Home /News /telangana /

THE CORPSES WERE MANIPULATED IN SIDDIPETA KOVID HOSPITAL VB

Telangana: కరోనా మృతదేహాలు తారుమారు.. సమాచారం అందించేలోపే అంత్యక్రియలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: సిద్దిపేట కోవిడ్ సెంటర్ లో కరోనా మృత దేహాలు తారుమారయ్యాయి. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఒకరికి అప్పగించాల్సిన శవాన్ని మరో కుటుంబసభ్యులకు ఇచ్చారు. తప్పు తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది ఫోన్ చేయగా అప్పటికే కార్యక్రమాలు పూర్తి చేసినట్లు తెలిపారు.

ఇంకా చదవండి ...
    సిద్దిపేట కొవిడ్ సెంటర్లో కరోనా మృతుల శవాలు తారుమారైన ఘటన చోటుచేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. చేర్యాల మండలం వీరన్నపేట గ్రామా నికి చెందిన వజ్రమ్మ(65) అనే వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో సిద్దిపేట కోవిడ్ సెంటర్ లో చేర్చారు. ఆమె మృతి చెందగా కుటుంబసభ్యులకు ఆసుపత్రి సిబ్బంది సమాచారం అందించారు. వారు రాత్రి పూట సమాచారం అందించడంతో ఉదయాన్నే వచ్చి తీసుకెళ్తామని సిబ్బందికి తెలిపారు. ఉదయం ఆసుపత్రికి వచ్చి వజ్రమ్మ పేరిట ఉన్న శవాన్ని సిబ్బంది అప్పగించారు. అక్కడ నుంచి శవాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ఆ శవం తమ బంధువుది కాదని గుర్తించారు. వెంటనే సిబ్బందికి తెలియజేశారు. అదే రోజు వీరన్నపేట గ్రామస్తులు రాకముందే అదే పేరుతో ఉన్న మరో వృద్ధురాలు మరణించింది. పొరపాటున వాళ్లు వీరన్నపేట గ్రామానికి చెందిన వజ్రమ్మ శవాన్ని సిద్దిపేట పట్టణానికి చెందిన వారికి ఇచ్చేశారు.

    వారు అక్కడ నుంచి ఆ శవాన్ని తీసుకెళ్లారు. తప్పు తెలుసుకున్న సిద్దిపేట పట్టణానికి చెందిన వజ్రమ్మ బంధువులకు ఫోన్ చేయగా అప్పటికే కార్యక్రమాలు పూర్తి చేసినట్లు తెలిపారు. శవాలు తారుమారు అయ్యాయని మీ బంధువు శవాన్ని తీసుకెళ్లండని సిబ్బంది ఫోన్ చేయగా మళ్లీ ఫోన్ చేస్తామని చెప్పి కట్ చేశారు. జరిగిన విషయాన్ని వీరన్నపేట గ్రమస్తులకు చెప్పడంతో వారు ఆసుపత్రి నుంచి వెనక్కి వెళ్లిపోయారు.

    ప్రతీకాత్మక చిత్రం


    మొదట మృతదేహాన్ని తీసుకువెళ్లిన వారికి మళ్లీ ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దాంతో ఆసుపత్రి సిబ్బందికి ఏం చేయాలో తోచక మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. ఇలా సిబ్బంది నిర్లక్షంతో శవాలు తారుమరయ్యాయి.
    Published by:Veera Babu
    First published:

    Tags: Corona cases, Dead bodies interchanged, Siddipeta

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు