతం కోత విధిస్తామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు సవివరంగా తెలిపారు. దీనిపై స్పందిచిన హైకోర్టు పింఛన్ సొమ్ములో 25 శాతం కోత విధించడం ఏలా సమర్థనీయమో తెలపాలంటూ కోరింది. దీనిపై మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇదిలావుంటే.. కరోనా చికిత్స చేస్తోన్న వైద్య సిబ్బంది భద్రత అంశం హైకోర్టులో విచారణకు వచ్చింది. కరోనా ఆస్పత్రల దగ్గర భద్రత పెంచామని ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి నివేదిక అందించింది. ఇప్పటివరకు వైద్య సిబ్బందిపై దాడులు చేసిన అంశంపై నాలుగు కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అయితే కరోనా ఆస్పత్రుల వద్ద ఎంతమంది భద్రత సిబ్బంది ఉంటున్నారనే విషయంపై రెండు వారాల్లో సమగ్రంగా నివేదిక ఇవ్వాలంటూ హైకోర్టు స్పష్టం చేసింది.

First published:

Tags: Coronavirus, High Court, Lockdown, Telangana

ఉత్తమ కథలు