Home /News /telangana /

THE FOOD CORPORATION OF INDIA IS CONDUCTING SURPRISE INSPECTIONS AT RICE MILLS IN TELANGANA FOLLOWING A COMPLAINT THAT RICE WAS MISSING PRV

FCI Checks rice missing: తెలంగాణలోని రైస్​ మిల్లుల్లో బియ్యం మాయంపై ఎఫ్​సీఐ తనిఖీలు.. టీఆర్ఎస్​ సర్కారుపై పైచేయి దిశగా బీజేపీ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అధికారులు తెలంగాణలోని ముడి బియ్యం మిల్లులపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రాష్ట్రంలోని 40 రైస్‌ మిల్లుల్లో 4,53,896 బస్తాల బియ్యం మాయమయ్యాయని, దీనిపై వివరణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది.

ఇంకా చదవండి ...
    వరి ధాన్యం (Paddy) కొనుగోలు విషయమై బీజేపీ(BJP), టీఆర్ఎస్ (TRS) లు రాజకీయంగా పై చేయి సాధించేందుకు ప్రయత్నాలు చేశాయి. అయితే ఈ తరుణంలో కేంద్రం నుండి సానుకూలంగా స్పందన రాకపోవడంతో వరి ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఈ తరుణంలో రైస్ మిల్లుల్లో బియ్యం తక్కువగా ఉన్న విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan reddy) మీడియా సమావేశంలో ప్రకటించారు. దీంతో మరో వివాదం మొదలైంది.

    కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అధికారులు తెలంగాణ (Telangana)లోని ముడి బియ్యం మిల్లులపై ఆకస్మిక తనిఖీలు (Checks) చేపట్టారు. రాష్ట్రంలోని 40 రైస్‌ మిల్లుల్లో 4,53,896 బస్తాల బియ్యం మాయమయ్యాయని, దీనిపై వివరణ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్రంలో మిస్సింగ్ రైస్ సమస్య ఎంతగా ఉందో తెలుసుకునేందుకు తెలంగాణలో మిగిలిపోయిన 2,430 ముడి రైస్ మిల్లులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఎఫ్‌సీఐ (FCI) అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని రైస్ మిల్లుల (Rice mills)పై తనిఖీలు (Checkings) చేస్తున్నారు. కాగా, ఈ విషయంపై బీజేపీ చాలారోజులుగా టీఆర్​ఎస్​ ప్రభుత్వాన్నివివరణ కోరుతోంది. అయినా అధికార పార్టీ స్పందించలేదు. దీంతో ఏకంగా ఎఫ్​సీఐ రంగంలోకి దిగడంతో ఇది టీఆర్​ఎస్​ సర్కారుకు కొంత ఇబ్బంది పెట్టేదే.

    కిషన్​ రెడ్డి ఫిర్యాదుతో..

    తెలంగాణలో రైస్​ మిల్లుల్లో స్టాక్​ తదితరాలను తనిఖీ చేయాలని ఎఫ్​సీఐని ఆదేశించామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంతకుముందే చెప్పారు.  రైస్​ మిల్స్​ ఏ మేరకురైస్​ ఉండాలో ఆ మేరకు బియ్యం ఉండటం లేదన్నారు. అయితే ఈ విషయమై ఎఫ్ సీ ఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారని చెప్పారు. 4లక్షల53వేల 896 బియ్యం బ్యాగులు తక్కువగా ఉన్నాయని ఎఫ్ సీ ఐ అధికారులు గుర్తించారన్నారు. కేవలం 40 రైస్ మిల్లుల్లోనే తనిఖీలు చేస్తే ఈ విషయం వెలుగు చూపిందన్నారు. దీంతో రైస్ మిల్లులను తనిఖీ చేయాలని ఆదేశించామన్నారు.

    రైస్ మిల్లుల్లో ఉండాల్సిన బియ్యం ఎక్కడికి వెళ్లిందని ఆయన ప్రశ్నించారు.ఈ విషయమై ఆరా తీస్తామన్నారు. రైస్ మిల్లులకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మాత్రమే ఒప్పందం ఉంటుందన్నారు. అయితే రైస్ మిల్లుల్లో బియ్యం ఎక్కడికి వెళ్లిందనే విషయమై అధికారులు ఆరా తీస్తారని కేంద్ర మంత్రి ప్రకటించారు. రైస్ మిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకొందో చెప్పాలని ఆయన కోరారు. ఈ విషయమై గతంలోనే ఓ పార్టీ నేత సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ తనకు లేఖ రాశారని పరోక్షంగా టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి లేఖను కిషన్ రెడ్డి ప్రస్తావించారు.

    ఈ ఏడాది మార్చి 31న కొన్ని రైస్ మిల్లుల్లో తనిఖీ చేసి బియ్యం బస్తాలు తక్కువగా ఉన్న విషయమై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామన్నారు. రైస్ మిల్లుల్లో బియ్యం తక్కుగా ఉన్న విషయమై చర్యలు తీసుకోవాలని లేఖ రాశామన్నారు. ఈ విషయమై రైస్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని కూడా కోరామన్నారు. రైస్ మిల్లులపై ఏం చర్యలు తీసుకొన్నారో చెప్పాలని కూడా కోరామన్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Bjp, Kishan Reddy, Rice, Telangana, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు