హోమ్ /వార్తలు /తెలంగాణ /

AP and Telangana Issues: ఎవరి వాదనా వారిదే.. రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కొలిక్కిరాని పంచాయితీ.. 

AP and Telangana Issues: ఎవరి వాదనా వారిదే.. రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కొలిక్కిరాని పంచాయితీ.. 

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలపై పంచాయితీ ఓ కొలిక్కి రాలేదు. ఈ అంశంపై కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ ఆశీష్​ కుమార్​ నేతృత్వంలోని సబ్‌-కమిటీ నిర్వహించిన వర్చువల్‌ భేటీలో.. ఇరు రాష్ట్రాల అధికారులు ఎవరి వాదనను వారు వినిపించారు.

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలపై పంచాయితీ ఓ కొలిక్కి రాలేదు. ఈ అంశంపై కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ ఆశీష్​ కుమార్​ నేతృత్వంలోని సబ్‌-కమిటీ నిర్వహించిన వర్చువల్‌ భేటీలో.. ఇరు రాష్ట్రాల అధికారులు ఎవరి వాదనను వారు వినిపించారు.

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యలపై పంచాయితీ ఓ కొలిక్కి రాలేదు. ఈ అంశంపై కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ ఆశీష్​ కుమార్​ నేతృత్వంలోని సబ్‌-కమిటీ నిర్వహించిన వర్చువల్‌ భేటీలో.. ఇరు రాష్ట్రాల అధికారులు ఎవరి వాదనను వారు వినిపించారు.

ఇంకా చదవండి ...

  తెలుగు రాష్ట్రాల (Telugu States) మధ్య నెలకొన్న విభజన సమస్యలపై (AP and Telangana Issues) పంచాయితీ ఓ కొలిక్కి రాలేదు. ఈ అంశంపై కేంద్ర హోంశాఖ జాయింట్‌ సెక్రటరీ ఆశీష్​ కుమార్​ నేతృత్వంలోని సబ్‌-కమిటీ (Sub committee) నిర్వహించిన వర్చువల్‌ భేటీలో.. ఇరు రాష్ట్రాల అధికారులు ఎవరి వాదనను వారు వినిపించారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ , రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్తు బకాయిలు (Electricity arrears), పన్ను బకాయిల సర్దుబాటు, బ్యాంకు డిపాజిట్లు, రెండు రాష్ట్రాల పౌరసరఫరాల సంస్థల క్యాష్‌ క్రెడిట్లు అనే ఐదు అంశాల ఎజెండాతో ఈ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు.. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆశిష్ కుమార్‌ గురువారం ఉదయం 11 గంటల నుంచి 12.30 దాకా వర్చువల్‌ సమావేశాన్ని నిర్వహించారు.

  అది ఉమ్మడి ఆస్తి కాదంటూ..

  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక సంస్థ ఆస్తుల విభజనపై రెండు రాష్ట్రాలు (Two states) ఎవరి వాదన వారికే కట్టుబడ్డాయి. ఈ సంస్థకు 270 ఎకరాల భూమి ఉంది. విభజన చట్టం ప్రకారం ఈక్విటీ జనాభా ప్రాతిపదికన ఇరు రాష్ట్రాలకు చెందాలని ఏపీ వాదన. కానీ తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అది నిబంధనల ప్రకారమే స్వాధీనం చేసుకున్నామని ఉమ్మడి ఆస్తి కాదని తెలంగాణ (Telangana) వాదిస్తోంది. ఈ అంశంలో ఏదీ తేలలేదు. ఇక కరెంట్ బకాయిల అంశం సుదీర్ఘంగా రెండు రాష్ట్రాల మధ్య ఉంది. విభజన చట్టం ప్రకారం ఏపీ 2014 జూన్‌ 2 నుంచి 2017 జూన్‌ 10 వరకు 8,890 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అందచేసింది. దీనికి సంబంధించి ఏపీకి రూ.6,284 కోట్లను తెలంగాణ చెల్లించాల్సి ఉంది. అయితే ఏపీనే తిరిగివ్వాలని తెలంగాణ వాదించింది. దీనిపై ఏకాభిప్రాయం రాలేదు.

  నగదు, ఫిక్స్​డ్ డిపాజిట్లపై స్పష్టత..

  రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చెల్లింపులు కావాల్సిన నగదు, ఫిక్స్​డ్ డిపాజిట్లపై ఈ మీటింగ్​లో స్పష్టత వచ్చింది. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ విషయంలో ఏపీ నుంచి రావాల్సిన రూ.495.21 కోట్లు చెల్లించేందుకు ఏపీ అంగీకరించింది. వీటితో పాటు మొన్నటి వరకు ఉమ్మడి సంస్థలైన రాజ్​భవన్, హైకోర్టు ఇతరత్రా వాటికి సంబంధించిన ఖర్చులు రూ.315.76 కోట్లు ఇస్తామని స్పష్టం చేసింది. బిల్డింగ్, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు (బీఓసీడబ్ల్యూడబ్ల్యూ బీ), లేబర్ వెల్ఫేర్ బోర్డ్ ఫండ్ రూ.464.39 కోట్లు, నెట్ క్రెడిట్ క్యారీ ఫార్వర్డ్ రూ.208.24 కోట్ల ఇంకా రావాల్సి ఉందని తెలంగాణ పేర్కొంది. మిగిలిన వివరాలు పంపాలని కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీకి తెలంగాణకు సూచించినట్లు స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు గురువారం రిలీజ్​ చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో ఏపీకి చెందిన పలు కంపెనీలు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాయి. పన్నులు కూడా హైదరాబాద్‌లోనే చెల్లించాయి. ఆ విధంగా ఏపీకి చెందిన సంస్థలు చెల్లించిన పన్నులు రూ.3,800 కోట్లు వరకు ఉంటాయి. ఈ మొత్తాన్ని ఇప్పించాలని ఏపీ ప్రభుత్వం కోరింది. అలా ఇవ్వాల్సిన పని లేదని తెలంగాణ స్పష్టం చేసింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి విడుదలైన నిధుల్లో తమ వాటా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఆ నిధులను ఇప్పించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. అయితే తెలంగాణ నిధులు తమకు ఎలా వస్తాయని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రశ్నించింది.

  First published:

  Tags: AP Telangana border, AP Telangana Water Fight

  ఉత్తమ కథలు