(పి. శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా, న్యూస్ 18 తెలుగు)
మనిషి జీవితంలో పెళ్లి అనేది మరపురాని సంఘటన. ఎన్నో మధురానుభూతులను పంచుతుంది. ఎంతో మంది చుట్టాలు, బంధువులు, స్నేహితులతో వివాహ వేడుక అంతా కన్నులపండుగగా జరుగుతుంది. కానీ కరోనా మహమ్మారి వల్ల ఆ ఆనందాలన్నీ దూరం అయ్యాయి. కేవలం 40 మంది అతిథుల సమక్షంలోనే వివాహాలను అనుమతి ఉండటంతో వివాహాలను సాదాసీదాగా చేసుకుంటున్నారు. మరికొంత మంది వాయిదా వేసుకుంటున్నారు. అయితే ఓ వ్యక్తి తన వివాహ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నాడు. అతి తక్కువ మంది సమక్షంలో పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు. పెళ్లి కుదిరిన దగ్గర నుంచి అన్నీ తానై పెళ్లి పనులకు చూసుకున్నాడు. అయితే కరోనా మహమ్మారి మాత్రం అతడిని వదిలి పెట్టలేదు. పెళ్లైన మూడు రోజులకు వరుడికి కరోనా వచ్చింది. తన కుటుంబసభ్యులకు కూడా మహమ్మారి సోకింది. అయితే వరుడుకు ఊపిరితీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. హైదరాబాద్ లో చికిత్స పొందుతూ ప్రాణం వదిలాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి.
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యమపూర్ గ్రామానికి చెందిన చింతకుంట కృష్ణంరాజు (26)కు ఈ మధ్యన వివాహం జరిగింది. పెళ్లి అయిన 3 రోజులకే కోవిడ్ లక్షణాలు కనిపించగా టెస్టు చేయించాడు. అతడికి టెస్టులో పాజిటివ్ గా రిపోర్టు వచ్చింది. అతడి కుటుంబసభ్యులకు కూడా టెస్టు చేయగా.. కోవిడ్ పాజిటివ్ గా తేలింది. రాజుకి శ్వాస తీసుకోవటం లో ఇబ్బందులు రాగానే ఆయనను ఆసుపత్రికి తరలించారు.
కాగా హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు.పెళ్లయ్యాక 13 రోజులకే మరణించటం కుటుంబం లో తీవ్ర విషాదం నింపింది. రాజు కుటుంబీకులకు కూడా కరోనా వచ్చిన వారికి వ్యాధి తీవ్రత అంతగా లేదు. ఏది ఏమైనా పెళ్ళైన 3 రోజులకే ఆసుపత్రి లో చేరి మరణించటం ఇంట్లోనూ అటు గ్రామంలోను తీవ్ర విషాదం నింపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona deaths, Corona deaths in karimnagar, Crime news, Telangana crime