Home /News /telangana /

THE CV RAMAN SCIENCE MUSEUM IS ONE OF THE BEST PLACES TO VISIT DURING THE SUMMER TO NURTURE CREATIVITY IN STUDENTS MDK PRV

Science Museum: విద్యార్థుల్లో సృజనాత్మక కోసం సైన్స్​ మ్యూజియం.. ఈ వేసవిలో సందర్శనకు బెస్ట్​ ప్లేస్ ఇదే​.. 

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

సీవీ రామన్ సైన్స్ మ్యూజియం. తెలంగాణ ఏర్పడిన తరువాత ఏర్పాటు చేసిన మొదటి సైన్స్ మ్యూజియం ఇది. ఇక్కడ ప్రయోగాలు వివరించేందుకు ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.

    (K.Veeranna, News18, Medak)

    సీవీ రామన్ సైన్స్ మ్యూజియం (CV Raman Science Museum). తెలంగాణ ఏర్పడిన తరువాత ఏర్పాటు చేసిన మొదటి సైన్స్ మ్యూజియం ఇది. ఇక్కడ ప్రయోగాలు వివరించేందుకు ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.  సైన్స్ కాంగ్రెస్, సైన్స్ఫర్, మానక్ ఇన్స్పైర్ వంటి పోటీలకు సిద్ధం అయ్యేందుకు ఉపయోగపడతాయి. సైన్స్ నాలెడ్జ్​లో విద్యార్థులు ముందుండాలని సంగారెడ్డి (Sangareddy) జిల్లా కేంద్రంలో మ్యూజియం  ఏర్పాటు చేశారు.మ్యూజియాల సందర్శనతో విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు (to nurture creativity) వస్తాయి. అవి విద్యార్థి  (Student) ఎదుగుదలలో ఎంతగానో ఉపకరిస్తాయి. అందుకే విద్యార్థులకు ఈ వేసవి (Summer)లో సీవీ రామన్ సైన్స్ మ్యూజియం వేదికైంది.

    సంగారెడ్డి జిల్లాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోన్న ఈ మ్యూజియం ఆరు నెలల కిందటే పూర్తయ్యింది. మంత్రి హరీశ్ రావు (Harish Rao) చేతుల మీదుగా ప్రారంభించిన తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రులకు సందర్శనకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ శుభదినం రానే వచ్చింది. నేటి నుంచి మ్యూజియం అందరికీ రానుంది. ఇందుకు నిధులు కూడా పాలనాధికారి  హనుమంతరావు ప్రత్యేకంగా కేటాయించారు. బిర్లా సైన్స్ మ్యూజియం వారి సహకారంతో ప్రయోగ పరికాలు బిగించారు. ఇది ప్రస్తుతం  ప్రారంభోత్సవానికి సిద్ధంగా  ఉంది.

    సర్వాంగ సుందరంగా..

    సంగారెడ్డి పట్టణం పాత డీఆర్డీఏలో జిల్లా సైన్స్ (Science) కేంద్రాన్ని రూ.1.50 కోట్లతో సర్వాంగ సుందరంగా నిర్మించారు. ఇక్కడ 58 రకాల ప్రయోగ పరికరాలను అమర్చారు. ఇందులో సైన్సుకు సంబంధించినవే కాకుండా భౌతికశాస్త్రం-22, ఎలక్ట్రానిక్స్-6, అంతరిక్షం-13, గణితం, జీవశాస్త్ర పరికరాలు, శాస్త్రవేత్తలకు సంబంధించిన వివరాలను అమర్చారు. వీటితోపాటు అన్ని విభాగాలకు సంబంధించిన ప్రయోగాలు ఉన్నాయి. విజ్ఞానంతో పాటు వినోదం పంచేలా ఏర్పాటు చేశారు.

    మ్యూజియం


    బొటానిక్ గార్డెన్​ ప్రత్యేకతలు..

    దేశంలో పదుల సంఖ్యలో మ్యూజియాలు ఉన్నా గణితానికి సంబంధించిన ప్రయోగ పరికరాలు ఎక్కడా లేవు. ఇక్కడ ప్రత్యేకంగా వీటిని ఏర్పాటు చేశారు. 10 రకాల ప్రయోగాలు, వంద సిద్ధాంతాలను వివరించేలా ప్రయోగ పరికరాలు ఉంచారు. విద్యార్థులు వీటిని వీక్షించి గణితంపై పట్టు సాధించేలా చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇక్కడ బొటానికల్ గార్డెన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో 104 రకాల మొక్కలను నాటించారు. 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు పాఠ్యాంశంలో వచ్చే మొక్కలను ఉంచారు. విద్యార్థుల ఈ మొక్కల గురించి కూడా వివరిస్తారు. పాఠాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.సెమినార్ హాల్లో వివిధ రకాల ప్రయోగాలకు సంబంధించి వీడియోలను విద్యార్థులకు ప్రత్యక్ష్యంగాచూపుతూ వివరిస్తారు.

    మ్యూజియం


    సైన్స్ మ్యూజియంలో విద్యార్థులను ఆకర్షించేందుకు డైనోసర్, డోబ్ వంటి బొమ్మలు, పలువురి శాస్త్రవేత్తల జీవిత చరిత్రను తెలుపుతూ వారి చిత్రపటాలు,వివరాలను అమర్చారు.సందర్శన వేళలు..ఈ నెల 20 నుంచి సీవీ రామన్ సైన్స్ మ్యూజియంలో సందర్శనకు అనుమతి ఇస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సందర్శించవచ్చు.

    స్థితి శక్తిని గతి శక్తిగా మార్చడం..

    భూమి నుంచి కొంత ఎత్తులో ఉన్న 2 బంతులను అక్కడి నుంచి వదిలినప్పుడు వాటి పతనమార్గాలు వేరైనప్పుడు (వాలు తలం వెంట 1. సరళరేఖా మార్గం, 2. వక్రమార్గం) అవి భూమిని చేరే సమయంలో స్థితి శక్తి గతి శక్తిగా మారుతోంది. రెండు బంతులను ఓకే సారి కిందికి వేయడం వల్ల వాటి చలనంలో మార్పులు జరుగుతాయి. ఏది ముందుగా చేరుకుంటుందో గమనించాలి.

    మ్యూజియం


    సమాంతర దర్పణాల మధ్య అనంతమైన ప్రతిబింబాలు ఏర్పడతాయి. బావిలో రెండు అద్దాలను అమర్చారు. వీటిలో చూస్తే అనేక ప్రతిబింబాలు కనిపిస్తాయి. బింబం ఒకటే అయినా అనేక ప్రతిబింబాలు చూపించడం దీని ప్రత్యేకత. కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమంతో పని చేస్తుంది. సైకిల్ టైర్ను తిప్పి చేతిలో పట్టుకోవాలి. కుడి వైపు తిప్పితే మీరు కూర్చున్న కుర్చీ ఎడమ వైపు వస్తుంది.
    ఎడమ వైపు తిప్పితే కుర్చీ కుడి వైపు వస్తుంది. ఈ మ్యూజియం విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని జిల్లా సైన్స్ అధికారి విజయకుమార్ అన్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Medak, Sangareddy, Science and technology, Students, Summer special

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు