చెన్నై గిండి స్నేక్ పార్కుకు ధీటుగా తొలిసారిగా తెలంగాణలో పాముల పార్కు..

రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రంలో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా పట్టుకున్న సర్పాల సంరక్షణ, అలాగే వివిధ రకాల సర్పాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇది ఎంతగానో ఉయోగపడుతుంది.

news18-telugu
Updated: June 5, 2020, 3:05 PM IST
చెన్నై గిండి స్నేక్ పార్కుకు ధీటుగా తొలిసారిగా తెలంగాణలో పాముల పార్కు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చెన్నై గిండి స్నేక్ పార్కు.. ప్రపంచంలోనే అత్యుత్తమ పాముల పార్కుల్లో ఇది ఒకటి. ఇండియాలోనే మొదటి పాముల పార్కుగా దీనికి పేరు ఉంది. దీన్ని చూసేందుకు పర్యాటకులు ఎక్కువ సందర్శిస్తుంటారు. అయితే దీనికి ధీటుగా ప్రస్తుతం తెలంగాణలో తొలిసారిగా పాముల పార్కును ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పరిధిలోని బౌరంపేట రిజర్వు ఫారెస్టులో రూ.1.40కోట్ల వ్యయంతో పాముల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈ పార్కును ఈ రోజు ప్రారంభించారు. జీవవైవిధ్యాన్ని పెంపొందించడంలో భాగంగా చెన్నైలోని గిండి స్నేక్ పార్క్ కు ధీటుగా స‌ర్పాల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రంలో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా పట్టుకున్న సర్పాల సంరక్షణ, అలాగే వివిధ రకాల సర్పాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇది ఎంతగానో ఉయోగపడుతుంది. ఎవరైకైనా పాములు కనిపిస్తే, వాటికి హాని తలపెట్టకుండా ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ (రెస్క్యూ టీం) వారికి సమాచారం ఇవ్వాల్సి ఉంది.

Published by: Narsimha Badhini
First published: June 5, 2020, 2:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading