హోమ్ /వార్తలు /తెలంగాణ /

ప్రేమ పేరుతో మోసం.. ప్రియుడు మొహం చాటేయడంతో ప్రియురాలు ఏం చేసిందంటే..

ప్రేమ పేరుతో మోసం.. ప్రియుడు మొహం చాటేయడంతో ప్రియురాలు ఏం చేసిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఒకే సామాజిక వర్గం కావడంతో ఇరు కుటుంబాల వారు పెళ్లికి అంగీకరించారు. ఏడాది క్రితం పెద్దల సమక్షంలో పెళ్లి బట్టలు సైతం మార్చుకున్నారు. కానీ కొన్ని రోజులుగా భాస్కర్ కనపడకపోవడంతో బుధవారం శారద ప్రియుడి ఇంటికి వెళ్లింది

ఓ యువకుడు యువతిని ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకుంటానన్నాడు. కానీ చివరకు ప్రియుడు మొహం చాటేయడంతో యువతి రంగంలోకి దిగింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏలా మోసం చేస్తావంటూ ప్రియుడి ఇంటి ఎదుట యువతి ఆందోళనకు దిగింది. ఈ ఘటన శుక్రవారం మెదక్ జిల్లా నంగునూరులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా నంగునూరు గ్రామానికి చెందిన కొడముంజ భాస్కర్, అదే గ్రామానికి చెందిన దేవులపల్లి శారద రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరు ఒకే సామాజిక వర్గం కావడంతో ఇరు కుటుంబాల వారు పెళ్లికి అంగీకరించారు. ఏడాది క్రితం పెద్దల సమక్షంలో పెళ్లి బట్టలు సైతం మార్చుకున్నారు. కానీ కొన్ని రోజులుగా భాస్కర్ కనపడకపోవడంతో బుధవారం శారద ప్రియుడి ఇంటికి వెళ్లింది.

భాస్కర్ లేడని తెలియడంతో తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇంటి ఎదుట కూర్చొని ఆందోళన చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చేంత వరకు కదిలేది లేదని భీష్మించుకుని కూర్చుంది. ఇది గమనించిన ప్రియుడి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు.

First published:

Tags: Love cheating, Medak, Telangana

ఉత్తమ కథలు