Home /News /telangana /

THE FIRST KG TO PG INSTITUTE IN TELANGANA IS LOCATED IN RAJANNA SIRICILLA DISTRICT FULL DETAILS HERE PRV

KG to PG Institute: వావ్​..అదిరిపోయిందిగా.. తెలంగాణలో తొలి KG to PG విద్యాలయం ఇదే..

కేజీ టూ పీజీ భవన ప్రాంగణం, కేసీఆర్​ (ఫైల్​)

కేజీ టూ పీజీ భవన ప్రాంగణం, కేసీఆర్​ (ఫైల్​)

తెలంగాణలో మరో అద్భుత ఘట్టానికి తెరలేనుంది. సీఎం కేసీఆర్‌ (CM KCR) ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో కేజీ టూ పీజీ (KG To PG) విద్య ఒకటి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్​ఎస్​ ప్రభుత్వం (TRS Govt) విద్యా రంగానికి ప్రాధాన్యత పెంచింది. కేజీ నుంచి పీజీ (KG to PG) వరకు ఉచిత నిర్భంధ విద్య అమలు చేస్తామని ఉద్యమ సమయంలోనూ, ఎన్నికల మానిఫెస్టోల్లోనూ ఈ ప్రస్తావన ప్రధానంగా తీసుకువచ్చింది. అయితే.. విద్యారంగంలో ప్రభుత్వం ఎంతో అభివృద్ధి సాధించిందని పాలకులు చెబుతూ వస్తున్నారు.  నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేసి, గ్రామ స్థాయిలో అంగన్ వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసినంత మాత్రాన ఉచిత విద్య అయిపోతుందా అనే వాదనలూ ప్రతిపక్షాల నుంచి బలంగా ఉన్నాయి. అయితే.. ప్రభుత్వం (Telangana Government) మాత్రం ఇది దశల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమమని... ఇది నిరంతరంగా సాగుతుందని చెబుతోంది.

    తాజాగా తెలంగాణలో (Telangana) మరో అద్భుత ఘట్టానికి తెరలేనుంది. సీఎం కేసీఆర్‌ (CM KCR) ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో కేజీ టు పీజీ (KG To PG) విద్య ఒకటి. అయితే.. మొట్టమొదటి కేజీ టు పీజీ ఉచిత విద్యాలయ (Building) భవనం నిర్మాణం పూర్తి అయ్యింది. దీనికి సంబంధించిన చిత్రాలు బయటికొచ్చాయి. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా ఆవిర్భ‌వించాక తొలి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్‌ (TRS)… రాష్ట్ర విద్యా వ్య‌వ‌స్థ‌లో నూత‌న విధానాల‌ను అమ‌లు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగానే కేజీ (కిండ‌ర్ గార్టెన్‌) టు పీజీ (పోస్ట్ గ్రాడ్యుయేష‌న్‌) దాకా ఒకే చోట పూర్తి చేసుకునేలా విద్యార్థుల‌కు నూత‌న విద్యాల‌యాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఆ ప్ర‌క‌ట‌న‌కు అనుగుణంగానే తొలి కేజీ to పీజీ కాలేజీని తెలంగాణ స‌ర్కారు నిర్మించింది.



    రాజ‌న్న సిరిసిల్ల జిల్లా (Rajanna siricilla) ప‌రిధిలోని గంభీరావుపేట‌లో తొలి కేజీ టు పీజీ విద్యాల‌యాన్ని నెల‌కొల్ప‌నున్న‌ట్లు కేసీఆర్  (KCr) ప్రభుత్వం గతంలో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌క‌ట‌న‌కు అనుగుణంగానే ప్ర‌స్తుతం గంభీరావుపేట‌లో తొలి కేజీ టు పీజీ విద్యాల‌యాన్ని పూర్తి చేసింది టీఆర్​ఎస్​ సర్కారు. ఈ విద్యాల‌యంలోని వ‌సతులు, భ‌వ‌న నిర్మాణం త‌దిత‌రాల‌ను వెల్ల‌డిస్తూ తెలంగాణ రెనూవ‌బుల్ ఎన‌ర్జీ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ స‌తీశ్‌ రెడ్డి గురువారం తన ట్విటర్​లో ఓ పోస్టు పెట్టారు.



    కాగా, ప్రగతి భవన్‌లో నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం (Telangana Cabinet) జరిగింది. సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఆసరా పెన్షన్లు, నిధుల సమీకరణ, యూనివర్సిటీ చట్ట సవరణ బిల్లు ముసాయిదా సహా పలు అంశాలపై చర్చించారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: EDUCATION, Post graduates, Siricilla, Students, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు