THE DAUGHTER OF MINISTER SRINIVAS GOWD CAME FORWARD WITH THE SREEHITA CHARITABLE TRUST TO STAND UP FOR THE CORONA VICTIMS VB MBNR
Charitable Trust: కోవిడ్ బాధితులకు అండగా.. చారిటబుల్ ట్రస్ట్.. సహాయం కోసం ఇలా చేయండి..
చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీహిత
Charitable Trust: కరోనా కారణంగా ఎంతోమంది పేదలు తిండి లేక అలమటిస్తున్నారు. మరో వైపు కరోనా బారిన పడిన వారి పరిస్థితి దారుణంగా తయారైంది. ఇంట్లో వండుకోలేక, తెచ్చేవారు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. వారి కోసమే శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అండగా ఉంటోంది.
(సయ్యద్ రఫీ, మహబూబ్ నగర్ జిల్లా, న్యూస్ 18 తెలుగు)
కరోనా బారిన పడిన వారు చాలా మంది హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. వారు నిత్యావసర సరుకులు తెచ్చుకోలేక .. వంట చేసేవారు లేక భోజనం చేయలేని పరిస్థితి కొందరిదైతే, వృద్ధులు, ఎలాంటి ఆధారం లేని వారు, ఇంట్లో తల్లిదండ్రులకు కరోనా వస్తే వంట చేసుకోలేని పిల్లలు ఇలా కోవిడ్ సమయంలో భోజనం లేక ఇబ్బంది పడేవారికి సకాలంలో భోజనం అందించాలని, అది ఫోన్ చేస్తే చాలు ఇంటికె వచ్చి రెండు పూటల భోజనం పెట్టేలా శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ముందుకొచ్చింది. ఇదే విషయాన్ని ట్రస్ట్ చైర్మన్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ కూతురు శ్రీహిత సోమవారం వెల్లడించింది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆమె మాట్లాడుతూ.. కోవిడ్ రోగులు, ఐసోలేషన్ లో ఉన్నవారు, వృద్ధులు, వంట చేసుకో లేని వారి కోసం తమ ట్రస్టు ద్వారా మధ్యాహ్నం, రాత్రి రెండు పూటలా భోజనం అందించాలని నిర్ణయించుకోవడం జరిగిందని తెలిపారు.
ఎవరైతే భోజనం కోసం ఇబ్బంది పడుతున్నారో వారు ఒక్క ఫోన్ చేస్తే చాలు వారికి భోజనం ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. భోజనం కావలసినవారు మొబైల్ 9553357920 నంబర్ కు ఫోన్ చేసి చెప్తే వారు ఉండే చోటికి వెళ్లి తమ వాళ్ళు భోజనం అందిస్తారని తెలిపారు. ఇందుకు ఒక వాహనాన్ని ఏర్పాటు చేశామని, ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల లోపు పైన తెలిపిన ఫోన్ నెంబర్ కు భోజనం కావాలని కోరితే అలాంటివారి మధ్యాహ్నం ,రాత్రికి రెండు పూటల భోజనం ఇస్తామని అన్నారు.
తమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇదివరకే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగుల సహాయకులు లాక్ డౌన్ లో భోజనానికి ఇబ్బందులు పడకూడదని మధ్యాహ్నం ఒక పూట భోజనం అందిస్తున్నామని, ఇప్పుడు ఇంకా మరింత మందికి భోజనం అందించాలనే ఉద్దేశంతో కోవిడ్ రోగులు, ఐసోలేషన్ లో ఉన్నవారికి కూడా భోజనం అందించే ఏర్పాట్లు చేసినట్లు ఆమె వెల్లడించారు. దీనిని మహబూబ్ నగర్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.