కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్ సమయంలో విపత్కర పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆ ప్రభావం పలు పండుగలపైనా పడింది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఎత్తు తగ్గిస్తారన్న ఊహగానాలు షికార్లు చేస్తున్నాయి. ఈ సంవత్సరం గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ భాగ్యనగర ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి భగవంతరావు స్పందించారు. హైదరాబాద్లో ప్రతి సంవత్సరం మాదిరిగినే ఈ ఏడాది గణేష్ ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహం విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు తీరును భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. రంజాన్ విషయంలో లేని ఆంక్షలు, గణేష్ ఉత్సవాల విషయంలో ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. గణేష్ఉత్సవాలను ఎవరు నిర్వహించొద్దరనే విషయాన్ని పోలీసులు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఖైరతాబాద్ గణేష్ విషయంలో పోలీసుల బెదిరింపులు సరికాదని, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే గణేష్ ఉత్సవాలు జరుగుతాయని వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Khairatabad ganesh, Telangana