Prepaid Meters: విద్యుత్ వాడుకోవాలంటే.. ఇక నుంచి రీచార్జ్ చేసుకోవాల్సిందే..! ఆ దిశగా అడులేస్తున్న సర్కార్..

ప్రతీకాత్మక చిత్రం (Image : Youtube)

ఇప్పటివరకు కరెంట్ వాడుకున్న తర్వాత బిల్లు ఎంత వచ్చిందో అంత కట్టేసేవాళ్లం. అంటే ఒక మాటలో చెప్పాలంటే.. పోస్ట్ పెయిడ్ అన్నటమాట. అయితే ఇక నుంచి అలా ఉండదు.. ముందుగానే డబ్బులు చెల్లించి కరెంట్ ను వాడుకోవాల్సి ఉంటుంది. ప్రీపెయిట్ మీటర్లను అమర్చే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 • Share this:
  తెలంగాణలో(Telangana) విద్యుత్ స్మార్ట్ మీటర్ల(Smart Meters) అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇంటింటికీ ప్రీపెయిడ్‌ కరెంట్‌ మీటర్లు బిగించేందుకు విద్యుత్‌ శాఖ సన్నద్ధమవుతోంది. సెల్‌ఫోన్‌ రీచార్జుల తరహాలో విద్యుత్‌ కోసం ముందే డబ్బులు చెల్లించి రీచార్జి చేసుకునే విధానం అమల్లోకి రానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతోపాటు.. కొత్తగా ఇచ్చే అన్ని విద్యుత్‌ కనెక్షన్లకు ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లను బిగించనున్నారు. ఇందుకు అయ్యే వ్యయంపై ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఫ్రీ పెయిడ్‌ కరెంట్‌ మీటర్లును సెల్‌ఫోన్లు, డీటీహెచ్‌ మాదిరిగా ఆన్‌లైన్‌లో రీచార్జ్‌ చేసుకునేలా రూపొందించారు. ముందుగా ప్రీపెయిడ్‌ కార్డు తీసుకోవాలి. దానిని మీటర్లో అమర్చితే విద్యుత్‌ సరఫరా అవుతుంది.

  Realme Wireless Charger: రియల్‌మీ నుంచి రానున్న వైర్‌లెస్ ఛార్జర్.. అద్బుత ఫీచర్లు.. వివరాలు తెలుసుకోండి..


  బ్యాలెన్స్‌ ఎంత ఉందో ముందుగానే తెలుసుకుని రీచార్జ్‌ చేయించుకుంటే ఇబ్బంది ఉండదు. లేకపోతే విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుంది. విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు ఆర్థికంగా భారమని భావిస్తున్న సర్కార్‌.. దీనికి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారం కోరుతోంది. కేంద్ర ప్రభుత్వం 15 శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 50 నుంచి 60 శాతం ఇవ్వాలని కోరుతోంది.  కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ రంగంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా స్మార్ట్‌ మీటర్లను తీసుకొస్తోంది. వాటితో విద్యుత్‌ ప్రసార, పంపిణీ, వాణిజ్య నష్టాలు తగ్గుతాయని భావిస్తోంది. ఇప్పటివరకు మనం వాడుకున్న కరెంట్‌కు బిల్లు కడుతున్నాం.

  Minister KTR: మరోసారి ట్విట్టర్ లో పొరపాటు పోస్టు చేసిన మంత్రి కేటీఆర్..! అదేంటంటే..


  చెల్లించడంతో కొంత జాప్యం జరిగినా కరెంట్‌ సరఫరా నిలిచిపోదు. స్మార్ట్‌ మీటర్లు వచ్చిన తర్వాత ముందుగానే డబ్బు కట్టి విద్యుత్‌ వాడుకోవాల్సి ఉంటుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రీపెయిడ్‌ మీటర్లు బిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ముందుగా హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 28 వేల 800 స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా నష్టాల్లో ఉన్న డిస్కంలను ఆర్థికంగా పునర్వ్యవస్థీకరించేందుకు కేంద్రం ఇటీవల కొత్త పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

  ‘సాంకేతిక, వాణిజ్యపర విద్యుత్‌ నష్టాలు (ఏటీఅండ్‌సీ)’ 15 శాతం కన్నా ఎక్కువ ఉన్న విద్యుత్‌ డివిజన్లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పారిశ్రామిక, వాణిజ్య కేటగిరీల వినియోగదారులు అందరికీ 2023 డిసెంబర్‌ నాటికి ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు బిగించాలని కేంద్రం నిర్దేశించింది. గడువులోగా స్మార్ట్‌ మీటర్లు బిగిస్తే.. వాటి వ్యయంలో 15 శాతాన్ని ప్రోత్సాహకంగా ఇస్తామని పేర్కొంది. గడువులోగా మీటర్ల ఏర్పాటు పూర్తికాకుంటే ప్రోత్సాహకాన్ని చెల్లించబోమని స్పష్టం చేశారు. ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయాలని డిస్కంలను ఆదేశిస్తూ వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని ఈఆర్సీలకు అంతకముందే విద్యుత్‌ మంత్రి ఆర్‌కే సింగ్‌ సూచించారు.

  Crime News: కిటికీ అద్దం పగలకొట్టారు.. దానికి కారణం ఎవరనే తేల్చుకునే పనిలో ఇలా జరిగింది..


  2025 మార్చిలోగా వ్యవసాయ రంగం మినహా అన్నింటికీ ప్రీపెయిడ్‌ మీటర్లు అమర్చాలని నిర్ణయించింది. స్మార్ట్‌ మీటర్ల కొనుగోలుకు అయ్యే వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. మరోవైపు స్మార్ట్‌ మీటర్లతో పెద్దగా ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు బిగించిన స్మార్ట్‌ మీటర్ల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని అధికారులు చెబుతున్నారు. అయితే సమయానికి ప్రీపెయిడ్ కార్డులో డబ్బులు లేకపోతే సామాన్యుడు చీకట్లో మగ్గాల్సిన పరిస్థితి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
  Published by:Veera Babu
  First published: