Home /News /telangana /

THE HIGH COURT HAS ORDERED THE TELANGANA GOVERNMENT NOT TO TAKE ANY ACTION FOR A FEW DAYS AGAINST JAMUNA HATCHERIES PRV

Jamuna Hatcheries: KCR​ ప్రభుత్వానికి హైకోర్టు షాక్​.. జమునా కేసులో ఈటల రాజేందర్​కు ఊరట.. 

(కేసీఆర్‌పై ఈటల ఫైర్)

(కేసీఆర్‌పై ఈటల ఫైర్)

రైతుల ఫిర్యాదు నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హేచరీస్​పై టీఆర్​ఎస్​​ ప్రభుత్వం కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈటలకు హైకోర్టులో ఊరట లభించింది.

  గత కొద్దిరోజులుగా తెలంగాణలో ఈటల కుటుంబానికి, టీఆర్ఎస్​ (TRS) ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న పోరులో  బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ (MLA Etala rajendar) కుటుంబానికి ఊరట లభించింది. ఈటల కుటుంబానికి చెందిన జమున హేచరీస్ (jamuna hatcheries) కు హైకోర్టులో ఊరట లభించింది. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలోని ప్రభుత్వ భూమిని ఈ సంస్థ ఆక్రమించుకుందని రెవెన్యూ అధికారులు నిర్దారించి స్వాధీనానికి చర్యలు తీసుకున్నారు. అయితే దీనిపై జమునా హేచరీస్ హైకోర్ట్ ను ఆశ్రయించగా సర్వే నెంబర్ 130లోని జమునా హేచరీస్ కు చెందిన మూడెకరాల భూమి విషయంలో ఆగస్ట్ 1వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశిస్తూ హైకోర్ట్ (Highcourt) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అచ్చంపేటలో మూడెకరాల ప్రభుత్వ భూమిని జమునా హేచరీస్ సంస్థ ఆక్రమించుకుందని రెవెన్యూ అధికారులు నిర్ధారణకు వచ్చారు.

  ఈ క్రమంలోనే ఇటీవల మాసాయిపేట తహసీల్దార్ జమునా హేచరీస్ కు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడంతో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై జమునా హేచరీస్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. జమునా హేచరీస్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం జమునా హేచరీస్ కు ఊరటనిచ్చేలా మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ ఘటన కేసీఆర్​ సర్కారుకు జలక్​ ఇచ్చింది. అలాగే భూముల స్వాధీనానికి సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి, మెదక్ కలెక్టర్, ఆర్డివో, మాసాయిపేట తహసీల్దార్ లను న్యాయస్ధానం ఆదేశించింది.  కేసు ఏంటి?

  మెదక్ (Medak) జిల్లా మాసాయిపేట మండలం హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో భూముల కబ్జా జరిగినట్టు దర్యాప్తు కమిటీ నిగ్గు తేల్చింది. జమున హేచరిస్ ఆధీనంలో అక్రమంగా 66 ఎకరాల భూములు ఉన్నట్టు గుర్తించారు. వీటిలో అనుమతి లేకుండా అసైన్డ్ భూముల్లో చెట్లను తొలగించారని నివేదికలో పేర్కొన్నారు. అనుమతి లేకుండా జమున హేచరీస్ పౌల్ట్రీ షెడ్డులు నిర్మించారని.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను ఎగవేశారని నివేదికలో తెలిపారు. అసైన్డ్ ల్యాండ్‌ను ఈటల రాజేందర్ కబ్జా చేసినట్టు మెదక్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక అందించారు. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన మెదక్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు.. ప్రభుత్వం పేద బడుగు వర్గాలకు ఇచ్చిన సుమారు 66.01 ఎకరాల అసైన్మెంట్ భూములను జమున హాచరీస్ వారు కబ్జాచేశారని తేల్చారు.

  ఈ మొత్తం వ్యవహారంలో 20 మంది బాధితుల నుంచి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు. కలెక్టర్ సహా పలువురు అధికారులు ఆయా గ్రామాలకు వెళ్లి విచారణ చేశారు. వీరిలో కొందరు మంత్రి ఈటల రాజేందర్ బెదిరించి తమ భూములను లాక్కున్నారని చెప్పినట్టు సమాచారం. ఇందులో కొన్ని పట్టా భూములను వ్యవసాయేతర భూములుగా మార్చారని నివేదికలో పొందుపర్చారు. ఈ ప్రాథమిక రిపోర్ట్ ఆధారంగానే పలు కేసులు నమోదు చేశారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: CM KCR, Crime news, Eetala rajender, High Court, Medak

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు