ఇంటి ముందు నీడ కోసం రేకుల షెడ్డును ఏర్పాటు చేసుకుంది ఆ కుటుంబం. అయితే ఆ రేకుల షెడ్డు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. కరెంట్ తీగలు రేకుల షెడ్డుకు తాకి, విద్యుత్ షాక్ (Current shock)తో తల్లి, కూతురు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. కామారెడ్డి (Kamareddy) జిల్లా బాన్సువాడ మండలం ఖాదాల పూర్ గ్రామానికి చెందిన గాదిగ తుకారాం, అంకిత (30) దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు గాదిగ అక్షర (6) యూకేజీ చదువుతుంది. అయితే ఏబీవీపీ పిలుపు మేరకు పాఠశాలల బంద్ చేశారు. ఆ కారణంగా ఇంటి వద్దే ఉంది అక్షర.. తన చెల్లెలు హరిద్రతో కలిసి ఇంటి వద్ద ఆడుకుంటుంది. అయితే గాదిగ తుకారాం తన ఇంటి ముందు నీడ కోసమని ఇటీవలే రేకుల షెడ్డు వేయించాడు. దీంతో కుటుంబ సభ్యులు రేకుల షెడ్ కిందే ఎక్కువ సమయం ఉంటున్నారు. అ రేకుల షెడ్డుకు ఓ సిలింగ్ ఫ్యాన్ కూడా బిగించారు. అయితే ఫ్యాన్ కోసం ఇంట్లో నుంచి తీసిన కరెంటు తీగలు తెగి ఇనుప రేకులకు తగిలింది. దీంతో ఒక్కసారిగా ఇనుప రాడ్లకు కరెంటు ప్రవహించింది.
ఇది తెలియని చిన్నారి (Kid) అక్షర ఆడుకుంటూ వచ్చి ఇనుప రాడ్‌కు పట్టుకుంది. ఒక్క సారిగా షాక్ కొట్టడంతో అమ్మా అని గట్టిగా అరిచింది. కూతురికి ఏమైందోనని తల్లి అంకిత వచ్చి చిన్నారిని పట్టుకోవడంతో ఆమెకు కూడా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో తల్లీకూతురు అక్కడికక్కడే మృతి చెందారు.
అంకిత, అక్షర (ఫైల్)
ఇంటికి చేరుకున్న భర్త చూసి..
తల్లి కూతుళ్లు (Mother and daughter)మృతి చెందిన కొద్ది సేపటికి గ్రామంలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఇదే సమయంలో అంకిత భర్త తుకారాం ఇంటికి చేరుకున్నారు. భార్య, కూతురు కింద పడిపోయి ఉన్నారు. వారిని చూసి పైకి లేపేందుకు ప్రయత్నించాడు. రేకుల షెడ్డుకు కొద్ది దూరంలోనే చిన్న కూతురు హరిద్ర ఆడుకుంటుంది. తండ్రిని చూసి పరుగున వచ్చింది. అయితే విగత జీవులుగా పడి ఉన్న భార్య, కూతురును చూసి బోరుమన్నాడు. విద్యుత్ షాక్ తో మృతి చెందారన్న విషయం తెలిసి తుకారాం షాక్ కు గురయ్యాడు.
అయితే తుకారం ఇంటికి వచ్చిన సమయంలో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చిన్న కూతురు తండ్రి ప్రాణాలతో బయటపడ్డారు.. లేదంటే వారి ప్రాణాలు కూడా కరెంట్ షాక్‌కు గురయ్యేవారని స్థానికులు చెబుతున్నారు.
పోచారం సంతాపం..
గ్రామంలో తల్లి కూతురు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భార్య, పెద్ద కూతురు మృతదేహలను చూసి తుకారం గుండెలవిసేలా రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. భర్త తుకారాం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఘటన పట్ల రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం బాన్సువాడ ఏరియా ఆసుపత్రి లో మృతదేహాలను సందర్శించిన స్పీకర్ పోచారం సంఘటన వివరాలను భర్త గాదిగ తుకారంను అడిగి తెలుసుకుని సంతాపం తెలిపారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.