హోమ్ /వార్తలు /తెలంగాణ /

Heavy Rains: అయ్యో ఎంతటి విషాదం.. ఆ జిల్లాల్లో వడగండ్ల వానల బీభత్సం.. రైతన్న గగ్గోలు

Heavy Rains: అయ్యో ఎంతటి విషాదం.. ఆ జిల్లాల్లో వడగండ్ల వానల బీభత్సం.. రైతన్న గగ్గోలు

వర్షం నీళ్లలో బస్తాలు

వర్షం నీళ్లలో బస్తాలు

వడగండ్ల వాన ఆ జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి జొన్న పంట నెలకొరిగితే, శనగ పంట తడిసి ముద్ద అయ్యింది. వెరసి రైతన్నలకు శోకాన్ని మిగిల్చింది.

(కట్టా లెనిన్, న్యూస్ 18 తెలుగు, ఆదిలాబాద్ జిల్లా)

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో (Adilabad) పలుచోట్ల వడగండ్ల వాన (windy rains) భీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షం (Heavy Rains) రైతులకు తీరని నష్టం కలిగించింది. అకాల వర్షం చేతికందిన పంట (Crop) దిగుబడులను నీటి పాలుచేసింది. ముఖ్యంగా జొన్న, మొక్కజొన్న, శనగ రైతులకు తీరని కష్టం మిగిల్చింది. జొన్నపంట నేలకొరిగిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలోని తాంసి, భీంపూర్, జైనథ్, ఇచ్చోడ, నార్నూర్ తదితర మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం (Heavy Rains) కురిసింది. అయితే ఇచ్చోడ మండల కేంద్రంలో కురిసిన వడగండ్ల వానతో (The hailstorm) శనగ పంట తడిసి పోయి రైతుల ఆశలు అడియాసలయ్యాయి. ఇచ్చోడ, గుడిహత్నూర్ మండలాలకు చెందిన రైతులు తాము పండించిన శనగ పంటను అమ్ముకోవడం కోసం ఇచ్చోడ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకువచ్చారు. అయితే ఒక్కసారిగా కురిసిన వర్షంతో తూకం వేయడానికి సిద్దంగా ఉంచిన శనగ సంచులు తడిసి ముద్దయ్యాయి.

శనగ రైతులకు కష్టాలు తప్పలేదు..

కొంతమంది రైతులు (farmers) అష్టకష్టాలు పడి శనగ కుప్పలపై పాలిథిన్ కవర్లు కప్పి కొంతవరకు తడవకుండా కాపాడుకోగలిగారు. ఈ అకాల వర్షానికి శనగ రైతులకు కష్టాలు తప్పలేదు. అటు తాంసి, భీంపూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం  (windy rains) కురిసింది. ఈ ఈదురు గాలులతో పలు గ్రామాల్లో రేకుల ఇళ్ళు దెబ్బతిన్నాయి. రైతులు పండించిన జొన్న, పెసర పంటలు కూడా దెబ్బతిన్నాయి. తాంసి మండల కేంద్రంలో శనగ పంటను అమ్ముకోవడానికి వచ్చిన రైతులు ఈ అకాల వర్షం వల్ల తీవ్ర ఇబ్బందులపాలయ్యారు.ః

ఈదురుగాలులకు ఎగిరి..

అటు భీంపూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనంపై ఉన్న రేకులు ఈదురుగాలులకు ఎగిరి కిందపడ్డాయి. ఆ సమయంలో పాఠశాలలో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. భీంపూర్ శివారులో ఉన్న జొన్న పంటకు తీవ్రం నష్టం కలిగింది.  ఇదిలా ఉంటే తలమడుగు మండలంలో నిన్న రాత్రి గాలులతో కురిసిన వర్షానికి రైతులు  సాగు చేసిన  రబీ పంటలైన మొక్కజొన్న, జొన్న పంట తదితర పంటలు  చేతికొచ్చే సమయానికి  నేలపై   పడిపోవడంతో  తీవ్ర స్థాయిలో నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తలమడుగు  మండలంలోని అర్లి (కె) గ్రామ రైతు  రబీ పంటగా  తొమ్మిది ఎకరాలలో  మొక్కజొన్న సాగు చేశానని, పంట వారం రోజులలో చేతికొచ్చే సమయానికి అకాల వర్షం రావడంతో పంట నేలకొరిగిందని, వాపోయాడు. రెండులక్షల యాభై వేల  రూపాయల పెట్టుబడి  సాగుకు వ్యయం అయిందని, సాగు వ్యయం కూడా మిగులుతుందో లేదోనని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రకృతి వైపరీత్యాలతో  ప్రతి సంవత్సరం  పంట చేతికొచ్చే సమయానికి నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశాడు.  వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలీంచి నష్ట పరిహారం ఇప్పించాలని కోరాడు.

అకాల వర్షం వల్ల జైనథ్ మండల కేంద్రంలోని మార్కెట్ కార్యాలయంలో ప్రభుత్వం రైతుల నుండి కొనుగోలు చేసిన శనగ ధాన్యం కొంతవరకు తడిసి ముద్దయింది. అరగంటసేపు భారీగా  ఈదురు గాలులతో వర్షం కురిసింది. దీంతో రైతులు పంట చేను లో ఉన్న జోన్న పంటతో పాటు మార్కెట్లో ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం కొంతవరకు తడిసి ముద్దయింది. అకాల వర్షంతో పంటల నష్ట పోయిన రైతులు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

First published:

Tags: Adilabad, Agriculture, Crops, Farmer, Rains