ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. కేసుకు సంబంధించి BL సంతోష్, జగ్గుస్వామి, శ్రీనివాస్ ను నిందితులుగా చేరుస్తు ఇటీవల సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు (Acb Court) కొట్టివేసింది. అలాగే ఈ కేసు విచారణ చేపడుతున్న సిట్ కు లా అండ్ ఆర్డర్ ప్రకారం ఎలాంటి అధికారం లేదని ఏసీబీ కోర్టు (Acb Court) పేర్కొంది. అలాగే BL సంతోష్, శ్రీనివాస్, జగ్గుస్వామిని నిందితులుగా పరిగణించలేమని ఏసీబీ కోర్టు (Acb Court) తెలిపింది. కేసును విచారించడానికి ఏసీబీకే అధికారం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఏసీబీ కోర్టు (Acb Court) తీర్పుపై సిట్ హైకోర్టు (High Court)ను ఆశ్రయించింది. ఈ మేరకు హైకోర్టు (High Court)లో రివిజన్ పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై నేడు హైకోర్టు విచారణ జరిపింది.
బయటకు రాగానే అరెస్ట్..
ఈ కేసుకు సంబంధించి FIR లో, రిమాండ్ రిపోర్టులో A4 నుండి A7 పేర్లను పేర్కొనలేదు. కానీ సిట్ దాఖలు చేసిన మెమోలో మాత్రం BL సంతోష్, జగ్గుస్వామి, శ్రీనివాస్ ను నిందితులుగా చేరుస్తు సిట్ మెమో దాఖలు చేసింది. అయితే FIR లో, రిమాండ్ రిపోర్టులో పేర్లు చేర్చకుండా మెమోలో ఎలా చేరుస్తారని లాయర్ వాదనలు వినిపించారు. అలాగే కేసులు నేడు విడుదలైన నందకుమార్, రామచంద్రభారతిలను మళ్లీ వేరే కేసులో అరెస్ట్ చేయడం కక్షపూరితం అని లాయర్ వాదనలు వినిపించారు. ఇక ఫిర్యాదు చేసిన రోహిత్ పై 80 కేసులు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. లాయర్ వాదనలు విన్న కోర్టు తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది. రేపు హైకోర్టు తీర్పును వెలువడించనుంది.
Indian Navy SSR Recruitment 2022: ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో 1400జాబ్స్ .. రేపటి నుంచే దరఖాస్తులు.. పూర్తి వివరాలివే..
నిన్న వాడివేడిగా వాదనలు..
ఈ సందర్బంగా వాదనలు వినిపించిన అడ్వకెట్ జనరల్ ఏసీబీ కోర్టు (Acb Court) వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. కోర్టు పరిధి ధాటి వ్యవహరించిందని, ఏసీబీ కోర్టు (Acb Court)కు సిట్ మెమోను రిజెక్ట్ చేసే అధికారం ఉన్నప్పటికీ ఏసీబీ కోర్టు (Acb Court) ఇచ్చిన ఆర్డర్ క్వాష్ పిటీషన్ లా ఉందని అన్నారు. మరోవైపు ప్రతివాదుల తరపు న్యాయవాది ఏసీబీ కోర్టు ఇచ్చిన ఆర్డర్ ను సమర్ధించారు. ఈ క్రమంలో రివిజన్ పిటీషన్ కాపీని ప్రతివాదులకు అందజేయాలని హైకోర్టు చెప్పుకొచ్చింది.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (TRS MLAs Poaching Case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్రభారతీ (Rama chandra bharathi), నందకుమార్ (Nandhakumar), సింహయాజి (Simhayaji)లకు ఇటీవల హైకోర్టు (High Court) షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ఈ మేరకు నిన్న సింహయాజి (Simhayaji) జైలు నుంచి విడుదల కాగా నేడు రామచంద్రభారతీ (Rama chandra bharathi), నందకుమార్ (Nandhakumar) చంచల్ గూడ జైలు నుండి విడుదల అయ్యారు. అయితే రామచంద్రభారతీ (Rama chandra bharathi), నందకుమార్ (Nandhakumar) పై ఇతర కేసులు ఉండడంతో వారిని పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: High Court, Telangana, Telangana News, TRS MLAs Poaching Case