యజమానిని పాముకాటు నుంచి కాపాడిన కుక్క.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

స్నూపి(కుక్క) పాముపై దూకి నడుము భాగంలో నోటితో గట్టిగా పట్టుకుంది. దీంతో పాము స్నూపిని కాటేసింది. అయినా అది లెక్కచేయకుండా పామును బయటకు లాక్కొచ్చింది.

news18-telugu
Updated: April 12, 2020, 8:31 PM IST
యజమానిని పాముకాటు నుంచి కాపాడిన కుక్క.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
చనిపోయిన స్నూపీ వద్ద కన్నీరు పెట్టుకుంటున్న కుటుంబసభ్యులు
  • Share this:
తన యజమానిని కరిచేందుకు ప్రయత్నించిన పామును కుక్క నోట కరిచింది. యజమాని ప్రాణాలను రక్షించి.. పాము కాటేయడంతో కుక్క మరణించిన అరుదైన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో కిషోర్ ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నా సమయంలో వెనుక గదిలో నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో గదిలోకి తాచుపాము వెనుక పైపు నుంచి ఇంట్లోకి ప్రవేశించింది. దీన్ని గమనించిన స్నూపీ(కుక్క) పరుగున ఇంట్లోకి వెళ్లి తాచుపాముపై దాడి చేసింది. వెంటనే లేచిన కిషోర్ కర్రతో పామును కొట్టబోయాడు. తాచుపాము కిషోర్‌పైకి తిరగబడింది.

స్నూపి(కుక్క) పాముపై దూకి నడుము భాగంలో నోటితో గట్టిగా పట్టుకుంది. దీంతో పాము స్నూపిని కాటేసింది. అయినా అది లెక్కచేయకుండా పామును బయటకు లాక్కొచ్చింది. కిషోర్ కర్రతో పామును చంపి స్నూపిని ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలో మరణించింది. ఎంతో ప్రేమతో పెంచుకున్న కుక్క ప్రాణాలకు తెగించి కాపాడిందని, కానీ చివరకు కుక్క దక్కకుండా పోయిందని కుటుంబమంతా శోకసంద్రంలో మునిగారు.
First published: April 12, 2020, 8:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading