హోమ్ /వార్తలు /తెలంగాణ /

Traffic challan discount: వాహనదారులకు గుడ్​న్యూస్​.. ట్రాఫిక్​ చలాన్లపై డిస్కౌంట్​ ఆఫర్​ పొడిగింపు.. ఎప్పటివరకు అంటే..?

Traffic challan discount: వాహనదారులకు గుడ్​న్యూస్​.. ట్రాఫిక్​ చలాన్లపై డిస్కౌంట్​ ఆఫర్​ పొడిగింపు.. ఎప్పటివరకు అంటే..?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను చెల్లించుకునేందుకు పోలీసులు వాహనదారులకు డిస్కౌంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటం, క్లియర్ చేసుకోవాల్సిన చలాన్లు వుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇంకా చదవండి ...

  తెలంగాణ (Telangana)లో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను చెల్లించుకునేందుకు పోలీసులు వాహనదారులకు డిస్కౌంట్ (Traffic challan discount) ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీని గడువు మార్చి 31తో ముగియనుంది. అయితే ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుండటం, క్లియర్ చేసుకోవాల్సిన చలాన్లు వుండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ చలాన్లు చెల్లించుకునేందుకు గడువు పొడిగిస్తున్నట్లు (decided to extend the deadline) శుభవార్త చెప్పింది.

  రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (CM KCR) గారి ఆదేశాల మేరకు చలాన్లపై ఇచ్చిన రాయితీ గడువు మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నామని రాష్ట్ర హోం శాఖ మంత్రి (Home minister) మహ్మద్ మహమూద్ అలీ బుధవారం తెలిపారు.  ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల 40 లక్షల చలాన్లు చెల్లింపు జరిగిందని, వీటి విలువ 840 కోట్ల రూపాయలని ఆయన తెలియజేశారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇప్పటివరకు 250 కోట్ల రూపాయలు చెల్లించి పెండింగ్ చలానా (Pending Challans) క్లియర్ చేయడం జరిగిందనీ,  రాష్ట్ర వ్యాప్తంగా 52% మోటారు వాహన యజమానులు ఈ  అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారన్నారు.

  ఆర్థిక ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని..

  రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయానికి విశేష స్పందన రావడంతో పాటు ఈ అవకాశాన్ని పొడిగించాలని అనేక విజ్ఞప్తులు వచ్చాయని హోం మంత్రి అన్నారు.  ప్రజల వద్ద నుంచి వచ్చిన స్పందన, విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలించి మరో  పదిహేను రోజుల పాటు అనగా తేది 15-04-2022 వరకు పెండింగ్ చలానాలపై రాయితీ అవకాశాన్ని పొడిగించామని (Extended deadline to 15 days) ఆయన వివరించారు.  గత రెండు సంవత్సరాలుగా కరోనా వల్ల పేదలు, మధ్య తరగతి వారు ప్రజలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

  ఇంతవరకూ చలాన్లు చెల్లించలేక పోయినవారు ఈ రాయితీ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ-చలాన్ వెబ్సైట్ (E challan website) లో ఆన్లైన్ పేమెంట్ ద్వారా తమ చలాన్ క్లియర్ చేసుకోవాల్సిందిగా రాష్ట్ర హోం మంత్రి తెలిపారు.

  రాయితీ ఎలా ఉందంటే..?

  • టూవీలర్ / త్రీవీలర్- కట్టాల్సింది – 25%, మిగతా బ్యాలన్స్ 75% మాఫీ.

  •RTC డ్రైవర్స్ కట్టాల్సింది – 30%, మిగతా బ్యాలన్స్ 70% మాఫీ.

  •LMV/ HMV – కట్టాల్సింది – 50%, మిగతా బ్యాలవ్స్ 50% మాఫీ.

  •తోపుడు బండ్ల వ్యాపారులు కట్టాల్సింది – 20%, మిగతా బ్యాలన్స్ 80% మాఫీ.

  •నో మాస్క్ కేసులు- కట్టాల్సింది – Rs.100, మిగతా బ్యాలన్స్ Rs 900 మాఫీ.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Telangana, Traffic challans

  ఉత్తమ కథలు