అశ్రునయనాల మధ్య ముగిసిన సంతోష్ బాబు అంత్యక్రియలు..

కల్నల్ సంతోష్ బాబు

అంతకుముందు చివరిసారిగా సంతోష్ బాబుకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. కోవిడ్ నేపథ్యంలో అతి తక్కువ మందికి మాత్రమే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అధికారులు అనుమతిచ్చారు.

  • Share this:
    సూర్యాపేటలో కేసారంలో అశ్రునయనాల మధ్య కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు ముగిశాయి. సంతోష్ బాబు వ్యవసాయ క్షేత్రంలో అధికారిక సైనిక లాంఛానాలతో అంత్యక్రియలు చేశారు. సంతోష్ బాబు పార్థివదేహాన్ని ఆర్మీ అధికారులు చితివద్దకు తీసుకొచ్చారు. వీరజవాను సంతోష్ బాబుకు నివాళిగా జవాన్లు గాలిలోకి మూడుసార్లు తూటాలు పేల్చి గౌరవ వందనం సమర్పించారు. సంతోష్ బాబు సతీమణి, కుమారుడు, బంధువులు, ప్రజలు సెల్యూట్ చేశారు. కొడుకు సంతోష్ బాబు చితికి ఆయన తండ్రి ఉపేందర్ నిప్పు పెట్టడంతో అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియల్లో 16 బిహార్ రెజిమెంట్ బృందం పాల్గొంది. అంతకుముందు చివరిసారిగా సంతోష్ బాబుకు కన్నీటి వీడ్కోలు పలికేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు.

    కోవిడ్ నేపథ్యంలో అతి తక్కువ మందికి మాత్రమే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అధికారులు అనుమతిచ్చారు. ప్రజలు కన్నల్ సంతోష్ బాబు పార్ధీవ దేహానికి అడుగడుగునా పూలతో నీరాజనం పలికారు. సూర్యాపేటలోని విద్యానగర్ నుంచి కేసారంలోని కల్నల్ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియల చివరి ఘట్టానికి భారీ బందోబస్తు మధ్య పార్ధీవ దేహం తరలించారు. ఆరు కిలోమీటర్ల మేర పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజలు దారి పొడవునా పూలు జల్లుతూ అడుగడునా అశ్రు నివాళ్లర్పించారు.
    Published by:Narsimha Badhini
    First published: