తెలంగాణలోని నాంపల్లి నుమాయిష్ (Numaish)పై ఎగ్జిబిషన్ సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుమాయిష్ రద్దు చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ఈనెల 1వ తేదీన గవర్నర్ నుమాయిష్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. కరోనా వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో మొదట ఈ నెల 2న పది రోజుల పాటు మూసివేస్తున్నట్లు (Exhibition closed) పేర్కొంది. ఇప్పటికే నుమాయిష్‌లోకి ప్రజల సందర్శనను నిర్వాహకులు నిలిపివేశారు.. తాజాగా కరోనా, ఒమిక్రాన్ తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండటంతో ఈ ఏడాది నుమాయిష్ నిర్వహించకూడదని (Exhibition cancelled) నిర్ణయం తీసుకున్నట్లు సొసైటీ (Society) ప్రకటించింది. కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఈ సంవత్సరం నుమాయిష్ (Numaish)ను రద్దు చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎగ్జిబిషన్ సొసైటీకి నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సొసైటీకి నుమాయిస్ మూసివేయాలని సూచించారు.
జనవరి 1న ప్రారంభమై ఫిబ్రవరి 15 వరకు..
ఎగ్జిబిషన్ ప్రతి ఏడాది జనవరి 1న ప్రారంభమై ఫిబ్రవరి 15 వరకు సాగుతుంది . దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు ఇక్కడ స్టాల్స్ (Stalls) ఏర్పాటు చేసుకొని తమ వస్తువులను అమ్ముతుంటారు. ఇక నుమాయిష్‌కు ప్రతి రోజు వేల సంఖ్యలో వస్తుంటారు. ఈ 45 రోజుల్లో దాదాపు 15 లక్షల మంది నుమాయిష్‌ను సందర్శించే అవకాశం ఉంది. ఈక్రమంలో రద్దీ ఎక్కువగా ఉండటం కారణంగా ఇక్కడ ఎన్ని ఆంక్షలు పెట్టినా కరోనా కట్టడి సాధ్యం కాదని భావించిన అధికారులు, ఎగ్జిబిషన్ సొసైటీ నుమాయిష్‌ను రద్దు చేసింది.
వస్తువులను ప్రోత్సహించే కార్యక్రమం..
2021వ సంవత్సరం కూడా ఎగ్జిబిషన్ (Exibition)ను కరోనా నిబంధనలతో పూర్తిగా మూసివేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎగ్జిబిషన్‌ను మూసివేస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది. 1938లో స్థానికంగా ఉత్పత్తి చేయబడిన వస్తువులను ప్రోత్సహించే కార్యక్రమంగా నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. కేవలం 50 స్టాల్స్‌తో ప్రారంభించి, దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనలలో ఒకటిగా రూపుదిద్దుకుంది. హైదరాబాద్ స్టేట్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మొదటి నుమాయిష్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత క్రమంగా నుమాయిష్ ఎగ్జిబిషన్ కు ప్రజాదరణ విపరీతంగా పెరిగింది. స్థానిక పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, హోటళ్లు, ఫుడ్ కోర్ట్లతో పాటు భారతదేశం అంతటా ఉన్న వ్యాపారులు నుమాయిష్ ఎగ్జిబిషన్ లో స్టాల్స్‌ను ఏర్పాటు చేసుకుంటారు .
వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖలు అలాగే ప్రభుత్వరంగ సంస్థలు ప్రజలకు చేరువయ్యేందుకు కూడా ఎగ్జిబిషన్ ను ఒక వేదికగా ఉపయోగిస్తాయి. 1949లో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌గా దీనికి పేరు మార్చడం జరిగింది. దీనిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా సి. రాజగోపాలాచారి ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు విశేషమైన ఆదరణ పొందుతూ నుమాయిష్ ఎగ్జిబిషన్ కొనసాగుతోంది. కానీ కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లుగా నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు అవాంతరాలు కలుగుతూనే ఉన్నాయి.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.