ఇప్పటివరకు చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో (Government hospitals) డాక్టర్ మందులు (Medicines) రాశాక రోగులకు నిర్దేశిత రోజులకు అవసరమైనన్ని మందులు కాకుండా తక్కువ రోజులకు ఇస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana government) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు అవసరమైన మందులు అన్నింటినీ ఉచితంగా ఇవ్వాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. వ్యాధిని ఎలాగైనా పారద్రోలాలని ఆసుపత్రి నుంచి బయటకు వచ్చాక చాలామంది రోగులు ప్రైవేట్ మందుల దుకాణాల్లో మందులు (Medicines) కొనుగోలు చేస్తున్నారు. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అవసరమైనన్ని మందులను రోగులకు ఉచితంగానే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అందరికీ అవసరాన్ని బట్టి..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) మొదలు ఏరియా, సామాజిక, జిల్లా, బోధనాసుపత్రుల వరకు అన్ని చోట్లా దీన్ని అమలు చేస్తారు. వైద్యులు అక్కడుండే మందులనే రాసి రోగులు బయట కొనే పరిస్థితి లేకుండా చూడాల్సి ఉంటుంది. ఇక నుంచి ఆసుప్రతులకు వచ్చే ఇన్‌పేషెంట్లు, ఔట్ పేషెంట్లు అందరికీ నిర్ణీత కోర్సు మేరకు మెడిసిన్స్ ఇవ్వనున్నారు వైద్యులు.
గతంలో ఒక రోగికి నెల రోజులకు సరిపడా మందులు వాడాల్సి వస్తే ఆసుపత్రులలో కేవలం వారం లేదా పదిరోజులకు మాత్రమే ఇచ్చేవారు, ఇకపై నెల రోజులకూ మెడిసిన్లు ఇవ్వనుంది. తెలంగాణ ప్రభుత్వం మందుల కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ. 500 కోట్లు కేటాయించింది. ఆ నిధులు పూర్తిస్థాయిలో రోగులకు మందులు ఇచ్చేందుకు సరిపోనున్నాయి.
అత్యవసర మందులపై 2 నెలల కిందటే..
కాగా, గతంలోనే తెలంగాణ ప్రభుత్వం కొన్ని అత్యవసర మందులను కూడా ప్రభుత్వాసుపత్రులలోనే ఇచ్చేలా నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు (Government Hospitals) వచ్చే రోగులు బయట ప్రైవేటుగా మందులు (Medicines) కొనాల్సిన అవసరం రాకుండా.. అవసరమైన ఔషధాలన్నింటినీ అందుబాటులో ఉంచేందుకు సర్కారు ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు అత్యవసర, సాధారణ మందుల సంఖ్యను పెంచాలని.. కొత్తగా మరో 123 రకాల మందులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు 720 రకాల మందులను ఫ్రీగా ఇస్తోంది. ఇపుడు ఈ జాబితాను 843కు పెంచింది ప్రభుత్వం. ఇందులో అత్యవసర మందుల జాబితా (ఈఎంఎల్)లో 311, ఇతర సాధారణ (అడిషనల్) మందుల జాబితా (ఏఎఎల్)లో 532 మందులు ఉన్నాయి.
TSRTC: టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్.. రైతులకు నేరుగా ఎరువుల సరఫరా.. వివరాలివే
అయితే అత్యవసర జాబితాలోని మందులు (Medicines) కావాలంటే ఇప్పటివరకు ఇండెంట్ పెట్టాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు ఈ విధానాన్ని కూడా మార్చేసింది ప్రభుత్వం. అత్యవసర జాబితాలోని 311 మందులను ఇక మీద వినియోగం (Usage) ఆధారంగా సేకరించనున్నారు. ప్రతి ఆస్పత్రి కచ్చితంగా మూడు నెలలకు సరిపడా మందుల బఫర్ స్టాక్ సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Government hospital, Harish Rao, Medicine, Telangana Government